Rajanikanth: అవన్నీ పట్టించుకుంటే ముందుకు సాగలేం!

ABN , First Publish Date - 2023-07-30T18:14:54+05:30 IST

తలైవా రజనీకాంత్‌ హీరోగా దర్శకుడు నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ రూపొందించిన చిత్రం ‘జైలర్‌’. ఆగస్ట్ట్‌ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ చిత్రం ఆడియో విడుదల చెన్నైలో జరిగింది. ఆ వేదికగా రజనీకాంత్‌ స్పీచ్‌ సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతోంది.

Rajanikanth: అవన్నీ పట్టించుకుంటే ముందుకు సాగలేం!

తలైవా రజనీకాంత్‌ హీరోగా దర్శకుడు నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ రూపొందించిన చిత్రం ‘జైలర్‌’. ఆగస్ట్ట్‌ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ చిత్రం ఆడియో విడుదల చెన్నైలో జరిగింది. ఆ వేదికగా రజనీకాంత్‌ స్పీచ్‌ సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతోంది. ‘జైలర్‌’ చిత్రంలోని ‘హుకుం’ పాట విడుదల చేసినప్పుడు అందులో నా పేరుకు ముందు వచ్చే సూపర్‌స్టార్‌ అనే పదాన్ని తీేసయాలని దర్శకనిర్మాతను కోరాను. గతంలోనూ ఈ ట్యాగ్‌ తీసేయాలని కొందరు దర్శకులను అడిగాను. ఇది ఎప్పుడే సమేస్య’’ అని రజనీకాంత్‌ అన్నారు. అంతే కాకుండా పాత విషయాలను కూడా రజనీ గుర్తు చేసుకున్నారు. ‘‘ఒకప్పుడు నేను మద్యం తాగే వాడిని. నా జీవితంలో చేసిన అతి పెద్ద తప్పు అదే! ఆరోగ్యం, ఆనందం రెండింటిపై ఇది తీవ్ర ప్రభావం చూపుతుందని.. దానికి దూరంగా ఉండాలి’’ అని అభిమానులకు రజనీ విజ్ఞప్తి చేశారు.

సినిమా గురించి చెబుతూ ‘‘ఇటీవల నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌, విజయ్‌ కాంబోలో వచ్చిన ‘బీస్ట్‌’ నెగెటివ్‌ టాక్‌ను సొంతం చేసుకున్నప్పటికీ నిర్మాతలకు రాలేదు. మంచి దర్శకుడు ఎప్పటికీ ఫెయిల్‌ కాడు. తాను ఎంచుకున్న కథలో చిన్న మార్పులు ఉండొచ్చేమో గానీ దర్శకత్వంలో ఎలాంటి లోపం ఉండదు. మనం ఒక పని చేస్తున్నామంటే విమర్శించే వారు చాలా మంది ఉంటారు. వాళ్లను పట్టించుకుంటే ముందుకు సాగలేం’’ అని రజనీకాంత్‌ అన్నారు. తమన్నా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో మలయాళ హీరో మోహన్‌ లాల్‌, కన్నడ స్టార్‌ హీరో శివరాజ్‌ కుమార్‌, బాలీవుడ్‌ యాక్టర్‌ జాకీ ష్రాఫ్‌, రమ్యకృష్ణ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Updated Date - 2023-07-30T18:15:25+05:30 IST