సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Tamanna: పొంగల్‌కి శృతిహాసన్.. ఇండిపెండెన్స్ డేకి తమన్నా..

ABN, First Publish Date - 2023-05-08T21:25:20+05:30

వరసగా విడుదలైన ఇద్దరు అగ్ర హీరోల చిత్రాలలో నటించిన ఘనత శృతిహాసన్ సొంతం చేసుకోగా.. ఇప్పుడు మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా (Tamannaah Bhatia) వంతొచ్చింది. వివరాల్లోకి వెళితే..

Tamannaah Bhatia and Shruti Haasan
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సంక్రాంతికి శృతిహాసన్ (Shruti Haasan) నటించిన రెండు సినిమాలు వరుసగా విడుదలైన విషయం తెలిసిందే. నటసింహం నందమూరి బాలయ్య హీరోగా నటించిన ‘వీర సింహారెడ్డి’ (Veera Simha Reddy) చిత్రంలోనూ, అలాగే మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya)లోనూ శృతిహాసనే హీరోయిన్. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నాయి. ఇలా వరసగా విడుదలైన ఇద్దరు అగ్ర హీరోల చిత్రాలలో నటించిన ఘనత శృతిహాసన్ సొంతం చేసుకోగా.. ఇప్పుడు మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా (Tamannaah Bhatia) వంతొచ్చింది.

ఇండిపెండెన్స్ డే‌ (Independence Day) స్పెషల్‌గా ఇటు తెలుగు, అటు తమిళ భాషల్లో ఇద్దరు అగ్రహీరోలతో కలిసి తమన్నా నటించిన చిత్రాలు విడుదలకానున్నాయి. వీటిలో ఒకటి సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ (Super Star Rajinikanth) ‘జైలర్‌’ (Jailer) కాగా, మరొకటి మెగాస్టార్‌ చిరంజీవి (Megastar Chiranjeevi) నటించిన ‘భోళాశంకర్‌’ (Bholaa Shankar). నిజానికి తమన్నా సినీ కెరీర్‌ ముగిసిపోయిందంటూ జోరుగా ప్రచారం సాగింది. ఇలాంటి తరుణంలో ఆమెకు ఏకంగా ఇద్దరు అగ్రహీరోలతో నటించే అవకాశం వరించింది. దీంతో ఒక్కసారిగా ఆమె ఫోకస్‌లోకి వచ్చింది.

ఇక రజనీకాంత్‌తో నటించిన ‘జైలర్’ చిత్రం ఆగస్ట్ 10న విడుదల కాబోతుండగా.. మెగాస్టార్ చిరంజీవితో నటించిన ‘భోళాశంకర్’ చిత్రం ఆ మరుసటి రోజు అంటే ఆగస్ట్ 11న విడుదల కానుంది. సంక్రాంతి (Sankranthi)కి కూడా ఇలానే మెగాస్టార్ చిత్రం బాలయ్య (Balayya) సినిమా విడుదల తర్వాత వచ్చి బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టించింది. ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద ఏం జరగబోతోందో చూడాలి. ఇక తమన్నా విషయానికి వస్తే.. ఇపుడు మిల్కీబ్యూటీ ఈ రెండు చిత్రాలతో పాటు మరికొన్ని కొత్త ప్రాజెక్టులకు కూడా కమిట్‌ అయ్యారు. అదేసమయంలో ఆమె.. తన ప్రియుడిని వివాహం చేసుకోబోతున్నారనేలా ప్రచారం కూడా సాగుతోంది. దీనిపై తమన్నా ఓ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి:

************************************************

*The Kerala Story: మరో స్టేట్‌లో నిషేధం.. షాక్‌లో చిత్రయూనిట్

*Shah Rukh Khan: అద్భుతాలు జరగడానికి సమయం పడుతుంది.. వెయిట్ అండ్ సీ..

*OG: చాలా గ్యాప్ తర్వాత.. పవన్ కల్యాణ్‌ నుంచి ఊహించని ట్వీట్

*Balagam: ఉత్త‌మ న‌టుడు సాయిలు, ఉత్త‌మ స‌హన‌టుడు కొమురయ్య.. మరో ప్రతిష్టాత్మక అవార్డ్

*Bhookailas: ఎన్టీఆర్, ఏఎన్నార్‌లకు ఉదయం 5 గంటలకు షూటింగ్ అని చెప్పిన దర్శకుడు రాకపోవడంతో..?

*Farhana: ఇస్లాంకు వ్యతిరేకం కాదు.. కేరళ స్టోరీ కాంట్రవర్సీతో చిత్రయూనిట్ ముందు జాగ్రత్త చర్యలు

Updated Date - 2023-05-08T21:25:20+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!