కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Pakkinti kurradu: అత్యాచారం చేశాడంటూ యువతి ఫిర్యాదు!

ABN, First Publish Date - 2023-12-15T13:52:20+05:30

యూట్యూబ్‌లో 'పక్కింటి కుర్రాడు’(Pakkinti kurradu) సిరీస్‌తో పాపులర్‌ అయిన చందుసాయి (Chandu sai) వివాదంలో చిక్కుకున్నాడు.

యూట్యూబ్‌లో 'పక్కింటి కుర్రాడు’(Pakkinti kurradu) సిరీస్‌తో పాపులర్‌ అయిన చందుసాయి (Chandu Sai) వివాదంలో చిక్కుకున్నాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ సదరు యువతి నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది. 2021 ఏప్రియల్‌ 25న పుట్టిన రోజు వేడుకకు ఆహ్వానించి లైంగిక దాడికి పాల్పడ్డాడని ఫిర్యాదులో పేర్కొంది. అత్యాచారం, మోసం కింద నిందితుడుపై 420, 376 (2) ఎస్సీ అట్రాసిటీ కింద కేసులు నమోదు చేశారు.

చంద్రశేఖర్‌తోపాటు ఆయన తల్లి దండ్రులు, మరో ఇద్దరిపై కూడా కేసు నమోదు చేశారు. దీంతో పోలీసులు చందూని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. యూట్యూబ్‌లో పక్కింటి కుర్రాడు, చందుగాడు వంటి టైటిళ్లతో వరుస సిరీస్‌లు చేసి పాపులర్‌ అయ్యాడు. చందూ కామెడీ, లవ్‌ సిరీస్‌లతో పాటు  సందేశాత్మక షార్ట్‌ ఫిల్మ్‌ ఎక్కువ చేశాడు. పలు చిత్రాల్లోనూ నటించాడు.

Updated Date - 2023-12-15T13:52:25+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!