scorecardresearch

Sunil: కోలీవుడ్‌ కాలింగ్‌... బిజీ బిజీ!

ABN , First Publish Date - 2023-01-28T14:52:50+05:30 IST

బంతి (నువ్వు నాకు నచ్చావ్‌), బంకు శ్రీను (మన్మథుడు) జానకీ(రెడీ) నువ్వు లేక నేను లేను(కర్రి శ్రీను) శేషు ది బుస్‌ (సొంతం) రామరాజు (కలర్‌ ఫొటో) ఇలా సునీల్‌ అలరించిన పాత్రలు ఎన్నో. కమెడీయన్‌గా కెరీర్‌ ప్రారంభించిన సునీల్‌ హీరోగా కూడా ఎదిగారు.

Sunil: కోలీవుడ్‌ కాలింగ్‌... బిజీ బిజీ!

బంతి (నువ్వు నాకు నచ్చావ్‌), (Sunil)

బంకు శ్రీను (మన్మథుడు)

జానకీ(రెడీ)

నువ్వు లేక నేను లేను(కర్రి శ్రీను)

శేషు ది బుస్‌ (సొంతం)

రామరాజు (కలర్‌ ఫొటో)

ఇలా సునీల్‌ అలరించిన పాత్రలు ఎన్నో. (sunil busy with tamil movies)

కమెడీయన్‌గా కెరీర్‌ ప్రారంభించిన సునీల్‌ హీరోగా కూడా ఎదిగారు. హీరోగా కొన్ని సినిమాలతో అలరించిన ఆయన మళ్లీ ఇప్పుడు కమెడీయన్‌గా, నెగటివ్‌ షేడున్న పాత్రలతో అలరిస్తున్నారు. పైన పాత్రలన్నీ ఆయనకు ఎంతగా గుర్తింపు తీసుకొచ్చాయో ‘పుష్ప’ చిత్రంలో ‘మంగళం శ్రీను’(Mangalam srinu) పాత్ర అంతకుమించి గుర్తింపు తీసుకొచ్చింది. అందులో ఆయన గెటప్‌, మేనరిజం, రాయలసీమ స్లాంగ్‌ ప్రేక్షకుల్ని ఎంతో ఆకట్టుకుంది. సుకుమార్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందింది. దీనితో సునీల్ కు కూడా మంచి గుర్తింపు లభించింది. ఈ సినిమాతో తెలుగులోనే కాదు.. దక్షిణాది అన్ని భాషల్లో చక్కని గుర్తింపు లభించింది. దాంతో కోలీవుడ్‌లో అవకాశాలు అలాగే వరుసకట్టాయి. ప్రస్తుతం ఆయన రజనీకాంత్‌ హీరోగా నటిస్తున్న ‘జైలర్‌’ చిత్రంలో నటిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన లుక్‌ను మేకర్స్‌ విడుదల చేశారు. విశాల్‌ హీరోగా నటిస్తున్న ‘మార్క్‌ ఆంటోని’ చిత్రంలోనూ సునీల్‌ ఓ పాత్ర చేస్తునట్లు తెలిపారు. నయనతార, త్రిష, ఇలియానా తారలుగా నటిస్తున్న ఈ చిత్రానికి అధిక్‌ రవిచంద్రన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. కార్తి ‘జపాన్‌’, శివ కార్తికేయన్‌ ‘మావీరన్‌’ చిత్రంలోనూ సునీల్‌ నటిస్తున్నారు. 2007లో వచ్చిన ‘తిరురంగా’ చిత్రంతో సునీల్‌ తమిళ పరిశ్రమకు పరిచయమైన సంగతి తెలిసిందే!

Updated Date - 2023-01-28T16:34:04+05:30 IST