సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Ram Pothineni: రామ్ ని చూస్తే షాక్ అవుతారు, ఫోటోస్ వైరల్ !

ABN, First Publish Date - 2023-04-06T10:46:27+05:30

ఎప్పుడూ సన్నగా నాజూకుగా వుండే రామ్ పోతినేని ఇప్పుడు ఎలా తయారయ్యాడో చూసారా? బోయపాటి తో చేస్తున్న సినిమా కోసం తన లుక్ అంతా మార్చేసినట్టున్నాడు. ఈ కొత్త లుక్ లో రామ్ ని చూస్తే షాక్ అవటం ఖాయం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రామ్ పోతినేని (Ram Pothineni) ఇప్పుడు బోయపాటి శీను (Boyapati Srinu) దర్శకత్వంలో చేస్తున్న సినిమా షూటింగ్ లో బిజీ గా వున్నాడు. బోయపాటి ఇంతకు ముందు బాలకృష్ణ (Nandamuri Balakrishna) తో 'అఖండ' (Akhanda) సినిమా చేసి పెద్ద విజయం సాధించాడు. అలాగే బోయపాటి తన సినిమాల్లో లీడ్ యాక్టర్ ని ఒక మాస్ ఇమేజ్ లో కొత్తగా ప్రెసెంట్ చేస్తూ ఉంటాడు. అలాగే సినిమాలో పెద్ద పెద్ద పోరాట సన్నివేశాలతో తనదైన మార్కు ఆ సినిమా లో ఉండేట్టు బోయపాటి సినిమాని రూపొందిస్తాడు. బోయపాటి, ఉస్తాద్ (Ustaad Ram) రామ్ పోతినేని సినిమా పాన్ ఇండియా సినిమాగా విడుదల అవుతోంది.

ప్రస్తుతం రామ్ ఈ సినిమా షూటింగ్ మధ్యలో ముంబై వెళుతూ ఉండగా ఎయిర్ పోర్ట్ లో కనపడ్డాడు. అయితే ఉస్తాద్ రామ్ లుక్ (Ustaad Ram) అంటూ సాంఘీక మాధ్యమం లో వైరల్ అవుతున్నాయి రామ్ పోతినేని ఫోటోస్. ఫోటో కనక చూస్తే రామ్ చాలా వెయిట్ పెరిగాడు అనిపిస్తోంది (Ram gains weight) కదా. ఎందుకంటే బోయపాటి సినిమాలో మాస్ లుక్ రావటం కోసం రామ్ పోతినేని చాలా బరువు పెరిగినట్టు కనపడుతోంది. అలాగే గెడ్డం, ఆ కొత్త హెయిర్ స్టైల్ లో ఒక రగ్గుడ్ లుక్ లో రామ్ కనపడుతున్నాడు.

ఈ సినిమాలో శ్రీలీల (Sreeleela) కథానాయకురాలుగా వేస్తోంది. ఇప్పుడు ఆమె టాలీవుడ్ సెన్సేషన్ అని అందరూ అంటున్నారు. ఎక్కడ చూసిన శ్రీలీల పేరే వినబడుతోంది. అనతి కాలంలోనే ఆమె అంత బిజీ అయిపొయింది. ఇందులో మారి ఆమెని ఎలా చూపిస్తున్నాడో బోయపాటి చూడాలి.

ఎందుకంటే శ్రీలీల మంచి డాన్సర్ కూడాను. ఈమధ్య విడుదల అయిన 'ధమాకా' (Dhamaka) సినిమాలో రవితేజ (Ravi Teja) పక్కన నటించి శ్రీలీల డాన్స్ ఎంత బాగా చేయగలదో చూపించింది. ఆమె డాన్స్ కూడా ఆ సినిమా విజయానికి ఒక కారణం.

Updated Date - 2023-04-06T10:46:28+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!