సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Samantha: ఇది ఎప్పటికీ నా హృదయానికి హత్తుకునేదే, సమంత ఎమోషనల్ !

ABN, First Publish Date - 2023-03-14T13:56:35+05:30

నటి సమంత చాలా ఎమోషనల్ అయింది. అందుకే తన సాంఘీక మాధ్యమాల్లో ఒక పోస్ట్ పెట్టింది. విత్త వ్యాధి నుండి తేరుకొని మళ్ళీ పనితో బిజీ గా వున్న సమంత ఎందుకు అంత ఎమోషనల్ అయింది అంటే...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సమంత (Samantha) మళ్ళీ వార్తల్లో వుంది, అయితే ఈసారి చాలా మంచి వార్తతో. ఆమె మళ్ళీ పనిలో చాలా బిజీ గా వుంది. విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) తో చేస్తున్న 'ఖుషీ' (Khushi) తెలుగు సినిమా షూటింగ్ మొదలయింది, అలాగే ఆమె చేస్తున్న వెబ్ సిరీస్ 'సిటాడెల్' (Citadel) షూటింగ్ కూడా కొంతవరకు చేసింది. ఇందులో వరుణ్ ధావన్ (Varun Dhawan) నటిస్తున్నాడు, ఇది అమెరికాలో ప్రియాంక చోప్రా (Priyanka Chopra) తో ఇంగ్లీష్ లో చేస్తున్న 'సిటాడెల్' వెబ్ సిరీస్ కి భారతీయ భాషల్లో తీస్తున్నారు.

ఇవన్నీ ఇలా ఉంటే సమంత ఇంకొక సినిమా 'శాకుంతలం' (Shakuntalam) విడుదలకి సిద్ధంగా వుంది. గుణశేఖర్ (Gunasekhar) ఈ సినిమాకి దర్శకుడు అయితే, దిల్ రాజు (Dil Raju), నీలిమ గుణ (Neelima Guna) నిర్మాతలు. ఈ సినిమా సమంత చూసింది, చూసాక ఆమె అభిప్రాయాన్ని చాల భావోద్వేగమయిన మాటలతో సాంఘీక మాధ్యమంలో పెట్టింది. "సినిమా అంతా ఇప్పుడే చూసా. చాలా బాగుంది, దర్శకుడు గుణశేఖర్ గారు ఎంతో బ్యూటిఫుల్ గా ఈ సినిమాని తీర్చిదిద్దారు. ఈ 'శాకుంతలం' ఎప్పటికీ నా హృదయానికి చాలా దగ్గరగా ఉంటుంది. కుటుంబ ప్రేక్షకులు ఈ సినిమాలో వున్నా గొప్ప భావోద్వేగాలను ఎప్పుడు చూస్తారా అని నేను ఎదురుచూస్తున్నాను," అని చెప్పింది సమంత.

ఈ సినిమా ఏప్రిల్ 14 న విడుదల అవుతోంది. ఇది ఒక పురాణం ఇతిహాసం అయిన మహాభారతం లోని 'అభిజ్ఞానం శాకుంతలం' అనే ఘట్టం నుండి తీసుకున్న ఒక కథ. దుష్యంత మహారాజుకి, శకుంతలకి మధ్య జరిగే ప్రేమ కథ ఇది. దుష్యంతుడిగా మలయాళం నటుడు దేవ్ మోహన్ (Dev Mohan) నటిస్తుండగా, సమంత శకుంతల గా నటిస్తోంది. అల్లు అర్జున్ (Allu Arjun) కూతురు అర్హ అల్లు (Arha Allu) ఇందులో భరతుడి చిన్నప్పటి పాత్ర వేసింది.

Updated Date - 2023-03-14T13:56:36+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!