Bhagavanth Kesari: బాలకృష్ణ సినిమా, అన్నయ్య హరికృష్ణ సినిమాకి రీమేకా? నిర్మాతలు ఏమంటున్నారు అంటే...

ABN , First Publish Date - 2023-08-15T12:50:33+05:30 IST

బాలకృష్ణ, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తున్న 'భగవంత్ కేసరి' సినిమా అప్పుడెప్పుడో వచ్చిన నందమూరి హరికిష్ణ 'స్వామి' సినిమాకి రీమేక్ అని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీనికి నిర్మాతలు దిమ్మతిరిగే సమాధానం ఇచ్చారు.

Bhagavanth Kesari: బాలకృష్ణ సినిమా, అన్నయ్య హరికృష్ణ సినిమాకి రీమేకా? నిర్మాతలు ఏమంటున్నారు అంటే...
Balakrishna from Bhagavanth Kesari

నందమూరి బాలకృష్ణ (NandamuriBalakrishna) నటిస్తున్న 'భగవంత్ కేసరి' #BhagavanthKesari సినిమా అక్టోబర్ 19న విడుదలకు సిద్ధం అవుతోంది. దీనికి అనిల్ రావిపూడి (AnilRavipudi) దర్శకుడు కాగా, ఇందులో శ్రీలీల (Sreeleela), కాజల్ అగర్వాల్ (KajalAggarwal) నటిస్తున్నారు. అయితే శ్రీలీల, బాలకృష్ణకి కూతురుగా వేస్తోంది, అలాగే బాలకృష్ణ ఇందులో ఒక మధ్యవయస్కుడిగా కనిపించనున్నాడు. అతని పోస్టర్స్ కూడా విడుదలయ్యాయి. ఇప్పుడు సాంఘీక మాధ్యమంలో ఈ సినిమా గురించి ఒక వార్త చక్కర్లు కొడుతోంది, అదేంటి అంటే ఈ 'భగవంత్ కేసరి' అప్పుడప్పుడే విడుదలైన నందమూరి హరికృష్ణ (Nandamuri Harikrishna) నటించిన 'స్వామి' సినిమాకి అనధికార రీమేక్ అని.

bhagavanthkesari-poster.jpg

ఈ విషయాన్ని ఈ చిత్ర నిర్మాతలు ఖండించారు, ఇది రీమేక్ కాదు అని చెప్పారు. ఈ సినిమాకి సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మాతలు. ఇందులో బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ (ArjunRampal) నటిస్తున్నాడు, అతని షూటింగ్ కూడా అయిపోయింది అని అతను, బాలకృష్ణ కలిపి పోజు ఇచ్చిన ఫోటోస్ కూడా పోస్ట్ చేసాడు, అవి కూడా వైరల్ అవుతున్నాయి.

swami.jpg

ఈ సినిమాలో బాలకృష్ణ కూతురుగా శ్రీలీల వేస్తోంది, అందులో కూడా హరికృష్ణ కి ఒక కూతురు, భార్యగా మీనా (Meena) వేశారు, ఇందులో భార్యగా కాజల్ అగర్వాల్ అని, ఆలా ఆ సినిమాకి, ఈ సినిమాకి పోలికలు పెడుతూ 2004 లో విడుదలైన ఆ హరికృష్ణ సినిమాకి, ఇప్పుడు అతని తమ్ముడు బాలకృష్ణ సినిమాకి ముడి పెట్టారు చాలామంది. దానికి చాలా గట్టిగానే బదులిచ్చారు నిర్మాతలు. ఇది రీమేకా కాదా అన్నదానికి నిర్మాతలు సమాధానం చెపుతూ, "అసలు నిజం ఏంటి అంటే అక్టోబర్ 19న భారీగా చూస్తారు. ఇంతకు ముందు ఎన్నడూ చూడని బాలకృష్ణ ని బిగ్ స్క్రీన్స్ మీద చూస్తారు," అని పోస్ట్ చేశారు.

Updated Date - 2023-08-15T15:23:42+05:30 IST