Sitara ghattamaneni : తాతను గుర్తు చేసుకొంది.. ఆ లెగసీ అదృష్టమంది!

ABN , First Publish Date - 2023-10-13T16:18:36+05:30 IST

శుక్రవారం నేషనల్‌ సినిమా డేను పురస్కరించుకుని మహేష్‌బాబు గారాలపట్టీ సితార ఇన్స్టాలో ఆసక్తికర పోస్ట్‌ చేసింది. తాతయ్య కృష్ణ, తల్లిదండ్రులతో కలిసి దిగిన ఫొటో షేర్‌ చేసి తన దృష్టిలో సినిమా అంటే కేవలం ఒక పరిశ్రమ కాదని సితార అన్నారు.

Sitara ghattamaneni : తాతను గుర్తు చేసుకొంది.. ఆ లెగసీ అదృష్టమంది!

శుక్రవారం నేషనల్‌ సినిమా డేను పురస్కరించుకుని మహేష్‌బాబు గారాలపట్టీ సితార ఇన్స్టాలో ఆసక్తికర పోస్ట్‌ చేసింది. తాతయ్య కృష్ణ, తల్లిదండ్రులతో కలిసి దిగిన ఫొటో షేర్‌ చేసి తన దృష్టిలో సినిమా అంటే కేవలం ఒక పరిశ్రమ కాదని సితార అన్నారు. సినిమా అనేది తన డీఎన్‌ఏలోనే ఉందన్నారు. ప్రస్తుతం ఆమె చేసిన పోస్ట్‌ నెట్టింట వైరల్‌గా మారింది.

‘‘సినిమా.. అనే పదానికి నా జీవితంలో ప్రత్యేకమైన స్థానం ఉంది. నా దృష్టిలో ఇది కేవలం ఇండస్ర్టీ మాత్రమే కాదు. అది నా డీఎన్‌ఏలోనే ఒక భాగం. లెజండరీ, ఎవర్‌గ్రీన సూపర్‌స్టార్‌ కృష్ణగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న మా తాతగారు మమ్మల్ని ఎంతగానో ప్రభావితం చేశారు. ఆయన వారసత్వంలో భాగమైౖనందుకు ఎంతో గర్వపడుతున్నా. నాన్న ఎలాగైతే తాతయ్యను స్ఫూర్తిగా తీసుకున్నారో.. నేను కూడా అంతే. నాన్నే నా స్ఫూర్తి’’ అని సితార పోస్ట్‌ చేశారు. ఈ పోస్ట్‌ ఇప్పుడు వైరల్‌గా మారింది. సితార చిన్న పిల్లే అయినా ఎంతో మెచూర్డ్‌గా మాట్లాడుతుందని నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు.

Updated Date - 2023-10-13T16:18:36+05:30 IST