Raviteja - Ravanasura: సీన్‌ లీక్‌.. నెట్టింట హల్‌చల్‌!

ABN , First Publish Date - 2023-04-06T20:11:22+05:30 IST

మాస్‌ మహారాజా రవితేజ మంచి దూకుడు మీదున్నారు. తాజాగా ‘ధమాకా’తో విజయం అందుకున్న ఆయన ఈ శుక్రవారం ‘రావణాసుర’ చిత్రంతో ప్రేక్షకుల్ని పలకరించనున్నారు.

Raviteja - Ravanasura: సీన్‌ లీక్‌.. నెట్టింట హల్‌చల్‌!

మాస్‌ మహారాజా రవితేజ (Raviteja) మంచి దూకుడు మీదున్నారు. తాజాగా ‘ధమాకా’తో విజయం అందుకున్న ఆయన ఈ శుక్రవారం ‘రావణాసుర’ (Ravanasura) చిత్రంతో ప్రేక్షకుల్ని పలకరించనున్నారు. అయితే మరి కొన్ని గంటల్లో విడుదలకు సిద్దమైన ఈ చిత్రం నుంచి ఓ సీన్‌ నెట్టింట దర్శనమిచ్చింది. ఇందులో రవితేజ అమ్మాయిల గురించి చెప్పిన డైలాగ్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. (ravanasura Leaked video viral) ‘కంచం ముందుకి.. మంచం మీదకి ఆడపిల్లలు పిలవగానే రావాలి.. లేకపోతే నాకు మండుద్ది.. దా..’ అంటూ బోల్డ్‌ అండ్‌ ఫైర్‌తో చెప్పిన ఆ డైలాగ్‌ నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. అయితే ఈ డైలాగ్‌ అభ్యంతరకరంగా ఉందని సోషల్‌ మీడియాలో అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రవితేజ లాంటి స్టార్‌ హీరో అమ్మాయిల గురించి ఇలాంటి డైలాగ్‌ చెప్పడం కరెక్ట్‌గా లేదని. ఇలాంటి డైలాగ్‌లకు సెన్సార్‌ బోర్డ్‌ ఎలా అనుమతి ఇచ్చిందని సోషల్‌ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సుధీర్‌ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అభిషేక్‌ నామా, రవితేజ నిర్మాతలు. మేఘా ఆకాశ్‌(megha akash), అను ఇమ్మాన్యూయేల్‌(anuemmanuel), పూజితా పొన్నాడ, ధక్షా నగార్కర్‌, ఫరియా అబ్దుల్లా నాయికలు.

Updated Date - 2023-04-06T20:27:07+05:30 IST