SudheerBabu: చూస్తే షాక్ అవుతారు, అంత లావుగా వున్నాడేంటి?

ABN , First Publish Date - 2023-03-01T12:13:11+05:30 IST

సినిమా ఫలితాలతో సంబంధం లేకుండా వైవిధ్యంగా సినిమాలు చెయ్యడానికి సుధీర్ బాబు (#SudheerBabu) ఎప్పుడూ ముందుంటాడు. ఇంత చేస్తున్నా కూడా మంచి బ్రేక్ అయితే మాత్రం రావటం లేదు. మరి ఈసారయినా వస్తుందేమో చూడాలి.

SudheerBabu: చూస్తే షాక్ అవుతారు, అంత లావుగా వున్నాడేంటి?

సినిమా ఫలితాలతో సంబంధం లేకుండా వైవిధ్యంగా సినిమాలు చెయ్యడానికి సుధీర్ బాబు (#SudheerBabu) ఎప్పుడూ ముందుంటాడు. ఇంత చేస్తున్నా కూడా మంచి బ్రేక్ అయితే మాత్రం రావటం లేదు. మరి ఈసారయినా వస్తుందేమో చూడాలి. ఇప్పుడు సుధీర్ బాబు 'మామా మశ్చీంద్ర' (#MamaMascheendra) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇందులో సుధీర్ బాబు మూడు విభిన్న పాత్రలు పోషిస్తున్నాడు. హర్షవర్ధన్ (#HarshaVardhan) దీనికి దర్శకుడు కాగా, ఈ సినిమా నుండి మూడు పాత్రల్లో దుర్గా (#Durga) అనే పాత్ర పోషిస్తున్న సుధీర్ బాబు ఫస్ట్ లుక్ ని ఈరోజు విడుదల చేశారు.

సునీల్ నారంగ్ (#SunilNarang), పుస్కుర్ రామ్ మోహన్ రావు (#PushkarRammohanRao) ఈ చిత్రానికి నిర్మాతలు కాగా 'మామా మశ్చీంద్ర' లో (#MamaMascheendra) హీరో ని మూడు విభిన్న కోణాల్లో చూపించ బోతున్నాడు హర్షవర్ధన్. ఈ మూడు పాత్రల పేర్లు దుర్గ, పరశురామ్, డీజే. అందులో ఈరోజు దుర్గ లుక్ ను విడుదల చేసారు. పొడవాటి జుట్టు, గడ్డంతో సుధీర్ బాబు ఇక్కడ చాలా లావుగా కనిపిస్తున్నాడు. ఈ పోస్టర్ చూస్తేనే షాక్ కలుగుతుంది, ఆలా వున్నాడు సుధీర్ బాబు. ఈ పాత్ర ఊబకాయంతో ఉండే వ్యక్తి గా ఉండబోతుంది అని తెలుస్తుంది.
sudheerbabu4.jpg

అలాగే కారు బానెట్ పై కూర్చున్న సుధీర్ బాబు బంగారు గొలుసు వాచ్, ట్రెండీ అవుట్ ఫిట్ ధరించి విలనీ స్మైల్ తో కనిపించాడు. ఈ అవతారం లో సుధీర్ బాబు చాల ఆశ్చర్యం కలిగించే లాగా వున్నాడు. ఇంతకీ ఇదంతా మేకప్ తో చేశారా, లేక సుధీర్ బాబు కొంచెం బరువెక్కడా, అన్నది ముందు ముందు తెలుస్తుంది. 'మామా మశ్చీంద్ర' అనే టైటిల్ పెట్టడానికి కారణం ఇందులో సుధీర్ బాబు ని మూడు కొత్త కోణాల్లో చూపించడమే అని తెలుస్తోంది. అలాగే ఇంకో పాత్ర అయిన పరశురామ్ లుక్ ని ఈ నెల 4న, డీజే లుక్ ని 7న విడుదల చేయనున్నారు.

Updated Date - 2023-03-01T12:13:38+05:30 IST