Pallavi Prashanth: పరారీలో పల్లవి ప్రశాంత్ అంటూ వార్తలు.. ‘నేనేం తప్పు చేశా’ అంటూ వీడియో వదిలిన విన్నర్

ABN , Publish Date - Dec 20 , 2023 | 11:22 AM

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ పరారీలో ఉన్నాడంటూ వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. బిగ్‌బాస్ సీజన్ 7 గ్రాండ్ ఫినాలే రోజు విన్నర్ ప్రశాంత్ అని తెలిసిన తర్వాత.. బిగ్‌బాస్ హౌస్ వెలుపల పెద్ద యుద్ధమే జరిగింది. పల్లవి ప్రశాంత్ అభిమానులు పబ్లిక్ న్యూసెన్స్ క్రియేట్ చేయడంతో పాటు.. అక్కడున్న కార్లు, ఒక ఆర్టీసీ బస్సు అద్దాలను ధ్వంసం చేశారు. ఈ ఘటనపై పల్లవిపై కేసు నమోదైంది.

Pallavi Prashanth: పరారీలో పల్లవి ప్రశాంత్ అంటూ వార్తలు.. ‘నేనేం తప్పు చేశా’ అంటూ వీడియో వదిలిన విన్నర్
Pallavi Prashanth

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ (Pallavi Prashanth) పరారీలో ఉన్నాడంటూ వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. బిగ్‌బాస్ సీజన్ 7 గ్రాండ్ ఫినాలే (Bigg Boss Season 7 Grand Finale) రోజు విన్నర్ ప్రశాంత్ అని తెలిసిన తర్వాత.. బిగ్‌బాస్ హౌస్ వెలుపల పెద్ద యుద్ధమే జరిగింది. పల్లవి ప్రశాంత్ అభిమానులు పబ్లిక్ న్యూసెన్స్ క్రియేట్ చేయడంతో పాటు.. అక్కడున్న కార్లు, ఒక ఆర్టీసీ బస్సు అద్దాలను ధ్వంసం చేశారు. ఈ పబ్లిక్ న్యూసెన్స్‌కు కారణమైన పల్లవి ప్రశాంత్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రధాన నిందితుడిగా ఉన్న అతనిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు 3 బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు. పల్లవి ప్రశాంత్ ఫోన్ స్విచ్ఛాప్ చేసి పరారీలో ఉన్నాడని పోలీసులు చెబుతున్నారు. దీంతో ప్రశాంత్ అనుచరులను అదుపులోకి తీసుకుని అతడి ఆచూకీ కోసం పోలీసులు ఆరా తీస్తున్నట్లుగా తెలుస్తోంది.

సిద్దిపేట జిల్లా గజ్వేల్ సమీపంలోని కొల్లూరుకు చెందిన ప్రశాంత్.. కొమరవెల్లి సమీపంలోని ఓ గ్రామంలో ఉన్నట్లుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కొమరవెల్లికి ఓ టీమ్‌ని పంపినట్టు సమాచారం. అలాగే ఈ ఘటనకు కారణమైన మరో ఇద్దరిని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ‘నేనేం తప్పు చేశా.. ఒక రైతు బిడ్డ గెలవడం ఇష్టం లేని కొందరు కావాలనే నెగిటివిటీని నాపై సృష్టిస్తున్నారు’ అంటూ పల్లవి ప్రశాంత్ తన ఇన్‌స్టా వేదికగా ఓ వీడియోని షేర్ చేశారు. ఈ వీడియోలో.. (Bigg Boss Winner Pallavi Prashanth)


Pallavi.jpg

‘‘నాకు ఇవాళ చాలా బాధగా ఉంది.. బిగ్‌బాస్ ట్రోఫీ గెలిచిన ఆనందం కూడా లేకుండా చేస్తున్నారు. ఇవాళ ఒక రైతుబిడ్డ గెలిచాడని అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మా ఊర్లో నాకు ఘన స్వాగతం పలికారు. నేను బిగ్‌బాస్ హౌస్ నుండి విన్నర్‌‌గా బయటకి వచ్చాక నా కోసం ఇంతమంది వచ్చారా అని ఎంతో ఆనందపడ్డాను. కానీ మీడియా వాళ్ళు నన్ను నెగిటివ్ చేద్దామని చూస్తున్నారు. నా కోసం హౌస్ బయట దాదాపు 70 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. అందరూ 5 నిమిషాలు, 10 నిమిషాలు ఇంటర్వ్యూ కావాలని అడుగుతున్నారు. అయితే నేను అప్పటికే అలిసిపోయా.. ఒక వైపు బాగా ఆకలి వేస్తుంది, ఏం తినలేదు అందరికీ ఇంటర్వ్యూలు తర్వాత ఇస్తాను అని చెప్పా. అంతే.. నాపై నెగిటివ్‌గా వీడియోలు మొదలెట్టారు. ఒక రైతు బిడ్డ గెలవడం తప్పా? నేను తప్పు చేశానా లేదా? అనేది మా వాళ్లకి తెలుసు’’ అంటూ హౌస్‌లో ఎలా అయితే సింపతీని రాబట్టుకున్నాడో.. అలాగే ఈ వీడియోలోనూ ఎమోషనల్ అయ్యాడు. ప్రస్తుతం పల్లవి ప్రశాంత్ షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


ఇవి కూడా చదవండి:

====================

*కార్పొరేట్‌ గుప్పెట్లో చిత్ర పరిశ్రమ: గేయ రచయిత హాట్ హాట్ కామెంట్స్

**********************************

*Sara Ali Khan: సారా అలీఖాన్ కోరిక ఏంటో తెలుసా?

**********************************

Updated Date - Dec 20 , 2023 | 11:29 AM