Tillu Square: ‘టిల్లు స్క్వేర్’‌లోని రాధిక సాంగ్ ప్రోమో

ABN, First Publish Date - 2023-11-25T16:26:04+05:30 IST

కల్ట్ బ్లాక్‌బస్టర్ ‘డీజే టిల్లు’లో టిల్లు వంటి వినోదాత్మక పాత్రతో స్టార్‌బాయ్ సిద్ధు అలరించారు. సిద్ధుని టిల్లు పాత్రలో మరోసారి చూడాలని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుండటంతో.. సిద్ధు, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ కలిసి ‘డీజే టిల్లు’ చిత్రానికి సీక్వెల్‌‌గా ‘టిల్లు స్క్వేర్’ని రూపొందిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన ప్రొమోషనల్ కంటెంట్ వైరల్ అవగా.. తాజాగా ఇందులోని ‘రాధిక’ సాంగ్ ప్రోమోని మేకర్స్ వదిలారు.