Tiger Nageswara Rao: సెన్సార్ అయింది, ఎక్కువ నిడివి వున్న సినిమా ఇదే, హింస కూడా ఎక్కువే!

ABN , First Publish Date - 2023-10-12T11:50:47+05:30 IST

'టైగర్ నాగేశ్వర రావు' సినిమా ఈ ఏడాది విడుదలైన చిత్రాలలోకెల్లా ఎక్కువ నిడివి వున్న చిత్రంగా నిలిచింది. ఈ చిత్రం సెన్సార్ పూర్తయింది, ఇందులో హింస కూడా ఎక్కువగానే ఉన్నట్టు కనపడుతోంది యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చారు.

Tiger Nageswara Rao: సెన్సార్ అయింది, ఎక్కువ నిడివి వున్న సినిమా ఇదే, హింస కూడా ఎక్కువే!
Ravi Teja from Tiger Nageswara Rao film

రవితేజ (RaviTeja) నటించిన 'టైగర్ నాగేశ్వర రావు' #TigerNageswaraRao సినిమా సెన్సార్ పూర్తయింది. ఈ సినిమాకి వంశీ (Vamsi) దర్శకుడు కాగా, అభిషేక్ అగర్వాల్ (AbhishekAgarwal) నిర్మాత. ఇందులో రేణు దేశాయ్ (RenuDesai) ఒక ముఖ్య పాత్రలో కనిపించనున్నారు, నుపుర్ సనన్ (NupurSanon), గాయత్రీ భరద్వాజ్ (GayatriBharadwaj) కథానాయికలుగా చేస్తున్నారు. ఈ సినిమా అక్టోబర్ 20వ తేదీన విడుదలవుతోంది. ఒక్క తెలుగులోనే కాకుండా, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో కూడా విడుదల చేస్తున్నారు. తెలుగులో ఇంటర్వ్యూ అంటేనే చిరాకుపడే రవితేజ ఈ సినిమా కోసం హిందీ ప్రచారాలు మొదలు పెట్టి, అక్కడ విశేషంగా టీవీలకు, మీడియావాళ్లకు ఇంటర్వ్యూ ఇస్తున్నాడు.

tigernageswararao4.jpg

ఇంతకీ ఈ సినిమా నిడివి ఎంతో తెలిస్తే షాకవతారు. ఈ సినిమా నిడివి సుమారు మూడుగంటల 2 నిమిషాల (3.02) పాటు వుంది. అధికారికంగా ఇచ్చిన సర్టిఫికెట్ మీద 181 నిమిషాల 39 సెకండ్స్ అని చెప్పారు. అలాగే ఈ సినిమాకి యూ/ఎ సర్టిఫికెట్ కూడా ఇచ్చారు. ఈ సినిమాలా చాలా హింస కూడా ఉన్నట్టు కనపడుతోంది. అందుకే కొన్ని సన్నివేశాల్లో సెన్సార్ సభ్యులు హింస తక్కువ చెయ్యమని సూచించారని తెలిసింది.

ఇందులో కథానాయకుడు అయిన రవితేజ విలన్స్ ని ముక్కలు ముక్కలుగా చేస్తాడు అని తెలిసింది, అవి తగ్గించి అక్కడ కేవలం హీరో మొహం మాత్రమే చూపించమన్నారు. అలాగే చిన్న కుర్రాడు, తండ్రి తల నరికి చేత్తో పట్టుకోవటం లాంటి సన్నివేశాలు కూడా ఇందులో ఉన్నాయని, అవి కొంచెం బ్లర్ చెయ్యమని సూచించినట్టుగా తెలిసింది. ఇలాంటి సన్నివేశాలు ఈ సినిమాలో చాలా ఉన్నాయని తెలిసింది. అయితే ఈ సినిమా నిడివి సుమారు మూడు గంటలు పైనే ఉండటం, ఈ ఏడాది వచ్చిన సినిమాల్లో ఇదే ఎక్కువ నిడివి వున్న చిత్రంగా ఉంటుంది అని తెలిసింది.

tigercensorcertificate.jpgఈ సినిమా స్టూవర్టుపురానికి చెందిన దొంగ టైగర్ నాగేశ్వర రావు అనే వ్యక్తి జీవిత కథ ఆధారంగా తీసిన చిత్రం. అయితే సెన్సార్ సభ్యులు ఈ చిత్రానికి ముందే ఇది ఎవరినీ ఉద్దేశించి కాదు అనే డిస్ క్లైమర్ కూడా వెయ్యమన్నారు.

Updated Date - 2023-10-12T11:50:47+05:30 IST