Ravanasura: రవితేజ సినిమా ఎంతకి అమ్మారో తెలుసా...

ABN , First Publish Date - 2023-04-06T11:44:40+05:30 IST

రవి తేజ నటించిన 'రావణాసుర' సినిమా ఈ శుక్రవారం విడుదల అవుతోంది. అయితే గత సినిమాలతో పోలిస్తే ఈ సినిమా విడుదలకి ముందు ఎంత బిజినెస్ చేసిందో చూడండి...

Ravanasura: రవితేజ సినిమా ఎంతకి అమ్మారో తెలుసా...

రవితేజ (Ravi Teja) సినిమా 'రావణాసుర' (Ravanasura) రేపు శుక్రవారం విడుదల అవుతోంది. ఈ సినిమా విడుదలకి ముందు జరిగే బిజినెస్ రవితేజ ఇంతకు ముందు సినిమాలతో పోలిస్తే, ఇది కూడా అదే రేంజ్ లో అయింది. ఇంతకు ముందు రవి తేజ సినిమా 'ధమాకా' (Dhamaka) విడుదలయి విజయడంకా మోగించింది. 'ధమాకా' సినిమా రవితేజ కెరీర్ లో పెద్ద హిట్ సినిమాగా చెప్పొచ్చు. అయితే ఇప్పుడు విడుదల కాబోతున్న సినిమా 'రావణాసుర' ధమాకా విజయం వలన బిజినెస్ లో పెద్దగా పెరగలేదు.

ravanasura1.jpg

'రావణాసుర' సినిమా నిర్మాత అభిషేక్ నామ (Abhishek Nama), కాగా దర్శకుడు సుధీర్ వర్మ (Sudheer Varma). ఆసక్తికరం ఏంటి అంటే, సుధీర్ వర్మకి ఒక్క 'స్వామి రారా' (Swami RaRa) సినిమా హిట్ తప్పితే ఇంకే సినిమా కూడా హిట్ లేదు. అయితే సుధీర్ వర్మ కొంచెం స్టైలిష్ గా సినిమాలు తీస్తాడనే పేరు కూడా వుంది. ఈ 'రావణాసుర' (Ravanasura) సినిమా కూడా ఒక బెంగాలీ సినిమాకి రీమేక్ అని అంటున్నారు కానీ అది ఎంతవరకు నిజమో తెలియదు.

ఇంకా బిజినెస్ పరంగా చూస్తే 'రావణాసుర' సినిమా మొత్తం సుమారు రూ.22.20 కోట్ల వరకు బిజినెస్ అయింది. నైజాం (Nizam area) సుమారు రూ.7 కోట్లకు అయితే, ఆంధ్ర (Andhra) ఏరియా ని రూ. 10 కోట్లకు డిస్ట్రిబ్యూషన్ హక్కులు అమ్మారు. అలాగే సీడెడ్ (Ceded) ఏరియా రూ.3 కోట్లకు అమ్మారు. మిగతా ఇండియా, ఓవర్సీస్ మార్కెట్ కలిపి రూ. 2.20 కోట్లకు అమ్మారు.

ravanasura3.jpg

ఇప్పుడు 'ధమాకా' సినిమాతో కనక పోలిస్తే, ఈ సినిమాకి ఏమి పెద్దగా హైప్ రాలేదు. ఎందుకంటే దర్శకుడు సుధీర్ వర్మ కి పెద్దగా మార్కెట్ లేదు అని ట్రేడ్ అనలిస్ట్స్ అంటున్నారు. రవితేజ ముందు సినిమా విజయం మీద ఈ సినిమా బిజినెస్ చెయ్యలేదో అర్థం కాలేదు అని పరిశ్రమలో అనుకుంటున్నారు. రవి తేజ గత అయిదు సినిమాలు కూడా ఇదే రేంజ్ లో బిజినెస్ అయింది అని అంటున్నారు.

రవి తేజ గత అయిదు మూవీస్ విడుదలకి ముందు బిజినెస్ వివరాలు:

రావణాసుర: రూ. 22.20 కోట్లు

ధమాకా (Dhamaka): రూ. 18.30 కోట్లు

రామారావు ఆన్ డ్యూటీ (Ramarao On Duty): రూ. 17.20 కోట్లు

ఖిలాడీ (Khiladi): రూ. 22.80 కోట్లు

క్రాక్ (Krack): రూ. 17.00 కోట్లు

డిస్కో రాజా (Disco Raja): రూ. 19.20 కోట్లు

Updated Date - 2023-04-06T11:44:41+05:30 IST