Ahimsa: తేజ ‘అహింస’కు మోక్షం అప్పుడేనా?

ABN , First Publish Date - 2023-05-09T20:04:18+05:30 IST

వెండితెరపై వైవిధ్యమైన ప్రేమకథలని ఆవిష్కరించి.. ఘన విజయాలని సాధించిన క్రియేటివ్ జీనియస్ తేజ (Teja). అయితే.. ఆయన నుంచి సినిమా వచ్చి చాలా కాలం అవుతుంది. ఈ మధ్య రెండు మూడు సినిమాలను స్టార్ హీరోలతో

Ahimsa: తేజ ‘అహింస’కు మోక్షం అప్పుడేనా?
Ahimsa Movie Still

వెండితెరపై వైవిధ్యమైన ప్రేమకథలని ఆవిష్కరించి.. ఘన విజయాలని సాధించిన క్రియేటివ్ జీనియస్ తేజ (Teja). అయితే.. ఆయన నుంచి సినిమా వచ్చి చాలా కాలం అవుతుంది. ఈ మధ్య రెండు మూడు సినిమాలను స్టార్ హీరోలతో ప్రకటించారు కానీ.. అవేవీ కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడాయన దర్శకత్వంలో దగ్గుబాటి వారసుడు అభిరామ్ (Abhiram) హీరోగా అరంగేట్రం చేస్తున్నారు. తేజ, అభిరామ్ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘అహింస’ (Ahimsa). ఈ సినిమా ట్రైలర్‌ని జనవరిలోనే విడుదల చేశారు. అప్పటి నుంచి సినిమా విడుదల కోసం ప్లాన్ చేస్తున్నారు కానీ, ఎప్పటికప్పుడు వాయిదాలు పడుతూనే ఉంది. అందుకు కారణాలు ఏమిటనేది పక్కన పెడితే.. తాజాగా ఈ చిత్ర విడుదల తేదీని (Ahimsa Release Date) మేకర్స్ ప్రకటించారు.

యూత్ ఫుల్ లవ్, యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ‘అహింస’ చిత్రాన్ని జూన్ 2న విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ (Anandi Art Creations) బ్యానర్‌పై పి. కిరణ్ (P Kiran) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ మెటీరియల్ సినిమాపై మంచి క్యూరియాసిటీనే పెంచింది.. కానీ విడుదల విషయంలో తాత్సరం జరుగుతుండటంతో.. ఈ సినిమా ఇక ఓటీటీలోనే విడుదల అనేలా కూడా వార్తలు వైరల్ అయ్యాయి. కానీ ఈ సినిమాని థియేటర్లలలోనే విడుదల చేస్తున్నామని తెలుపుతూ.. వినిపిస్తున్న రూమర్స్‌కు మేకర్స్ బ్రేక్ వేశారు.

Abhi.jpg

ఇక విడుదల తేదీని తెలియజేస్తూ.. విడుదల చేసిన పోస్టర్‌లో అభిరామ్ లుక్ ఆకట్టుకునేలా ఉంది. చాలా గ్యాప్ తర్వాత తేజ చిత్రానికి ఆర్పీ పట్నాయక్ (RP Patnaik) సంగీతం అందిస్తున్నారు. అభిరామ్ సరసన గీతిక హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో రజత్ బేడీ, సాధా, రవి కాలే, కమల్ కామరాజు, మనోజ్ టైగర్, కల్పలత, దేవి ప్రసాద్ తదితరులు ఇతర పాత్రలలో నటిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్ర ప్రమోషన్స్‌ను మేకర్స్ స్టార్ట్ చేయనున్నారు. (Ahimsa Release Details)

ఇవి కూడా చదవండి:

************************************************

*Vasuki Anand: పవన్ కల్యాణ్ సోదరి అందుకే రీ ఎంట్రీ ఇస్తున్నానంటోంది

*VD12: విజయ్ బర్త్‌డే స్పెషల్‌గా ప్రత్యేక పోస్టర్.. ఫ్యాన్స్ ఖుష్

*Kushi: సినిమా పేర్లతో విజయ్ దేవరకొండ, సమంత పాటేసుకున్నారు.. పాట ఎలా ఉందంటే..

*PKSDT: టైటిల్ ఫిక్సయిందా.. ‘దేవుడే దిగివచ్చినా’ కాదా?

*Tamanna: పొంగల్‌కి శృతిహాసన్.. ఇండిపెండెన్స్ డేకి తమన్నా..

*The Kerala Story: మరో స్టేట్‌లో నిషేధం.. షాక్‌లో చిత్రయూనిట్

Updated Date - 2023-05-09T20:04:18+05:30 IST