Samantha: ఖుషీ సినిమాకి సమంత పారితోషికం తెలిస్తే షాక్ అవుతారు

ABN , First Publish Date - 2023-04-18T11:45:40+05:30 IST

సమంత, విజయ్ దేవరకొండ ఇద్దరికీ 'ఖుషి' సినిమా ఒక టెస్ట్ లాంటింది. ఎందుకంటే విజయ్ ముందు సినిమా 'లైగర్' బాగా నష్టం తెచ్చింది, అలాగే మొన్నీమధ్య విడుదలయిన సమంత సినిమా 'శాకుంతలం' కూడా టోటల్ వాష్ అవుట్ అయింది. కానీ 'ఖుషి' సినిమాకి సమంత పారితోషికం ఎంతో తెలిస్తే షాక్ అవుతారు...

Samantha: ఖుషీ సినిమాకి సమంత పారితోషికం తెలిస్తే షాక్ అవుతారు
Samantha

విజయ్ దేవరకొండ (Vijay Devarakonda), దర్శకుడు శివ నిర్వాణ (Shiva Nirvana) కలిసి చేస్తున్న సినిమా 'ఖుషీ' (Khushi). ఇది ప్రస్తుతం షూటింగ్ దశలో వుంది. ఈ సినిమా ఎప్పుడో అయిపోవాల్సి వుంది, కానీ సమంత (Samantha) వలన ఆగిపోయింది. 'యశోద' (Yashoda) సినిమా చేసాక, సమంత కి ఒక వింతైన వ్యాధి మయోసైటిస్ (Myositis) రావటం, దానితో ఆమె సిక్ అవ్వటం జరిగింది. ఆమె దాదాపు కొన్ని నెలల పాటు షూటింగ్ కి దూరంగా ఉండాల్సి వచ్చింది. అయితే ఆమె కోలుకున్నాక 'ఖుషీ' సినిమా షూటింగ్ లో పాల్గొంటుంది అని అందరూ అనుకున్నారు, కానీ హిందీ వెబ్ సిరీస్ 'సిటాడెల్' (Citadel) షూటింగ్ చేసింది.

sam-khushi1.jpg

ఇదిలా ఉండగా ఇప్పుడు సమంత 'ఖుషీ' (Khushi) సినిమా షూటింగ్ చేస్తోంది. ఈ సినిమా విజయ్ దేవరకొండ కి ఎంతో ముఖ్యమైంది. ఎందుకంటే అతని ముందు సినిమా 'లైగర్' (Liger) బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద డిసాస్టర్ (Disaster) అయింది. పూరి జగన్నాధ్ (Puri Jagannadh) దానికి దర్శకుడు. అందువలన ఇప్పుడు ఈ 'ఖుషీ' మీదే ఆశలు పెట్టుకున్నాడు. అయితే ఈ సినిమా సమంత వలన పాపం చాలా డిలే అయింది. ఇంతకీ సమంత ఈ సినిమాకి తీసుకున్న పారితోషికం ఎంతో తెలుసా, తెలిస్తే షాక్ అవుతారు.

vijaydeverakonda.jpg

ఎందుకంటే ఆమె అక్షరాలా 5 కోట్లు పారితోషికం (Rs 5 crore) తీసుకుందని భోగట్టా. అయితే ఇప్పుడు ఆమె మీద చాలా ఒత్తిడి ఉందని తెలిసింది. అలాగే సినిమా నిర్వాహకుల మీద కూడా. ఎందుకంటే సమంత సినిమా ఈమధ్యనే విడుదల అయిన 'శాకుంతలం' (Shaakuntalam) బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద ఫెయిల్యూర్ అయింది. గుణశేఖర్ (Gunasekhar) దర్శకత్వం వహించిన ఈ సినిమాని, సమంత చాలా నమ్మింది, కానీ ఆమె ఆశలు గల్లంతయ్యాయి. అందుకని ఇప్పుడు ఆమె మీద చాలా ఒత్తిడి వుంది. ఇప్పుడు 'ఖుషీ' సినిమా ఒక్క విజయ్ కే కాకుండా, సమంతకి కూడా పెద్ద పరీక్షా లాంటిదే.

ఇది కూడా చదవండి:

Virupaksha: సాయి ధరమ్ తేజ్ సింపతీ వర్క్ అవుట్ అవుతుందా?

Shaakuntalam: మరీ ఇంత ధారుణమా, గుణశేఖర్ కి చాలా పెద్ద దెబ్బ ఇది

Updated Date - 2023-04-18T11:48:03+05:30 IST