Peddha Kapu1: నెలలోపే.. సైలెంట్‌గా ఓటీటీలోకి వ‌చ్చేసిన‌ పెద్దకాపు.. స్ట్రీమింగ్ ఎక్క‌డంటే?

ABN , First Publish Date - 2023-10-27T12:44:09+05:30 IST

కొత్తబంగారు లోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, బ్రహ్మోత్సం, ముకుంద వంటి కుటుంబ చిత్రాల దర్శకుడిగా మంచిపేరు సంపాదించిన శ్రీకాంత్ అడ్డాల(Srikanth Addala) తనదై శైలికి భిన్నంగా పూర్తి యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తీసిన పెద్దకాపు పార్ట్ 1 (Peddha Kapu 1) నెల రోజుల లోపే సైటెంట్‌గా డిజిటల్ స్ట్రీమింగ్ కు వ‌చ్చేసింది. ఎన్నో అంచనాల మధ్య సెప్టెంబర్ 29న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చి నిరాశపర్చింది. అయితే తాజాగా ఈ చిత్రాన్ని ఓటీటీలో తీసుకువచ్చారు. అమెజాన్ ప్రైమ్(Amazon Prime) వీడియోలో శుక్రవారం (ఈ రోజు) నుంచి స్ట్రీమ్ అవుతున్న‌ది.

Peddha Kapu1: నెలలోపే.. సైలెంట్‌గా ఓటీటీలోకి వ‌చ్చేసిన‌ పెద్దకాపు.. స్ట్రీమింగ్ ఎక్క‌డంటే?
Peddha Kapu1

కొత్తబంగారు లోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, బ్రహ్మోత్సం, ముకుంద వంటి కుటుంబ చిత్రాల దర్శకుడిగా మంచిపేరు సంపాదించిన శ్రీకాంత్ అడ్డాల(Srikanth Addala) తనదై శైలికి భిన్నంగా పూర్తి యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తీసిన పెద్దకాపు పార్ట్ 1 (Peddha Kapu 1) నెల రోజుల లోపే సైటెంట్‌గా డిజిటల్ స్ట్రీమింగ్ కు వ‌చ్చేసింది.

ఎన్నో అంచనాల మధ్య సెప్టెంబర్ 29న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చి నిరాశపర్చింది. అయితే తాజాగా ఈ చిత్రాన్ని ఓటీటీలో తీసుకువచ్చారు. అమెజాన్ ప్రైమ్(Amazon Prime) వీడియోలో శుక్రవారం (ఈ రోజు) నుంచి స్ట్రీమ్ అవుతున్న‌ది.


అఖండ(Akhanda) వంటి బ్లాక్ బ‌స్టర్ హిట్ తర్వాత నిర్మాత మిర్యాల శ్రీనివాస్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించగా నూతన నటులు విరాఠ్ కర్ణ, ప్రగతి శ్రీవాత్సవలు హీరోహీరోయిన్లుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. 198ం దశకంలో ఆంధ్రలో ఎన్టీఆర్ పార్టీ స్థాపన, ఓ రెండు లంక గ్రామాలలో వర్గాల మధ్య ఆధిపత్యం కోసం జరిగిన రక్తపాతం చుట్టూ అల్లుకున్న కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది.

దర్శకుడు ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కించగా మొదటి భాగం పార్ట్1గా వినాయకచవితి సమయంలో విడుదల చేయగా అశించినంతగా ఫలితం ఇవ్వలేదు. అయితే ఈ క్రమంలో రెండో భాగం వచ్చేది లేనిది మేక‌ర్స్ ఇప్ప‌టివ‌ర‌కు ప్ర‌క‌టించ‌లేదు.

Updated Date - 2023-10-27T12:44:46+05:30 IST