Weekend box office: బోయపాటి, రామ్ పోతినేని సినిమా అంతేనా, మిగతా సినిమాల పరిస్థితి ఏంటి?

ABN , First Publish Date - 2023-10-02T15:57:45+05:30 IST

గత వారం మూడు సినిమాలు విడుదలయ్యాయి, అందులో ఒకటి డబ్బింగ్ సినిమా. రామ్ పోతినేని, బోయపాటి కాంబినేషన్ 'స్కంద' ఒక్కటే కొంచెం బాక్స్ ఆఫీస్ దగ్గర ఓపెనింగ్స్ తెచ్చుకుంది, మిగతా రెండు సినిమాలు...

Weekend box office: బోయపాటి, రామ్ పోతినేని సినిమా అంతేనా, మిగతా సినిమాల పరిస్థితి ఏంటి?
Ram Pothineni from Skanda

గత వారం మూడు సినిమాలు విడుదలయ్యాయి. అందులో రామ్ పోతినేని(RamPothineni), బోయపాటి శ్రీను (BoyapatiSreenu) దర్శకత్వంలో వచ్చిన 'స్కంద' #Skanda కొంచెం ఓపెనింగ్స్ తెచ్చుకుంది. ఇంకో రెండు సినిమాలు, ఒకటి శ్రీకాంత్ అడ్డాల (SrikanthAddala) దర్శకత్వంలో వచ్చిన 'పెదకాపు 1', #PeddhaKapu1 ఇంకోటి రాఘవ లారెన్స్ కథానాయకుడిగా వచ్చిన 'చంద్రముఖి 2' (Chandramukhi2), అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర గల్లంతయ్యాయి అని చెప్పాలి. అయితే ఈరోజు సోమవారం గాంధీ జయంతి సందర్భంగా సెలవు దినం కావటంతో, 'స్కంద' కలెక్షన్స్ కొంచెం బాగుంటాయేమో అని ఆశాభావం చిత్ర నిర్వాహకులు వ్యక్తి చేస్తున్నారు.

peddhakapu3.jpg

శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన సినిమా 'పెదకాపు 1' శ్రీకాంత్ కి చాలా కీలకమైన సినిమా. కానీ అతను ఈ సినిమా కథను సరిగ్గా నేరేట్ చెయ్యలేకపోయాడు, గందరగోళం చేసేసాడు. అందులో ఏ పాత్ర ఏంటి అనేది ప్రేక్షకులకి ఒక బలమైన కారణం చెప్పలేకపోయాడు. అందుకని ఆ సినిమాని ప్రేక్షకులు అంతగా పట్టించుకోలేదు, కానీ కథానాయకుడు విరాట్ కర్ణ కి మాత్రం అందరూ ఫుల్ మార్కులు వేశారు అని ట్రేడ్ అనలిస్ట్స్ చెపుతున్నారు.

ఇక రాఘవ లారెన్స్ (RaghavaLawrence) నటించిన 'చంద్రముఖి 2' ని ఇక్కడ తెలుగు ప్రేక్షకులు పట్టించుకోలేదు. పి వాసు దర్శకత్వంలో వచ్చిన ఈ సీక్వెల్ లో కంగనా రనౌత్ (KanganaRanaut) చంద్రముఖిగా కనిపించింది. అయితే తమిళంలో ఈ సినిమాకి బాగానే ఓపెనింగ్స్ వచ్చాయి అని అంటున్నారు, కానీ తెలుగులో మాత్రం పెద్ద ఫ్లాప్ అని ట్రేడ్ అనలిస్ట్స్ చెపుతున్నారు.

chandramukhi3.jpg

ఇక బోయపాటి, రామ్ పోతినేని కాంబినేషన్ లో వచ్చిన 'స్కంద' విడుదలకి ముందు రూ. 40 కోట్లు వ్యాపారం చేసింది. ఈ సినిమా విజయం సాధించాలంటే థియేట్రికల్ వ్యాపారం దానికన్నా ఎక్కువ రావాలి. కానీ ఈ సినిమా నాలుగు రోజులకి కలిపి రూ. 43.9 కోట్లు గ్రాస్ కలెక్టు చేసిందని అధికారికంగా సినిమా పీఆర్వో చెప్పారు. ఇది ప్రపంచవ్యాప్తంగా వచ్చిన వ్యాపారం, కానీ సోమవారం సెలవు దినం కావటంతో ఇంకా కొంచెం ఏమైనా రావచ్చు, కానీ ఈ సినిమా రూ.40 కోట్లు కలెక్టు చెయ్యడం మాత్రం కష్టం అని అంటున్నారు ట్రేడ్ అనలిస్ట్స్.

rampothineni-skanda2.jpg

ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు ఎక్కువయిపోయాయని, హింస కూడా ఉందని, అలాగే దర్శకుడు లాజిక్ మిస్ అయ్యాడని, సినిమాలో ఎక్కువ భాగం కథానాయకుడు రామ్ అందరినీ కొట్టుకుంటూ వెళుతూ ఉంటాడని, అందుకని ఈ సినిమా మీద మిశ్రమ టాక్ వచ్చింది. కుటుంబ ప్రేక్షకులు అంతగా రావటం లేదు ఈ సినిమాకి. అందుకని ఈ సినిమా నిలబడటం కష్టమే అని అంటున్నారు. మంగళవారం నుండి ఈ సినిమాకి పరీక్ష అని అంటున్నారు.

Updated Date - 2023-10-02T15:57:45+05:30 IST