Jawan: షారుఖ్ ఖాన్ కి మహేష్ బాబు బెస్ట్ విషెస్ చెపితే, ఎస్ఆర్కె ఏమన్నారంటే...

ABN , First Publish Date - 2023-09-06T13:26:44+05:30 IST

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, జవాన్ టీముకి, షారుఖ్ ఖాన్ కి ఆ సినిమా విడుదల సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. దీనికి సమాధానంగా షారుఖ్ ఖాన్ తనదైన రీతిలో స్పందించి మహేష్ బాబుకి సమాధానం ఏమి చెప్పారో తెలుసా...

Jawan: షారుఖ్ ఖాన్ కి మహేష్ బాబు బెస్ట్ విషెస్ చెపితే, ఎస్ఆర్కె ఏమన్నారంటే...
Shah Rukh Khan and Mahesh Babu

బాలీవుడ్ లో అగ్ర నటుడు షారుఖ్ ఖాన్ (ShahRukhKhan) నటించిన 'జవాన్' #Jawan రేపు విడుదలవుతోంది. అట్లీ (Atlee) దర్శకుడు, నయనతార (Nayanthara), దీపికా పడుకొనే (DeepikaPadukone), విజయ్ సేతుపతి (VijaySethupathi), యోగిబాబు (Yogibabu) ఇందులో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ యాక్షన్ సినిమా రేపు ఒక్క హిందీలోనే కాకుండా, దక్షిణాది భాషలన్నింటిలోనూ ప్రపంచం అంతటా విడులవుతోంది. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ కూడా రికార్డు స్థాయిలో అమ్ముడయ్యాయి, షా రుఖ్ ఖాన్ తన స్టామినా మరోసారి బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమాతో చూపించనున్నారు.

jawan-shahrukhkhan.jpg

తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమా చాలా పెద్దగా విడుదలవుతోంది. అలాగే ఈ సినిమాలోని పాటలు హిందీతో పాటు, తెలుగులో కూడా విడుదలయ్యి ఈ సినిమా ప్రచారానికి ఉపయోగపడ్డాయి. ఈ సినిమా విడుదల సందర్భంగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు (MaheshBabu) సోషల్ మీడియా వేదికగా 'జవాన్' టీముకి తన శుభాకాంక్షలు తెలిపారు. ఇట్స్ టైమ్ ఫర్ జవాన్ అంటూ ఇది అల్ టైం బ్లాక్ బస్టర్ కావాలంటూ విష్ చేసిన మహేష్ బాబు తాను కూడా కుటుంబ సభ్యులతో చూడటానికి రెడీ అవుతున్నాను అని ట్వీట్ చేసాడు.

maheshbabu-businessman.jpg

మహేష్ బాబు చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు సాంఘీక మాధ్యమంలో వైరల్ గా మారుతోంది. దీనికి షా రుఖ్ ఖాన్ సమాధానం చెపుతూ, ధన్యవాదములు చెప్పారు. ఈ సినిమా చూసి ఆనందిస్తావని అనుకుంటున్నాను అంటూ, ఎక్కడ చూస్తావో చెపితే, నేను కూడా వచ్చి నీతో పాటు చూస్తా అని సమాధానం చెప్పారు షారుఖ్ ఖాన్. మీకు, మీ కుటుంబ సబ్యులకు నా లవ్ అని కూడా షారుఖ్ చెప్పారు. ఇలా ఈ ఇద్దరూ సాంఘీక మాధ్యమంలో మాట్లాడుకున్నది ఇప్పుడు పెద్ద టాపిక్ గా మారింది.

Updated Date - 2023-09-06T13:27:27+05:30 IST