Eagle X Dhamaka: ఈగల్‌లో.. కొత్త రవితేజని చూస్తారు

ABN , Publish Date - Dec 26 , 2023 | 11:00 PM

మాస్ మహారాజా రవితేజ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ ‘ధమాకా’. శ్రీలీల హీరోయిన్ గా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ చిత్రం ఏడాది పూర్తి చేసుకుంది. మరోవైపు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో రవితేజ తాజా చిత్రం ‘ఈగల్‌’2024 సంక్రాంతి కానుకగా జనవరి 13 ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ‘ఈగల్‌ x ధమాకా’ సెలబ్రేషన్స్‌ ని గ్రాండ్ గా నిర్వహించారు మేకర్స్. ఈ వేడుకలో ‘ధమాకా’ టీమ్‌కు మెమెంటోలు అందజేశారు.

Eagle X Dhamaka: ఈగల్‌లో.. కొత్త రవితేజని చూస్తారు
eagle

మాస్ మహారాజా రవితేజ (Raviteja) సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ ‘ధమాకా’(Dhamaka). శ్రీలీల హీరోయిన్ గా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ చిత్రం ఏడాది పూర్తి చేసుకుంది. మరోవైపు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో రవితేజ (Raviteja) తాజా చిత్రం ‘ఈగల్‌’(Eagle) 2024 సంక్రాంతి కానుకగా జనవరి 13 ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటివలే విడుదలైన ఈ చిత్రం ట్రైలర్ ట్రెమండస్ రెస్పాన్స్ తో 'ఈగల్'(Eagle) పై అంచనాలని మరో స్థాయికి తీసుకెళ్ళింది. ఈ సందర్భంగా ‘ఈగల్‌ x ధమాకా’(EagleXDhamaka) సెలబ్రేషన్స్‌ ని గ్రాండ్ గా నిర్వహించారు మేకర్స్. ఈ వేడుకలో ‘ధమాకా’ (Dhamaka) టీమ్‌కు మెమెంటోలు అందజేశారు.

‘ఈగల్‌ x ధమాకా’ (EagleXDhamaka)సెలబ్రేషన్స్‌ లో మాస్ మహారాజా రవితేజ (Raviteja) మాట్లాడుతూ.. నిర్మాత విశ్వప్రసాద్ గారికి అభినందనలు. ధమాకా (Dhamaka) నిన్నో మొన్నో విడుదలైనట్లుంది. ఏడాది అయిందంటే నమ్మబుద్ధి కావట్లేదు. సంగీత దర్శకుడు భీమ్స్‌ ఇచ్చిన పాటలకు.. తనకి మంచి గుర్తింపు వస్తుందని సినిమా విడుదల కాక ముందే బలంగా నమ్మాను. అదే నిజమైంది. వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. మనకున్న సంగీత దర్శకుల్లో తనుకూడా ఒక బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్. మళ్లీ మేం కలిసి పని చేయబోతున్నాం. శ్రీలీల (Sreeleela) పెద్ద హీరోయిన్ అవుతుందని చెప్పాను. ఊహించినట్లే శ్రీలీల (Sreeleela) హీరోయిన్‌గా అద్భుతంగా రాణిస్తోంది. ఆది, మంగ్లీ, మౌనిక టీం అందరికి పేరుపేరునా అభినందనలు.


‘ఈగల్‌’ (Eagle) సినిమా విషయానికి వస్తే,. కార్తిక్ ని కెమరామ్యాన్ గా చూశాం. ఇప్పుడు దర్శకుడిగా చూడబోతున్నాం. ఈ సినిమాతో కార్తిక్ కి చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంటుందని నా బలమైన నమ్మకం. ఒక్కటి మాత్రం చెప్పగలను.. ఇందులో ప్రేక్షకులకు ఒక కొత్త రవితేజ (Raviteja)ను చూపించ బోతున్నాడు. అది నాకు చాలా తృప్తిని ఇచ్చింది. ఈ సినిమాలో కొత్త కావ్యా థాపర్‌ కనిపిస్తుంది. ఆ పాత్ర నాకు చాలా నచ్చింది. దేవ్ జాంద్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. తను గొప్ప స్థాయికి వెళ్ళాలని కోరుకుంటున్నాను. అవసరాల శ్రీనివాస్ చాలా సెన్సిబుల్ పర్సన్. విశ్వగారి ఆల్ ది వెరీ బెస్ట్. మా ప్రయాణం కొనసాగుతుంది' అన్నారు.

Updated Date - Dec 26 , 2023 | 11:00 PM