Vijay Deverakonda: ఆరోగ్యం బాగాలేక సమంత మాతో మాట్లాడటం మానేసింది

ABN , First Publish Date - 2023-08-16T13:22:07+05:30 IST

విజయ్ దేవరకొండ 'ఖుషి' సినిమా ప్రచారాల్లో భాగంగా ఈ సినిమా ఎందుకు హిట్ అవ్వాలి, దీనివెనుక ఎంతమంది కష్టం వుంది అని చాలా భావోద్వేగంగా చెప్పాడు. అలాగే సమంత ఆరోగ్య పరిస్థితి, ఆమె కోలుకొని మళ్ళీ ఈ సినిమా షూటింగ్ పూర్తి చెయ్యడం, ఆమె ఎంతోమందికి స్ఫూర్తి అవ్వాలని, అందుకనే ఆమె కోసం ఈ సినిమా హిట్ అవ్వాలని చెప్పాడు.

Vijay Deverakonda: ఆరోగ్యం బాగాలేక సమంత మాతో మాట్లాడటం మానేసింది
Vijay Deverakonda and Samantha at Khushi live music concert

విజయ్ దేవరకొండ (VijayDeverakonda), సమంత (Samantha) జంటగా నటించిన 'ఖుషి' #Khushi సినిమా మ్యూజిక్ కన్సర్ట్ (MusicConcert) ఆగస్టు 15 న హైద్రాబాదులో జరిగింది. శివ నిర్వాణ (ShivaNirvana) ఈ సినిమాకి దర్శకుడు. ఈ సందర్భంగా కథానాయకుడు విజయ్ దేవరకొండ తన పక్కన నటించిన సమంత గురించి ఎంతో భావోద్వేగంగా మాట్లాడి ఆమె కోసం ఈ సినిమా హిట్ అవ్వాలని అన్నాడు. ఈ సినిమా గురించి ఎంత స్ట్రగుల్ అయింది, అలాగే ఈ సినిమా షూటింగ్ ఎంత లేట్ అవుతునా దర్శకుడు కానీ, మిగతా వాళ్ళు కానీ ఎవరూ ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఎలా ఓపిగ్గా ఎదురుచూసారు అనే విషయం కూడా చెప్పాడు.

khushistill.jpg

"మీ అందరూ సెలబ్రేట్ చేసుకునే సినిమా ఇచ్చి ఎంతకాలం అవుతుందో గుర్తులేదు. మీ అందరికీ ఓ సూపర్ హిట్ బాకీ ఉన్నా. గత నెల రోజులుగా ఈ సినిమా వర్క్స్ గురించి డైరెక్టర్ శివతో రెగ్యులర్ గా మాట్లాడుతూనే ఉన్నా. ప్రతిసారీ ఆయన చెప్పే మాట ఏంటంటే, సెప్టెంబర్ 1న నీ మొహంలో నవ్వు చూడాలి విజయ్ బ్రో అని. అదొక్కటే గుర్తు పెట్టుకుని పనిచేస్తున్నా అనేవాడు. ఆ విషయం ఒక్కటి చాలు శివకు నా మీద ఎంత ప్రేమ ఉందో," అని చెప్పాడు విజయ దేవరకొండ.

khushi-team1.jpg

అలాగే ఈ సినిమా సక్సెస్ సంతోషం నా ఫేస్ లో కాదు సమంతలో చూడాలి అని చెప్పాడు. ఎందుకంటే ఆమె ఈ సినిమా కోసం ఎంత కష్టపడిందో చెప్పలేను. "ఏప్రిల్ లో ఎంతో హ్యాపీగా సినిమాను స్టార్ట్ చేశాం. మేజర్ పార్ట్ షూటింగ్ కంప్లీట్ అయ్యింది. జూలైలో 30, 35 డేస్ షూట్ మిగిలినప్పుడు సమంత తనకు ఆరోగ్యం బాగా లేదని చెప్పింది. నువ్వు ఇంత బ్యూటిఫుల్ గా ఉన్నావ్, నువ్వు హెల్దీగా ఉంటావ్ అని నేను, శివ సమంతకు చెప్పేవాళ్లం. మొదట్లో 3 డేస్, ఆ తర్వాత 2 వీక్స్ టైమ్ తీసుకుంది. అయినా ఆరోగ్యం బాగు కాలేదు. నేను వేరే సినిమా ప్రమోషన్ కోసం వెళ్లినప్పుడు ఆమె హెల్త్ కండీషన్ గురించి తెలిసింది," అని విజయ్ సమంత గురించి చెప్పాడు.

సమంత ఆరోగ్యం గురించి మాట్లాడొద్దు అనుకున్నా, ఎందుకంటే యాక్టర్స్ గా ప్రేక్షకుల్ని నవ్వించాలి, కానీ బాధల్ని చెప్పకూడదు అని. కానీ ఈ సినిమా కోసం కొన్ని రోజులు ఆరోగ్యం బాగాలేక సమంత మాతో మాట్లాడటం మానేసింది, అంటే ఆమె అంతగా స్ట్రగుల్ అయింది అని చెప్పాడు. ఒక సందర్భంలో సమంత తన ఆరోగ్యం గురించి మాట్లాడేందుకు ముందుకొచ్చింది. ఎందుకంటే కోవిడ్ తర్వాత ఎంతోమంది ఇలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారు. నేనూ మీలాగే బ్యాటిల్ చేస్తున్నా అని వారికి ధైర్యం చెప్పేందుకు సమంత తన హెల్త్ కండీషన్ వెల్లడించింది. #Khushi ఈరోజు చాలామంది వచ్చి సమంత మాకు ఇన్సిపిరేషన్ అని చెబుతున్నారు. వాళ్లు ఎదుర్కొంటున్న ప్రాబ్లమ్స్ షేర్ చేసుకుంటున్నారు. ఇప్పటికీ ఆమెకు బాగాలేదు. అయినా మన కోసం ఆమె ఇక్కడికి వచ్చింది. డ్యాన్స్ చేసింది. సెప్టెంబర్ 1న సమంతకు హిట్ ఇవ్వాలని కోరుకుంటున్నా. అలాగే మా డైరెక్టర్ శివకు హిట్ ఇవ్వాలని కోరుకుంటున్నా, అని చాలా భావోద్వేగంగా విజయ్ సమంత గురించి మాట్లాడేడు.

vijaydeverakonda2.jpg

డియర్ కామ్రేడ్ టైమ్ లో దర్శకుడు శివ ఈ స్క్రిప్ట్ చెప్పాడు, విపరీతంగా నచ్చింది, కానీ లవ్ స్టోరీస్ చేయొద్దని హోల్డ్ చేస్తూ వచ్చాను అని అన్నాడు. షూటింగ్ లో ఎన్ని హర్డిల్స్ వచ్చినా ఇప్పటిదాకా ఒక్కరోజు కూడా శివ దేని గురించి కంప్లైంట్ చేయలేదు. సినిమాను ప్రేమిస్తూ, నవ్వుతూ వర్క్ చేస్తూ వచ్చాడు. అతని కోసం సినిమా హిట్ కావాలి అని చెప్పాడు విజయ్.

Updated Date - 2023-08-16T13:22:07+05:30 IST