కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Tollywood Box Office: వెలవెలబోతున్న థియేటర్స్, ఈవారం కూడా కలెక్షన్స్ అంతే!

ABN, First Publish Date - 2023-09-25T14:56:33+05:30

ఇది వరసగా రెండో వారం టాలీవుడ్ లో ఒక్క పెద్ద సినిమా విడుదల కాకపోవటం. ఏవో చిన్న సినిమాలు, డబ్బింగ్ సినిమా విడుదలయ్యాయి కానీ ప్రేక్షకులు అంతగా వాటి మీద శ్రద్ధ కనపరచలేదు అని అంటున్నారు. నెలాఖరున విడుదలయ్యే పెద్ద సినిమాల కోసం ఎదురుచూస్తున్నట్టుగా వుంది.

A still from Saptha Sagaralu Dhaati

తెలుగు నిర్మాతలు ఒకేసారి నాలుగైదు సినిమాలు ఒకే రోజు విడుదల చెయ్యడానికి ఉత్సాహం చూపిస్తారు కానీ, గత రెండు వారాలు నుండి మంచి సినిమా లేక థియేటర్స్ వెలవెలబోతున్నాయన్న సంగతి ఎందుకు తెలియడం లేదో అని పరిశ్రమలో టాక్ నడుస్తోంది. ఎందుకంటే గత వారం కూడా చిన్న సినిమాలు మాత్రమే విడుదలయ్యాయి, అలాగే ఒక డబ్బింగ్ సినిమా కూడా విడుదలైంది. 'అష్ట దిగ్బంధనం' #AshtaDigbandhanam అని ఒక చిన్న సినిమా విడుదలైంది, అయితే దీనికి సరైన ప్రచారాలు లేక ప్రేక్షకులకి అసలు ఈ సినిమా విడుదలైనట్టు కూడా తెలియదు.

అలాగే కన్నడంలో హిట్ అయిన సినిమా 'సప్త సాగరదాచే ఎల్లో - సైడ్ 'ఏ' #SaptaSaagaradaacheEllo–Side A అనే సినిమా తెలుగులో 'సప్తసాగరాలు దాటి' #SapthaSagaraluDhaati అనే పేరుతో విడుదలైంది. దీనిలో రక్షిత్ శెట్టి (RakshitShetty), రుక్మిణి వసంత్ (RukminiVasanth) జంటగా నటించారు. ఈ సినిమాకి మంచి రివ్యూస్ వచ్చినా కూడా, ఈ సినిమా ప్రచారం కూడా అంతగా లేకపోవటంతో ప్రేక్షకులు పట్టించుకోలేదు. అదీ కాకుండా కన్నడంలో విడుదలైన రెండు వారల తరువాత ఇది తెలుగులో విడుదలైంది. ఓటిటి లో చూడొచ్చు అనే ఉద్దేశంతో థియేటర్ కి ప్రేక్షకుల రానట్టుగా కనిపిస్తోంది. ఈ సినిమా రెండో పార్టు కూడా అక్టోబర్ లో విడుదలవుతోంది.

నవీన్ పోలిశెట్టి (NaveenPolishetty), అనుష్క శెట్టి (AnushkaShetty) జంటగా నటించిన 'మిస్ శెట్టి మిష్టర్ పోలిశెట్టి' #MissShettyMrPolishetty కూడా వారాంతంలో కొంచెం బాగుంది అంటున్నారు కానీ, ఆ సినిమా కూడా థియేటర్ రన్ ఇక చివరకి వచ్చేసినట్టే కనపడుతోంది. అలాగే షారుఖ్ ఖాన్ (ShahRukhKhan), నయనతార (Nayanthara), విజయ్ సేతుపతి (VijaySethupathi), దీపికా పడుకోన్ (DeepikaPadukone) నటించిన 'జవాన్' #Jawan కూడా ఇక చివరకి వచ్చేసింది. కొత్త సినిమాలు అన్నీ కూడా ఈ నెల చివరి వారంలో విడుదల అవుతున్నాయి కాబట్టి, అంతవరకు ఇక థియేటర్స్ వెలవెల పోవాల్సిందే అని అంటున్నారు. ఇలా కొంచెం పేరున్న సినిమా విడుదలకాకుండా ఉండటం వరసగా ఇది రెండో వారం.

Updated Date - 2023-09-25T14:56:33+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!