Telugu Film Industry reaction on CBN arrest: న్యాయవ్యవస్థ ప్రమాదంలో పడింది: దామోదర ప్రసాద్

ABN , First Publish Date - 2023-10-25T16:45:16+05:30 IST

తెలుగు చలన చిత్ర పరిశ్రమ నుండి దర్శకులు, నిర్మాతలు, నటులు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ ఈరోజు ఒక సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడేరు. చంద్రబాబుకి తమ సంఘీభావం తెలుపుతూ, ఇప్పటికైనా మించిపోయింది లేదు, బాబుగారి మీద కేసులు ఎత్తివేసి అతన్ని విడిచిపెట్టాలని కోరారు

Telugu Film Industry reaction on CBN arrest: న్యాయవ్యవస్థ ప్రమాదంలో పడింది: దామోదర ప్రసాద్
Damodara Prasad speaking at a meeting organized by the Telugu Film Industry

తెలుగు చలన చిత్ర పరిశ్రమ #TeluguFilmIndustry నుండి నిర్మాతలు, దర్శకులు, నటులు చాలామంది తెలుగుదేశం (TeluguDesamParty) అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు (NaraChandrababuNaidu) అక్రమ అరెస్టును ఖండిస్తూ చంద్రబాబుకి తమ సంఘీభావం తెలుపుతున్నారు. ఇప్పటికైనా మించిపోయింది లేదని, చంద్రబాబు నాయుడిని విడిచిపెట్టి అతని మీద పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని కోరుతున్నారు. చంద్రబాబు నాయుడు ఎప్పుడూ భవిష్యత్తు గురించి ఆలోచించే వ్యక్తి అని, అందుకే ఈరోజు సాఫ్ట్ వేర్ రంగం అంతలా అభివృద్ధి చెందింది అని అన్నారు. ఈరోజు తెలుగు ఫిలిం ఛాంబర్ అఫ్ కామర్స్ (TeluguFilmChamberOfCommerce) బిల్డింగ్ లో ఈ సమావేశం ఏర్పాటు చేసి, చంద్రబాబుకు తోడుగా మేమున్నాం అని చెప్పారు.

తెలుగు ఫిలిం ఛాంబర్ అఫ్ కామర్స్ (TeluguFilmChamberofCommerce) సెక్రటరీ అయిన కానూరి దామోదర ప్రసాద్ (KanuriDamodaraPrasad) మాట్లాడుతూ, తమ కుటుంబం, నందమూరి తారక రామ రావు (NTRamaRao) గారి కుటుంబంతో చాలా సన్నిహితంగా ఉండేదని చెప్పారు. తమ తాతలు, తండ్రుల దగ్గర నుండి రామారావు గారితో మంచి అనుబంధం ఉందని చెప్పారు. అలాగే తనకి కూడా బాబుగారితే వ్యక్తిగతంగా మంచి సాన్నిహిత్యం ఉందని చెప్పారు. చంద్రబాబు భార్య భువనేశ్వరిని (NaraBhuavaneswari) తాను భువనక్క అని అంటూ ఆ కుటుంబంతో తనకున్న సాన్నిహిత్యాన్ని చెప్పారు దామోదర ప్రసాద్.

అలాగే చంద్రబాబు ఒక రాజకీయ నాయకుడిగా, ముఖ్యమంత్రిగా అయన ప్రజల కోసం ఎంత మంచి పనులు చేశారో అందరికీ తెలిసిన విషయమే. అయనకు ఎప్పుడూ ముందుచూపు ఎక్కువ, భవిష్యత్తు తరాల గురించి ఆలోచించేవారు, అలాగే పనులు చేసేవారు. 1995, 97 సంవత్సరాలలో హైద్రాబాదు చివర్లలో ఏముండేది కాదు, ఈరోజు అక్కడ హైటెక్ సిటీ వెలిసింది. ఈరోజు సాఫ్ట్ వేర్ రంగం ఇంతలా అభివృద్ధి చెందింది అంటే అది బాబుగారి వలెనే అని నిస్సందేహంగా చెప్పవచ్చు అని చెప్పారు దామోదర ప్రసాద్.

chandrababu-tfi.jpg

విదేశాల్లో వున్న ఎంతోమంది సాఫ్ట్ వేర్ రంగానికి చెందిన పెద్ద పెద్దవాళ్ళు సైతం ఈరోజు చంద్రబాబు అక్రమ అరెస్టు ఖండిస్తున్నారు అంటే అయన భవిష్యత్తు గురించి ఎంత అలోచించి ఆనాడు చేశారో అర్థం అవుతోంది అని అన్నారు. ఎన్నో తెలుగు కుటుంబాలు ఈ రంగంలో స్థిరపడ్డారు అని కులం, మతం తో సంబంధం లేకుండా అందరూ చంద్రబాబు కి సంఘీభావం తెలుపుతున్నారని ప్రసాద్ చెప్పారు.

అలాగే రాజకీయ చదరంగంలో ఎన్నో ఆటలు ఆడతారు, కానీ చంద్రబాబు వయసుకి కూడా గౌరవం ఇవ్వకుండా, ఎటువంటి మచ్చలేని అతన్ని ఇలా ఇన్ని రోజులు అరెస్టు చేసి ఖైదు చెయ్యడం చూస్తుంటే న్యాయవ్యవస్థ మీద నమ్మకం పోతోందని అన్నారు ప్రసాద్. నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు చూస్తుంటే ముందు ముందు న్యాయవ్యవస్థ ప్రమాదకరంగా తయారయ్యే పరిస్థితి కనిపిస్తోందని అన్నారు. న్యాయవ్యవస్థ ప్రజాస్వామ్య దేశంలో ఒక కోట లాంటింది, కానీ అది రోజు రోజుకీ బాగా పతనావస్థకు చేరుకుంటోంది అని ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే అర్థం అవుతోంది అని దామోదర ప్రసాద్ చెప్పారు. బాబుగారికి తన తరపున, తన కుటుంబం తరపున ఎప్పుడూ సపోర్ట్ ఉంటుందని, ఇప్పటికైనా మించిపోయింది లేదని, బాబుగారిని వెంటనే విడుదల చెయ్యాలని విజ్ఞప్తి చేశారు దామోదర ప్రసాద్.

నిర్మాత నట్టి కుమార్ (NattiKumar) ఈ సమావేశాన్ని నిర్వహించారు. సీనియర్ నటుడు, నిర్మాత మురళి మోహన్ (MuraliMohan), నిర్మాత టి ప్రసన్న కుమార్ (TPrasannaKumar) ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇంకా తెలుగు ఫిలిం నిర్మాతల మండలి కోశాధికారి రామ సత్యనారాయణ, దర్శకులు రాం ప్రసాద్, రవికుమార్ చౌదరి, వి సముద్ర, చంద్రమహేష్, ఫెడరేషన్ ఎంప్లాయిస్ కన్వీనర్ వెల్లంకి శ్రీనివాస్ కుమార్, తెలుగు దర్శకుల సంఘం సంయుక్త కార్యదర్శి రామారావు, రామ్ గోపాల్, సీనియర్ నిర్మాత ఆచంట గోపీనాధ్, నిర్మాత ఎస్ వి రావు ఇంకా చాలామంది మాట్లాడి చంద్రబాబుకి సంఘీభావం తెలిపారు. అక్రమ అరెస్టు ఖండించారు.

Updated Date - 2023-10-25T16:45:16+05:30 IST