Vijay Deverakonda: 'ఖుషీ' ప్రచారాలు వెరైటీగా, ఈసారి హిట్ కొడుతున్నామన్న ధీమా

ABN , First Publish Date - 2023-08-14T16:29:13+05:30 IST

'ఖుషి' సినిమా ప్రచారాలు వైవిధ్యంగా చేస్తున్నారు ఆ చిత్ర సభ్యులు. ప్రముఖ యాంకర్ సుమ కనకాల, ఆమె భర్త రాజీవ్ కనకాల కలిసి విజయ్ దేవరకొండ, సమంత మిగతా టీము మెంబెర్స్ ని ఒక వైవిధ్యమైన ఇంటర్వ్యూ చేస్తున్నట్టుగా తెలిసింది.

Vijay Deverakonda: 'ఖుషీ' ప్రచారాలు వెరైటీగా, ఈసారి హిట్ కొడుతున్నామన్న ధీమా
Samantha and Vijay Deverakonda from Khushi

విజయ్ దేవరకొండ (VijayDeverakonda), సమంత (Samantha) జంటగా, శివ నిర్వాణ (ShivaNirvana) దర్శకత్వంలో వస్తున్న సినిమా 'ఖుషీ' #Khushi. ఈ సినిమా సెప్టెంబర్ 1 (September 1) న విడుదలవుతోంది. మైత్రి మూవీ మేకర్స్ (MythriMovieMakers) ఈ సినిమా నిర్మాణం చేస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ ఆగష్టు 9 న విడుదలైంది, సినిమాలో విషయం వుంది అని చెప్పింది. ట్రైలర్ చాలా ఆసక్తికరంగా వుంది, ఇందులో విజయ్ ని కొత్తగా చూపించినట్టున్నాడు దర్శకుడు శివ నిర్వాణ. ఇక సమంత వలన ఈ సినిమా చాలా రోజులు షూటింగ్ జరగకుండా ఆగిపోయినా, ఇప్పుడు రైట్ టైములో విడుదలవుతోంది అని ఒక వార్త చక్కర్లు కొడుతోంది.

khushi-team1.jpg

అయితే ఈ సినిమా 'అంటే సుందరానికి' #AnteSundaraniki, 'గీతగోవిందం' #GeethaGovindam లా కొంచెం అనిపిస్తోంది అనే విషయాన్నీ కొట్టి పారేస్తున్నారు ఈ చిత్ర యూనిట్. ఈ 'ఖుషి' సినిమాకి ఆ రెండు సినిమాలకి ఏమాత్రం పోలిక లేదని చెపుతున్నారు. ఇందులో సమంత ని ముందు అందరూ ముస్లిం యువతి అనుకున్నారు, కానీ ట్రైలర్ విడుదలయ్యాక ఆమె బ్రాహ్మిన్ అనగానే ఇది 'అంటే సుందరానికి' లా వుంది అని కొందరున్నారు, కానీ ఈ విషయం మీద ఎక్కువ చర్చ అనవసరం అని చిత్ర సభ్యులు చెప్పారు. ఎందుకంటే మా సినిమా పూర్తిగా ఒక విభిన్న చిత్ర అని చెపుతున్నారు.

khushi-team2.jpg

ఇక ఈ చిత్ర ప్రచారాలు కూడా వైవిధ్యంగానే ఉండబోతున్నాయి అని కూడా తెలిసింది. ప్రముఖ యాంకర్ సుమ (SumaKanakala), ఆమె భర్త రాజీవ్ కనకాల (RajeevKanakala) ఇద్దరూ ఈ 'ఖుషి' టీము ను ఇంటర్వ్యూ చేస్తున్నట్టుగా తెలిసింది. మొత్తం ఒక ఫన్ ఇంటర్వ్యూ లా చెయ్యాలని, అలాగే ఒక వెరైటీగా కూడా ఉండాలని టీము అనుకోవటంతో, ఈ ఇద్దరినీ పెట్టి ఇంటర్వ్యూ లు చేయిస్తున్నట్టుగా తెలిసింది.

sumarajeevkanakala.jpg

సుమ అంటే తెలియని తెలుగు ఇల్లు లేదేమో ఇప్పుడు, అంతలా ఆమె పేరు మారుమోగుతోంది. ఇప్పుడు ఆమెకి తోడుగా ఆమె భర్త, రాజీవ్ కూడా తోడయ్యాడు కాబట్టి ఈ ప్రచారాలు సినిమా చూడటానికి ప్రేక్షకులు థియేటర్ కి రావటంలో బాగా ఉపయోగపడతాయని అనుకుంటున్నారు.

Updated Date - 2023-08-14T16:32:07+05:30 IST