Agent: దానర్థం దర్శకుడిని బ్లేమ్ చేశానని కాదు, అది అందరం చేసిన తప్పు: నిర్మాత అనిల్ సుంకర

ABN , First Publish Date - 2023-07-03T13:40:20+05:30 IST

'ఏజెంట్' సినిమా నిర్మాత అనిల్ సుంకర ఆ సినిమా ఫెయిల్ అయిందని తెలియగానే ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ దర్శకుడిని, విమర్శించే విధంగా వుంది అని సాంఘీక మాధ్యమాల్లో అప్పుడు ప్రచారం జరిగింది. అయితే ఆ ట్వీట్ అర్థం అది కాదని, అది ఎందుకు చెయ్యాల్సి వచ్చిందో వివరించారు అనిల్.

Agent:  దానర్థం దర్శకుడిని బ్లేమ్ చేశానని కాదు, అది అందరం చేసిన తప్పు: నిర్మాత అనిల్ సుంకర
Producer Anil Sunkara

నిర్మాత అనిల్ సుంకర (AnilSunkar) చాలా సంతోషంగా వున్నారు. ఎందుకంటే అతను నిర్మించిన 'సామజవరగమన' #Samajavaragamana సినిమా సూపర్ హిట్ దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో శ్రీవిష్ణు (SreeVishnu), రెబా మోనికా జాన్ (RebMonicaJohn) లీడ్ పెయిర్ కాగా, రామ్ అబ్బరాజు (RamAbbaraju) దర్శకత్వం వహించాడు. మొదటి రోజు నుండీ ఈ సినిమాకి మంచి పాజిటివ్ టాక్ వచ్చింది, ఇప్పుడు కలెక్షన్స్ కూడా బాగా పెరుగుతున్నాయి. ఈ సినిమా ఒక హిలేరియస్ కామెడీ సినిమా. సీనియర్ నటుడు నరేష్ (VKNaresh) ఇందులో ఒక ముఖ్యమైన పాత్ర పోషించాడు.

anilsunkara1.jpg

ఇదిలా ఉంటే, 'ఏజెంట్' #Agent సినిమా విడుదల అయిన తరువాత పెద్ద ఫ్లాప్ అయింది. వెంటనే నిర్మాత అనిల్ సుంకర ఒక ట్వీట్ చేస్తూ, ఆ సినిమా విషయంలో పెద్ద మిస్టేక్ జరిగిందని, బౌండ్ స్క్రిప్ట్ లేకుండా వెళ్లడం తప్పు అని ట్వీట్ చేశారు. అయితే ఆ ట్వీట్ ఆ సినిమా దర్శకుడు సురేందర్ రెడ్డి (SurenderReddy) ని విమర్శిస్తున్నట్టుగా వుంది. అఖిల్ అక్కినేని (AkhilAkkineni) ఇందులో కథానాయకుడు కాగా, సాక్షి వైద్య (SakshiVaidya) కథానాయికగా పరిచయం అయింది.

అదే విషయం అనిల్ సుంకరని అడిగినప్పుడు, "నేను సురేందర్ రెడ్డి ని బ్లేమ్ చేస్తూ పెట్టిన ట్వీట్ కాదు అది. మేమందరం కలిపి తప్పు చేసాం అని చెప్పాను, అంతే కానీ అది ఎవరినీ విమర్శించడానికి చేసిన ట్వీట్ కాదు. మేము బౌండ్ స్క్రిప్ట్ తో వెళ్ళలేదు, అదే మేము చేసిన తప్పు, ఇందులో ఎవరినీ బ్లేమ్ చెయ్యాల్సిన పనిలేదు, అది అందరి తప్పు," అని అనిల్ దాని మీద వివరణ ఇచ్చారు.

మరి దర్శకుడు సురేందర్ రెడ్డి తో, అలాగే అఖిల్ అక్కినేని తో ఇప్పుడు సత్సంబంధాలు ఉన్నాయా అని అడిగిన ప్రశ్నకు, అతను వెంటనే వున్నాయి అన్నారు. "ఏజెంట్ సినిమా విడుదల అయిన తరువాత చాలా సార్లు మాట్లాడుకున్నాం మేము. అలాగే అఖిల్ కి నేను హిట్ సినిమా ఇవ్వాలి, అందుకని మంచి కథల కోసం చూస్తున్నాను. ఈసారి ఏ సినిమా అయినా బౌండ్ స్క్రిప్ట్ లేకుండా షూటింగ్ కి వెళ్లే ప్రసక్తే లేదు," అని చెప్పేసారు అనిల్.

samajavaragamana1.jpg

'సామజవరగమన' #Samajavaragaman సినిమా గురించి మాట్లాడుతూ సందీప్ కిషన్ (SundeepKishan) కి థేంక్స్ చెప్పాలి అన్నారు. ఎందుకంటే సుందీప్ ఈ కథని నా దగ్గరికి పంపించి మీరు చెయ్యండి అని అన్నాడు. ఇప్పుడు ఎందుకు చిన్న సినిమా అని ఆనుకుంటున్న నాకు సందీప్ ఫోర్స్ చేసి, ఈ సినిమా మీరు చెయ్యాలి, చేస్తే బాగుంటుంది అని చెప్పాడు. ఆలా నా దగ్గరకి ఇది వచ్చింది, ఈ కథ విన్న వెంటనే నాకు నచ్చింది. అయితే మొదటి రోజు మొదటి ఆట వరకు చిన్న టెన్షన్ వుండింది, కానీ ఎప్పుడయితే పాజిటివ్ టాక్ తో అందరూ బయటకి వచ్చారో, అప్పుడు నాకు పెద్ద రిలీఫ్ వచ్చింది, అని చెప్పారు అనిల్. ఈ సినిమా హిట్ అవుతుంది అని తెలుసు, అయితే ఇలాంటి సినిమాలు మొదటి రోజే పెద్ద కలెక్షన్స్ వచ్చి పడవు, స్లోగా మౌత్ టాక్ తో ఆడతాయి. ఇప్పుడు ఈ సినిమా కలెక్షన్స్ చాలా బాగున్నాయి, నేను చాలా హ్యాపీ, అని చెప్పారు అనిల్ సుంకర.

ఇది కూడా చదవండి:

Samajavaragamana Film Review: నవ్వుల నజరానా !

Updated Date - 2023-07-03T13:40:20+05:30 IST