C Kalyan: మందు విందు పొందు అనేది మాకు అలవాటు లేదు, దిల్ రాజుని ఇలా టార్గెట్ చేశాడేంటి ?

ABN , First Publish Date - 2023-07-26T18:22:46+05:30 IST

దక్షిణ భారత దేశంలోనూ, అలాగే భారతీయ చలనచిత్ర ఫెడరేషన్ లోనూ అనేక పదవులు నిర్వహించిన అనుభవశాలి, సీనియర్ నిర్మాత సి కళ్యాణ్ ఒక పేనల్ కి ప్రాతినిధ్యం వహిస్తుండగా, ఇంకో పక్క ప్రముఖ నిర్మాత దిల్ రాజు మధ్య పోటీ ఈసారి ఫిలిం ఛాంబర్ ఎన్నికల్లో చాలా ఆసక్తికరంగా వుండబోతోంది అని అంటున్నారు. అయితే దిల్ రాజు సభ్యుడుగా వున్న 27 మంది నిర్మాతలతో కూడిన గిల్డ్, 1600 మంది సభ్యులు వున్న ఫిలిం ఛాంబర్ రక్తం తాగుతోంది అని కళ్యాణ్ ఆరోపించారు.

C Kalyan: మందు విందు పొందు అనేది మాకు అలవాటు లేదు,  దిల్ రాజుని ఇలా టార్గెట్ చేశాడేంటి ?
C Kalyan accuses Dil Raju panel in the coming FIlm Chamber elections

మరోసారి టాలీవుడ్ వార్తల్లో వుంది. ఆమధ్య మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ (MovieArtisteAssociation) ఎన్నికలు, రాష్ట్ర ఎన్నికలను తలపించేలా చేశారు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో. ఇప్పుడు ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలు వచ్చాయి. అప్పుడు నటీనటులు అయితే, ఈసారి నిర్మాతలు ఒకరి మీద ఒకరు బురద జల్లుకోవటం మొదలెట్టారు. అసలు ఈ ఆరోపణలు చూస్తుటేన్, తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఇంతలా ఉందా అని ఆశ్చర్యపోకమానదు. ఒక పానెల్ కి బాగా అనుభవజ్ఞుడు అయిన సి కళ్యాణ్ (CKalyan) అధ్యక్షత వహిస్తే, ఇంకో పేనెల్ కి ప్రముఖ నిర్మాత దిల్ రాజు (DilRaju) ప్రాతినిధ్యం వహిస్తున్నారు. #TeluguFilmChamberOfCommerce

ఈ ఇద్దరూ ఇప్పుడు ఒకరి మీద ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నారు. తమ పేనల్ వస్తే ఎటువంటి మేలు పరిశ్రమకి, నిర్మాతలకి మేలుచేస్తామన్నది వివరిస్తూనే, అవతలి పేనల్ వాళ్ళని బాగా విమర్శిన్నారు. సి కళ్యాణ్ ఈరోజు ఒక మీడియా సమావేశం నిర్వహించి, దిల్ రాజు పేనల్ మీద విరుచుకుపడ్డారు. ''దాసరి (Dasari) గారి బాటలో నిర్మాతగా, నిర్మాతల మండలిలో చిన్న సభ్యుడిగా ఎదిగాను. నిర్మాతల సంక్షేమం కోసం రకరకాలుగా ఆదాయాన్ని సమకూర్చాం. నాలుగు రాష్ట్రాల చిత్ర పరిశ్రమలను కలిపి లీడ్ చేద్దామనుకుంటున్నాం. ఆయా ప్రభుత్వాల సహకారంతో నాలుగు రాష్ట్రాల పరిశ్రమలకు మంచి చేస్తాం" అని చెప్పారు నిర్మాత సి కళ్యాణ్.

dilraju3.jpg

మొదట నిర్మాతలకు మెడిక్లైమ్ తీసుకొచ్చింది నేనే అని చెప్పారు సి కళ్యాణ్. కొందరు నిర్మాతలు గిల్డ్ (Guild) పేర వేరే కుంపటి పెట్టి సినిమాలు నిర్మించుకుంటున్నారు. దాని మీద కూడా కళ్యాణ్ మాట్లాడుతూ "నిర్మాతల మండలి ఆదాయానికి గిల్డ్ అనే గ్రూపు గండి కొట్టింది. గత నాలుగేళ్లలో ఫిల్మ్ ఛాంబర్ సర్వనాశనం అయ్యింది. నేను ఈ దఫా అధ్యక్షుడిగా పోటీ చేయడానికి బలమైన కారణం ఉంది. గతంలో దిల్ రాజు, దామోదరప్రసాద్ (DamodaraPrasad) వచ్చి డిజిటల్ ఛార్జీల విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకుంటామని చెబితే విరమించుకున్నా. రెండు లక్షల రూపాయలు లేకుండా సినిమా విడుదల ఆగిపోయిన సందర్భాలు నేను ఎదుర్కొన్నా. చిన్న సినిమాలు ఆపితే కృష్టానగర్ అకలితో అలమటిస్తుంది.పెద్ద సినిమాలకు ఎక్కువ మంది పనిచేయరు. చిన్న సినిమాలను బతికించాలి" అని కళ్యాణ్ అన్నారు.

ఐదుగురు నిర్మాతలు చిన్న సినిమాలకు మేం ఉన్నామని చెబితే సంతోషించాం. ఇప్పుడు సినిమా పరిశ్రమకు దాసరి లాంటి వ్యక్తులు కావాలి అని, కొంతమంది నిర్మాతలు ఎన్నికల్లో పోటీ చేయరు కానీ, కొందరి పేర్లు ప్రతిపాదిస్తారు, లేదా బెదిరిస్తారు కూడా అని ఆరోపిస్తూ, ఆస్కార్ నిర్మాత దానయ్య (DVVDanayya), బాహుబలి (Bahubali) నిర్మాత శోభుయార్లగడ్డను (ShobhuYarlagadda) ఎందుకు నిలబెట్టడం లేదు. ఫిల్మ్ ఛాంబర్ కు సేవ చేసేవాళ్లు కావాలి అని ప్రశ్నించారు కళ్యాణ్.

సి కళ్యాణ్ సౌత్ ఇండియన్ ఫిలిం ఛాంబర్ అఫ్ కామర్స్ లోనూ, అలాగే ఫిలిం ఫెడరేషన్ అఫ్ ఇండియా లోనూ పనిచేసిన అనుభవం వుంది. తమిళనాడు ముఖ్యమంత్రిగా జయలలిత వున్నప్పుడు, నూరేళ్ళ ఇండియన్ సినిమాని చెన్నైలో ఘనంగా చేసిన ఘనత కళ్యాణ్ కి వుంది. అతను దక్షిణాదికి చెందిన అన్ని ప్రభుత్వాలతోనూ మంచి సంబంధాలు కొనసాగిస్తూ ఉంటాడు. "నేను నాలుగు సినీ పరిశ్రమలను కలపగలను, డైలాగులు చెప్పడం కాదు ఆచరణ సాధ్యమయ్యే పనులు చేయండి. ఫిల్మ్ ఛాంబర్ కు సేవ చేసేవాళ్లు కావాలి. పని చేసే వాళ్లను నిర్మాతలు గుర్తిస్తారు," అని చెప్పారు కళ్యాణ్.

ckalyan2.jpg

ప్రస్తుతం ఛాంబర్ లో ఓటు హక్కు ఉన్నవాళ్లలో 1600 మంది నిర్మాతలున్నారని చెప్పారు, అలాగే ఫిల్మ్ ఛాంబర్ లో నిర్మాణ సంస్థలకు ఓటు హక్కు ఉంది, వ్యక్తులకు కాదు. బ్యానర్ తరపున ప్రతినిధి తన ఓటు హక్కును వినియోగించుకుంటారు అని చెప్పారు. ఎన్నికల్లో పోటిపై దిల్ రాజును కలిసి మాట్లాడాను. గిల్డ్ లోని 27 మంది సభ్యులు 1600 మంది నిర్మాతల రక్తం తాగుతున్నారు, అని ఆరోపించారు కళ్యాణ్. దిల్ రాజుతో నాకు ఎలాంటి యుద్ధం లేదు అని చెప్పారు కళ్యాణ్. నా సినిమా కూడా దిల్ రాజు డిస్ట్రిబ్యూషన్ నుంచి విడుదల కాలేదు ఎన్నికలు వచ్చాయి కాబట్టే నాకు ఆయన ప్రత్యర్థి. గుత్తాదిపత్యం, స్టూడియోల వ్యాపారం వల్ల పరిశ్రమ బీటలు వారుతోంది. మాకు ఈ ఎన్నికల్లో అడ్డదారుల్లో గెలవాలని లేదు. మందు విందు పొందు అనేది మాకు అలవాటు లేదు. మాది పూర్ ఫ్యూర్ ప్యానెల్'' అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రసన్నకుమార్‌ (PrasannaKumar), అశోక్‌కుమార్‌, మద్దినేని రమేశ్‌, నట్టి కుమార్‌ (NattiKumar), రామసత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-07-26T18:22:46+05:30 IST