Rashmika Mandanna: ఇంకో పెద్ద ఛాన్స్ కొట్టేసిన ఈ నేషనల్ క్రష్

ABN , First Publish Date - 2023-08-14T11:33:07+05:30 IST

'పుష్ప' సినిమాతో రష్మిక మందన్న కాస్త 'నేషనల్ క్రష్' అయిపొయింది. రణబీర్ కపూర్ పక్క హిందీ సినిమా 'యానిమల్' చేస్తోంది, అల్లు అర్జున పక్కన 'పుష్ప 2' చేస్తోంది, ఇలా రెండు పెద్ద ప్రాజెక్ట్ లు చేస్తూ ఉండగానే ఇంకో పెద్ద ప్రాజెక్ట్ లోకి ఆమె ఇప్పుడు ఎంటర్ అయింది.

Rashmika Mandanna: ఇంకో పెద్ద ఛాన్స్ కొట్టేసిన ఈ నేషనల్ క్రష్
Rashmika Mandanna

రష్మిక మందన్న (RashmikaMandanna) ఇంకో పెద్ద ఛాన్స్ కొట్టింది. ఒక పక్క అల్లు అర్జున్ (AlluArjun) నటించిన 'పుష్ప 2' #Pushpa2 షూటింగ్ చేస్తోంది, అలాగే ఇంకో పక్క రణబీర్ కపూర్ (RanbirKapoor) పక్క 'యానిమల్' #Animal సినిమా చేస్తోంది. ఇలా రష్మిక ఇప్పుడు చాలా చాలా పెద్ద పెద్ద సినిమాలతో బిజీ గా ఉంటోంది. ఇప్పుడు ఇంకో పెద్ద సినిమా లో కూడా రష్మిక కథానాయకురాలు అని అధికార ప్రకటన వచ్చేసింది. ఇంతకీ ఆ సినిమా మరేదో కాదు. దర్శకుడు శేఖర్ కమ్ముల (SekharKammula), తమిళ స్టార్ ధనుష్ (Dhanush) కాంబినేషన్ లో సినిమా ఎప్పుడో ప్రకటించారు కదా, ఇప్పుడు ఆ సినిమాలో ధనుష్ పక్కన రష్మిక మందన్నని తీసుకుంటున్నట్టుగా ఆ చిత్ర నిర్వాహకులు అధికారికంగా ప్రకటించారు.

Rashmika-Mandanna.jpg

దర్శకుడు శేఖర్ కమ్ముల సినిమా అంటే అందులో కథానాయకురాలి పాత్ర కూడా చాలా బలంగా ఉంటుంది. అది ఇంతకు ముందు అతని సినిమాలు చూస్తేనే అర్థం అయిపోతుంది. ఇందులో రష్మిక పాత్ర చాలా బలంగా వుండబోతోంది అని అర్థం అయిపోతుంది. అదీ కాకుండా రష్మిక, ధనుష్ పక్కన అంటే ఈ సినిమా మళ్ళీ ఇంకో పాన్ ఇండియా గా రాబోతోంది అని అర్థం. ఎందుకంటే ధనుష్ కి తమిళంలో విశేషంగా అభుమానులున్నారు, ఈమధ్యనే తెలుగు ప్రేక్షకులు కూడా అతని సినిమాలు బాగా చూస్తున్నారు, అతను హిందీ లో కూడా చాలా సినిమాలు చేసాడు.

అందుకని ధనుష్ అన్ని ప్రాంతాల ప్రేక్షకులకి చాలా పరిచయస్తుడు, అందుకనే ఈ రాబోయే సినిమా పాన్ ఇండియా సినిమాగా విడుదల చేస్తారు అనటంలో సందేశం లేదు. ఇంతకు ముందు శేఖర్ కమ్ముల తో 'లవ్ స్టోరీ' సినిమా నిర్మించిన సునీల్ నారంగ్ ఈ పాన్ ఇండియా సినిమాని నిర్మిస్తున్నారు. 'పుష్ప' సినిమాతో నేషనల్ క్రష్ అని అనిపించుకున్న రష్మిక ఇక ఎక్కడా తగ్గేదే లే అన్నట్టుగా పెద్ద పెద్ద సినిమాలు చేసుకుంటూ ముందుకు దూసుకుపోతోంది.

Updated Date - 2023-08-14T11:33:07+05:30 IST