ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇదేనా..? బిగ్‌బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ కేసులో ఇదేం ట్విస్ట్..

ABN , Publish Date - Dec 20 , 2023 | 02:32 PM

బిగ్‌బాస్‌ సీజన్‌ 7 ఫైనల్స్‌ సందర్భంగా అన్నపూర్ణ 7 ఏకర్స్ వద్ద జరిగిన గొడవ, విధ్వంసం విషయంలో A1 పల్లవి ప్రశాంత్, A2 ప్రశాంత్ సోదరుడు, A3 వినయ్, A4 డ్రైవర్ సాయికిరణ్, A5‌గా రాజుని నిందితులుగా పరిగణిస్తూ.. పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసుపై ముందస్తు బెయిల్ కోసం ప్రశాంత్ లాయర్ రాజేష్ కుమార్ పోలీసులను సంప్రదించగా.. వారు ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వడానికి నిరాకరించారు.

ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇదేనా..? బిగ్‌బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ కేసులో ఇదేం ట్విస్ట్..
Pallavi Prashanth

బిగ్‌బాస్‌ సీజన్‌ 7 (Bigg Boss Season 7) ఫైనల్స్‌ సందర్భంగా అన్నపూర్ణ 7 ఏకర్స్ వద్ద జరిగిన గొడవ, విధ్వంసం విషయంలో A1 పల్లవి ప్రశాంత్, A2 ప్రశాంత్ సోదరుడు, A3 వినయ్, A4 డ్రైవర్ సాయికిరణ్, A5‌గా రాజుని నిందితులుగా పరిగణిస్తూ.. పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. వీరిలో డ్రైవర్ సాయికిరణ్, రాజులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తుండగా.. విన్నర్ పల్లవి ప్రశాంత్ (Bigg Boss Winner Pallavi Prashanth) మాత్రం పరారీలో ఉన్నట్లుగా టాక్ వినిపిస్తోంది. పోలీసుల ఇన్వెస్టిగేషన్‌లో మరికొంతమంది నిందితులు చేరే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ కేసులో ఇప్పుడో ట్విస్ట్ నడుస్తోంది. ఈ కేసులో పల్లవి ప్రశాంత్ పాత్ర ఏంటో చెబితే బెయిల్‌కి దరఖాస్తు చేస్తామని.. పల్లవి ప్రశాంత్ లాయర్ పోలీసులను సంప్రదించగా.. పోలీసులు ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వడం లేదంటూ ఆయన మీడియాకు తెలియజేశారు.

ABN ఆంధ్రజ్యోతితో పల్లవి ప్రశాంత్ అడ్వకేట్ రాజేష్ కుమార్ (Rajesh Kumar) ప్రత్యేకంగా మాట్లాడారు. ‘‘పల్లవి ప్రశాంత్‌పై నమోదు అయిన కేసు ఎఫ్ఐఆర్ వివరాలను అడిగాం. కానీ పోలీసులు ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వడం లేదు. పబ్లిక్ డొమైన్‌లో పెట్టాల్సిన ఎఫ్ఐఆర్ కాపీని ఎందుకు గోప్యంగా ఉంచుతున్నారు. రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇదేనా? పల్లవి ప్రశాంత్ ప్రస్తుతం పరారీ‌లో ఉన్నాడని, ఎఫ్ఐఆర్ (FIR) కాపీ కోసం కుటుంబ సభ్యులు రావాలని ఇన్‌స్పెక్టర్ చెబుతున్నారు. ఈ కేసులో పల్లవి ప్రశాంత్ పాత్ర ఏంటో ఎఫ్ఐఆర్ కాపీ చూస్తేనే తెలుస్తుంది. ఎఫ్ఐఆర్ కాపీ లేకపోవడంతో బెయిల్ దరఖాస్తు చేసుకోలేక పోతున్నాము..’’ అని అడ్వకేట్ రాజేష్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఈ కేసు మరింత ఆసక్తికరంగా మారింది. మరో వైపు బిగ్ బాస్ షో పై కూడా కేసులు నమోదవుతున్నాయి. చూస్తుంటే, ఈ వ్యవహారం ముందు ముందు మరింత ముదిరేలానే కనిపిస్తోంది.


Pallavi.jpg

అసలు బిగ్‌బాస్ సీజన్ 7 గ్రాండ్ ఫినాలే (Bigg Boss Season 7 Grand Finale) రోజు ఏం జరిగిందంటే?

బిగ్‌బాస్‌ సీజన్‌ 7 ఫైనల్స్‌ సందర్భంగా అన్నపూర్ణ 7 ఏకర్స్‌కు అభిమానులు భారీగా చేసుకున్నారు. బిగ్‌బాస్‌(Big Boss) ఫైనల్‌ విజేత పల్లవి ప్రశాంత్‌ విజయోత్సవ ర్యాలీ కోసం వచ్చిన అభిమానులు, రన్నర్‌గా నిలిచిన అమర్‌దీప్ (Amardeep) అభిమానులతో ఘర్షణకు దిగారు. ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. ఈ ఘటనలో పలువురు బిగ్ బాస్ కంటెస్టెంట్ల కార్ల అద్దాలు ధ్వంసం అయ్యాయి. అదే దారిలో వస్తున్న ఆర్టీసీ బస్సు‌పై కూడా రాళ్లు విసరడంతో.. ఆ బస్సు అద్దాలు కూడా ధ్వంసం అయ్యాయి. దీంతో పబ్లిక్ న్యూసెన్స్ కింద వారందరిపై కేసులు నమోదయ్యాయి. ఈ ఘటనలో రాళ్ల దాడులకు పాల్పడిన నిందితులను గుర్తించేందుకు పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

====================

*Amardeep: కోపం ఉంటే చెప్పండి.. ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా?

**********************************

*Pallavi Prashanth: పరారీలో పల్లవి ప్రశాంత్ అంటూ వార్తలు.. ‘నేనేం తప్పు చేశా’ అంటూ వీడియో వదిలిన విన్నర్

*********************************

*కార్పొరేట్‌ గుప్పెట్లో చిత్ర పరిశ్రమ: గేయ రచయిత హాట్ హాట్ కామెంట్స్

**********************************

*Sara Ali Khan: సారా అలీఖాన్ కోరిక ఏంటో తెలుసా?

**********************************

Updated Date - Dec 20 , 2023 | 02:32 PM