Salaar: ట్రెండింగ్ లో ప్రభాస్, అందుకేనా 'సలార్' టీజర్ విడుదల చేసింది... ?

ABN , First Publish Date - 2023-07-06T06:47:17+05:30 IST

రామోజీ ఫిలిం సిటీ లో ఈ 'సలార్' సినిమా కోసం 14 భారీ సెట్లు వేసినట్టుగా ఈ సినిమా నిర్వాహకులు చెపుతున్నారు. దర్శకుడు ప్రశాంత్ నీల్, ప్రభాస్ కాంబినేషన్ లో వస్తున్నా ఇది ఒక అత్యంత భారీ బడ్జెట్ సినిమా. 'ఆదిపురుష్' సినిమాతో ప్రభాస్ కి వచ్చిన నెగటివిటీ ఈ టీజర్ పోగొడుతుందని అందరూ భావిస్తున్నారు. అప్పుడే ఇది ట్రెండింగ్ లో కి వచ్చేసింది.

Salaar: ట్రెండింగ్ లో ప్రభాస్, అందుకేనా 'సలార్' టీజర్ విడుదల చేసింది... ?
Prabhas in Salaar

'బాహుబలి' #Bahubali సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిన ప్ర‌భాస్‌తో #Prabhas 'కెజిఎఫ్' #KGF దర్శకుడు ప్ర‌శాంత్ నీల్ PRashanthNeel చేస్తున్న ‘సలార్ పార్ట్ 1: సీస్ ఫైర్’ #SalaarPart1: Ceasefire టీజర్ విడుదల అయింది. వీళ్లిద్దరి కాంబినేష‌న్‌లో హోంబలే ఫిలింస్ బ్యాన‌ర్‌పై రూపొందుతోన్న ఈ మూవీ టీజర్ గురించి ప్రకటన వెలువడిన రోజు నుంచి అభిమానులు, ప్రేక్ష‌కులు ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. టీజ‌ర్‌ను గురువారం ఉద‌యం 5 గంట‌ల 12 నిమిషాల‌కు విడుద‌ల చేస్తామ‌ని ప్ర‌క‌టించ‌టం ద్వారా ఆసక్తి మ‌రింత‌గా పెంచారు. అంద‌రూ ఊహించిన‌ట్లే ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ప్రభాస్ ని ఎంతలా ఎలివేట్ చెయ్యాలో అంతలా చేసి చూపించాడు ఈ టీజ‌ర్‌లో. #SalaarTeaser ఒక్క ప‌వ‌ర్‌ఫుల్ డైలాగ్ తో ప్రభాస్ ని ఒక రేంజ్ లో చూపించిన, ఈ భారీ బ‌డ్జెట్ చిత్రం బాక్సాఫీస్ రికార్డుల‌ను తిర‌గ రాస్తుంద‌ని ప్రభాస్ అభిమానులు అప్పుడే కామెంట్స్ చేస్తున్నారు.

salaar-teaser.jpg

అయితే ఇది ఎందుకు ఇప్పుడు విడుదల చేశారు అనే చర్చ కూడా మొదలైంది. ఎందుకంటే సినిమా సెప్టెంబర్ 28న విడుదల చేస్తున్నారు, చాలా ముందుగా టీజర్ విడుదల చేశారు. ప్రభాస్ ముందు సినిమా 'ఆదిపురుష్' #Adipurush ఒక పెద్ద ఫెయిల్యూర్ అవ్వటమే కాకుండా, ప్రభాస్ కి ఆ సినిమా చెయ్యడం వలన కొంచెం నెగటివిటీ వచ్చింది అని అనుకుంటున్నారు. ఎందుకంటే ఆ సినిమా దర్శకుడు ఓం రౌత్, (OmRaut) రచయిత మనోజ్ ముంతషీర్ (ManojMuntashir) లకు రామాయణం తెలియకపోతే, ప్రభాస్ అయినా చెప్పాలి కదా అని అందరూ ప్రభాస్ ని కూడా విమర్శిస్తున్నారు. అదీ కాకుండా ప్రభాస్ తెలుగు స్టార్, మరి 'ఆదిపురుష్' తెలుగు వెర్షన్ కూడా బాగాలేదు.

ఆ సినిమా వలన చాలా నెగటివిటీ ప్రభాస్ కి వ్యక్తిగతంగా వచ్చిందని, అది పోవాలి, ఆ సినిమా గురించి అభిమానులు మరిచిపోవాలంటే, ఈ 'సలార్' సినిమా వల్లే అవుతుందని, టీజర్ విడుదల చేసినట్టుగా చర్చ నడుస్తోంది. ఏమైనా కూడా 'సలార్' టీజర్ విడుదల అయింది, ఏదైతే ప్రభాస్ అనుకున్నాడో, అదే ఇప్పుడు జరుగుతోంది. అందరూ 'ఆదిపురుష్' గురించి మర్చిపోయి, ఈ 'సలార్' గురించి మాట్లాడటం మొదలెట్టేసారు.

డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ సృష్టించిన ప్ర‌త్యేక‌మైక‌మైన బిగ్గెస్ట్ యాక్ష‌న్ ప్ర‌పంచం KGF. అది చాలా పెద్ద ఘానా విజయం సాధించింది, అందుకని దానికి కొన‌సాగింపుగా ఎన్నో సీక్వెల్స్‌ను రూపొందించుకునేలా ప్లాన్ చేసుకున్నారు. ఇప్పుడు ఇంకో భారీ బ‌డ్జెట్‌ సినిమా, భారీ తారాగ‌ణంతో రూపొందిన ఈ 'స‌లార్' మూవీ టీజ‌ర్‌లో ప్రభాస్ అభిమానులకు పండగ చేసుకునేలా అందించాడు. స‌లార్ యూనివ‌ర్స్‌లోని పార్ట్ 1కు సంబంధించిన టీజ‌ర్ మాత్ర‌మే ఇది. ఇక థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌లో ఇంకెన్ని ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలుంటాయ‌నేది అంద‌రిలోనూ క్యూరియాసిటీని క‌లిగిస్తోంది.

ఇది ‘స‌లార్ 1: సీస్ ఫైర్‌’ తెర‌కెక్కుతోంది. విజ‌య్ కిర‌గందూర్ ఈ సినిమాకి నిర్మాత‌. ఇంతకు ముందు 'కెజిఎఫ్' సినిమాకి పనిచేసిన సాంకేతిక నిపుణులే ఈ 'స‌లార్' సినిమాకు కూడా పని చేస్తున్నారు అని చెప్పారు. రామో జీ ఫిల్మ్ సిటీలో ఈ సినిమా కోసం 14 భారీ సెట్స్ వేసి మ‌రీ చిత్రీక‌రించారు. ప్ర‌భాస్‌తో పాటు పృథ్వీరాజ్ సుకుమార‌న్‌ #PrudhvirajSukumaran, శ్రుతీ హాస‌న్‌ (ShrutiHaasan), జ‌గ‌ప‌తిబాబు (JagapathiBabu) వంటి భారీ తారాగ‌ణంతో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. సెప్టెంబ‌ర్ 28న తెలుగు, క‌న్న‌డ‌, హిందీ, మ‌ల‌యాళ‌, త‌మిళ భౄష‌ల్లో ప్ర‌పంచ వ్యాప్తంగా భారీ రేంజ్‌లో విడుద‌ల‌వుతుంది.

Updated Date - 2023-07-06T07:14:14+05:30 IST