Mama Mascheendra: సుధీర్ బాబు న్యూ లుక్.. మరో ‘కబాలి’ రా..

ABN , First Publish Date - 2023-03-04T20:01:19+05:30 IST

హిట్ ప్లాఫ్‌లతో సంబంధం లేకుండా కొత్త రకం సినిమాలు చేసే నటుడు సుధీర్ బాబు (Sudheer Babu). చివరగా ‘హంట్’ (Hunt) లో నటించారు. ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద దారుణంగా పరాజయం పాలైంది.

Mama Mascheendra: సుధీర్ బాబు న్యూ లుక్.. మరో ‘కబాలి’ రా..

హిట్ ప్లాఫ్‌లతో సంబంధం లేకుండా కొత్త రకం సినిమాలు చేసే నటుడు సుధీర్ బాబు (Sudheer Babu). చివరగా ‘హంట్’ (Hunt) లో నటించారు. ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద దారుణంగా పరాజయం పాలైంది. తాజాగా ఆయన నటిస్తున్న చిత్రం ‘మామా మశ్చీంద్ర’ (Mama Mascheendra). హర్షవర్ధన్ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌‌ఎల్‌‌పి‌పై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుంచి సుధీర్ బాబు న్యూ లుక్ రిలీజ్ అయింది. అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది.

‘మామా మశ్చీంద్ర’ లో సుధీర్ బాబు ట్రిపుల్ రోల్ చేస్తున్నారు. ఇప్పటికే లావుగా ఉన్న దుర్గ పాత్రకు సంబంధించిన పోస్ట్‌ర్‌ను విడుదల చేశారు. ఈ లుక్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. తాజాగా మేకర్స్ పరశురామ్ క్యారెక్టర్‌కు సంబంధించిన పోస్టర్‌‌ను అభిమానులతో పంచుకున్నారు. ఈ పోస్టర్‌లో సుధీర్ మరో ‘కబాలి’ లా కనిపించారు. వయస్సు మళ్లిన గ్యాంగ్ స్టర్ పాత్రలో దర్శనమించ్చారు. డీజేగా మూడో లుక్‌ను అతి త్వరలోనే విడుదల చేయనున్నారు. ‘మామా మశ్చీంద్ర’ తెలుగు, హిందీ భాషల్లో రూపొందుతుంది. ఈ బై లింగ్విల్ చిత్రాన్ని సృష్టి సెల్యులాయిడ్ పతాకంపై సోనాలి నారంగ్, సృష్టి సమర్పిస్తున్నారు. ఈ సినిమాలో మరికొంత మంది కీలక పాత్రలు పోషిస్తున్నారు. వారి వివరాలను మేకర్స్ త్వరలోనే ప్రకటిస్తారు. ఈ మూవీకి చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. పిజి. విందా సినిమాటోగ్రఫర్‌గా పనిచేస్తున్నారు. ఆర్ట్ డైరెక్టర్‌గా రాజీవ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

^^^^^^^^^^^^^^^^^^^^^^

ఇవి కూడా చదవండి:

Taraka Ratna : తారకరత్న లెటర్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసి.. తీవ్ర భావోద్వేగానికి లోనైన అలేఖ్యారెడ్డి.. కొంచెం కష్టమే కానీ...!

Sushmita Sen: బాలీవుడ్ నటి, మాజీ విశ్వ సుందరికి గుండె పోటు

Upasana: డెలివరీ రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చిన ఉపాసన కామినేని

RRR: ఇంటర్నేషనల్ అవార్డ్స్‌లో టామ్ క్రూజ్, బ్రాడ్ పిట్‌లతో పోటీ పడుతున్న రామ్ చరణ్, తారక్

Nani: నెపోటిజానికి కారణం ప్రేక్షకులే..!

Updated Date - 2023-03-04T20:01:20+05:30 IST