Sobhita Dhulipala: అవమానాలు ఎదుర్కొన్న చోటే.. ఐశ్వర్య రాయ్‌తో యాడ్..

ABN , First Publish Date - 2023-03-01T13:28:13+05:30 IST

మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించి హీరోయిన్‌గాఅందాల భామ శోభిత ధూళిపాళ్ల (Sobhita Dhulipala). భాషతో సంబంధం లేకుండా అన్ని ఇండస్ట్రీస్‌లో నటిస్తున్నారు. ‘గూఢచారి’, ‘మేజర్’, ‘పొన్నియిన్ సెల్వన్’ వంటి చిత్రాలతో తెలుగు వారికి చేరువయ్యారు.

Sobhita Dhulipala: అవమానాలు ఎదుర్కొన్న చోటే.. ఐశ్వర్య రాయ్‌తో యాడ్..

మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించి హీరోయిన్‌గాఅందాల భామ శోభిత ధూళిపాళ్ల (Sobhita Dhulipala). భాషతో సంబంధం లేకుండా అన్ని ఇండస్ట్రీస్‌లో నటిస్తున్నారు. ‘గూఢచారి’, ‘మేజర్’, ‘పొన్నియిన్ సెల్వన్’ వంటి చిత్రాలతో తెలుగు వారికి చేరువయ్యారు. ఈ అందామ భామ తాజాగా ‘ది నైట్ మేనేజర్’ (The Night Manager) వెబ్‌సిరీస్‌లో నటించారు. ఈ షో ప్రమోషన్స్‌లో భాగంగా మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. కెరీర్ తొలినాళ్లలో ముంబైలో ఎదుర్కొన్న ఇబ్బందులను గురించి ప్రస్తావించారు.

కొన్నాళ్ల క్రితం తనను బ్యాక్ గ్రౌండ్ మోడల్‌గా ఓ కంపెనీ రిజెక్ట్ చేసిందని శోభిత ధూళిపాళ్ల చెప్పారు. ప్రస్తుతం అదే బ్రాండ్‌కు తాను అంబాసిండర్‌గా వ్యవహరిస్తున్నానని తెలిపారు. ‘‘ కెరీర్ ఆరంభించినప్పుడు నాకు ఒక్క యాడ్ కూడా చేసే అవకాశం రాలేదు. కొంత మంది నాకు ఫేస్ వాల్యూ లేదని చెప్పారు. బ్యాక్ గ్రౌండ్ మోడల్‌గా కూడా నన్ను రిజెక్ట్ చేశారు. మూడేళ్ల క్రితం అదే బ్రాండ్‌కు అంబాసిండర్‌గా వ్యవహరించే అవకాశం రావడంతో సంతోషమేసింది. ఐశ్వర్య రాయ్‌తో కలసి నేను యాడ్ చేశాను. షాంపులను పాస్ చేశాను’’ అని శోభిత ధూళిపాళ్ల చెప్పారు. మోడల్‌గా రాణిస్తూనే సమయంలోనే శోభిత‌కు సినిమాల్లో అవకాశం వచ్చింది. అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహించిన ‘రమణ్ రాఘవ్ 2.0’ తో ఆమె పేరు, ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.

శోభిత ‘ది నైట్ మేనేజర్’ లో కావేరి పాత్రలో కనిపించారు. అనిల్ కపూర్ ప్రియురాలి పాత్రను పోషించారు. ఈ షోలో ఆదిత్య రాయ్ కపూర్, తిలొత్తమ షోమ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ వెబ్‌సిరీస్ ‘డిస్నీ+హాట్‌స్టార్’ లో స్ట్రీమింగ్ అవుతుంది.

^^^^^^^^^^^^^^^^^^^^^^

ఇవి కూడా చదవండి:

Upasana: డెలివరీ రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చిన ఉపాసన కామినేని

Ashwini Dutt: ‘ప్రాజెక్ట్ కె’ ఆసక్తికర సంగతులు చెప్పిన నిర్మాత.. మ్యూజిక్ డైరెక్టర్‌లో మార్పు..

Ranbir Kapoor: బెస్ట్ యాక్టర్ అవార్డును అందుకునే అర్హత నాకు లేదు.. ‘పుష్ప’ లో అల్లు అర్జున్ అద్భుతంగా..

RRR: ఇంటర్నేషనల్ అవార్డ్స్‌లో టామ్ క్రూజ్, బ్రాడ్ పిట్‌లతో పోటీ పడుతున్న రామ్ చరణ్, తారక్

Vishal: భారీ ప్రమాదం.. కొంచముంటే విశాల్ ప్రాణాలు పోయేవి.. వీడియో వైరల్

Nani: నెపోటిజానికి కారణం ప్రేక్షకులే..!

Updated Date - 2023-03-01T14:13:00+05:30 IST