Ravi teja - Gopichand : హ్యాట్రిక్‌ తర్వాత మరోసారి.. కిరాక్‌ కాంబినేషన్ ఇది!

ABN , First Publish Date - 2023-10-26T16:12:26+05:30 IST

డాన్ శీను, బలుపు, క్రాక్‌ చిత్రాలు హ్యాట్రిక్‌ అందుకున్న మహారాజా రవితేజ (Raviteja) - గోపీచంద్‌ మలినేని (Gopi Chand Malineni) కాంబినేషన్ మరోసారి సెట్‌ అయింది. మూడు విజయవంతమైన చిత్రాలతో ప్రేక్షకుల్ని అలరించిన ఈ కాంబో నాలుగో చిత్రంతో అలరించడానికి సిద్ధమవుతోంది. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది.

Ravi teja - Gopichand : హ్యాట్రిక్‌ తర్వాత మరోసారి..  కిరాక్‌ కాంబినేషన్ ఇది!

డాన్ శీను, బలుపు, క్రాక్‌ చిత్రాలు హ్యాట్రిక్‌ అందుకున్న మహారాజా రవితేజ (Raviteja) - గోపీచంద్‌ మలినేని (Gopi Chand Malineni) కాంబినేషన్ మరోసారి సెట్‌ అయింది. మూడు విజయవంతమైన చిత్రాలతో ప్రేక్షకుల్ని అలరించిన ఈ కాంబో నాలుగో చిత్రంతో అలరించడానికి సిద్ధమవుతోంది. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. వాస్తవ సంఘటనల ఆధారంగా యూనిక్‌, పవర్‌ ఫుల్‌ కథతో ఈ చిత్రం రూపొందనుంది. కొన్ని నెలల క్రితం పవర్‌ఫుల్‌ పోస్టర్‌ ద్వారా సినిమాని అనౌన్స్‌ చేశారు మేకర్స్‌. ఆ పోస్టర్‌కి టెర్రిఫిక్‌ రెస్పాన్స్  వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా మేకర్స్‌ ‘బ్లాస్టింగ్‌ అప్‌డేట్‌’ కోసం సిద్థంగా ఉండండి’ అని చేసిన ట్వీట్‌ అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపింది.

Ravitej.jpg 3.jpg

గురువారం ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో మొదలైంది. ముహూర్తం సన్నివేశానికి అన్మోల్‌ శర్మ కెమెరా స్విచాన్‌ చేయగా, వివి వినాయక్‌ క్లాప్‌ ఇచ్చారు. తొలి షాట్‌కి కె రాఘవేంద్రరావు గౌరవ దర్శకత్వం వహించారు. అల్లు అరవింద్‌ మేకర్స్‌కి స్ర్కిప్ట్‌ అందజేశారు. ఇందులో రవితేజ మునుపెన్నడూ కనిపించని లుక్‌లో కనిపించనున్నారు. నటుడిగా మారిన ఫిల్మ్‌ మేకర్‌ సెల్వరాఘవన్‌ ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించనున్నారు. ఆయన నటిస్తున్న తొలి చిత్రమిది. ఇందూజ రవిచంద్రన్‌ ఓ కీలక పాత్రలో సందడి చేయనున్నారు. అయితే హీరోయిన ఎవరనేది తెలియాల్సి ఉంది. వాస్తవ సంఘటనలు ఇతివృత్తంగా యూనిక్‌, పవర్‌ఫుల్‌ కథతో రూపొందనుంది. నవీన్‌ యెర్నేని, వై రవిశంకర్‌ ఈ చిత్రాన్ని భారీగా నిర్మించనున్నారు. ఎస్‌.ఎస్‌ తమన సంగీతం అందించనున్నారు. రవితేజ, తమన కాంబినేషనలో వస్తున్న 12వ చిత్రం కాగా, గోపీచంద్‌ మలినేనితో అతని 7వ చిత్రం, మైత్రీ మూవీ మేకర్స్‌తో 4వ చిత్రంగా వస్తోంది. ఈ చిత్రానకి కథ-దర్శకత్వం: గోపీచంద్‌ మలినేని, సంగీతం: ఎస్‌ థమన్‌, డీవోపీ: జీకే విష్ణు.

Updated Date - 2023-10-26T16:14:10+05:30 IST