SSMB28: వెనకపడ్డ మహేష్ సినిమా, సంక్రాంతికైనా విడుదల అవుతుందా...

ABN , First Publish Date - 2023-04-12T16:35:14+05:30 IST

మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా షూటింగ్ మళ్ళీ ఎప్పుడు అనేది ఎవరికీ క్లారిటీ లేదు అని తెలిసింది. ఒక పక్క మహేష్ బాబు వెకేషన్ మీద వెకేషన్ వెళుతున్నాడు, ఎప్పుడొస్తాడో తెలీదు, త్రివిక్రమ్ ఏమో పవన్ కళ్యాణ్ సినిమాల మీద దృష్టి పెట్టాడు అని టాక్ నడుస్తోంది...

SSMB28: వెనకపడ్డ మహేష్ సినిమా, సంక్రాంతికైనా విడుదల అవుతుందా...

ఈ ప్రశ్న ఇప్పుడు మహేష్ (Mahesh Babu) అభిమానులకు, పరిశ్రమలో కూడా చర్చ మొదలయింది. మహేష్ బాబు, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) తో చెయ్యాల్సిన సినిమా ముందుగా అనుకున్నట్టు అన్నీ జరిగితే ఈ సంవత్సరం ఆగస్టులో విడుదల కావాల్సి వుంది. కానీ మధ్యలో కొన్ని అవాంతరాలు రావటంతో షూటింగ్ వాయిదా పడింది. పడటం అంటే ఎదో నాలుగయిదు వారాలు కాదు, నెలలు వాయిదా పడింది. ఈ సినిమాలో పూజ హెగ్డే (Pooja Hegde), శ్రీలీల (Sreeleela) కథానాయకురాలుగా చేస్తున్నారు.

maheshbabutrivikramfilm.jpg

ఈ సంవత్సరం జనవరి లో మళ్ళీ షూటింగ్ మొదలయింది. ఆలా మొదలయ్యిందో లేదో, మహేష్ బాబు మధ్యలో వెకేషన్ అంటూ వెళ్ళిపోయాడు అని, ఇప్పుడు కూడా మళ్ళీ వెకేషన్ లోనే వున్నాడని, ఇలా అయితే ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు పూర్తవుతుందో అని అభిమానులు చాలా ఆందోళనలో వున్నారు.

మహేష్ బాబు ఈమధ్య కాలంలో విజయం సాధించాడు కానీ, వేరే సినిమాలతో పోలిస్తే అది అంత పెద్ద విజయం కాదని అభిమానులు అనుకుంటున్నారు. అందువలన ఈ త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా అభిమానుల కోరిక తీరుస్తుంది అని అనుకుంటే, ఈ సినిమాకి షూటింగ్ కన్నా బ్రేక్ లో ఎక్కువని ఇలా అయితే అనుకున్న తేదీకి రాకపోవచ్చు అని కూడా ఆందోళనలో వున్నారు.

MB-Trivikram.jpg

ఈమధ్య తమిళ దర్శకుడు మురుగుదాస్ (AR Murugudoss) హైదరాబాద్ లో ఒక సందర్భం లో సినిమాల విడుదల తేదీ గురించి మాట్లాడుతూ షూటింగ్ అవకుండా సినిమా విడుదల తేదీ ప్రకటిస్తే ఆ సినిమా సగం ఫెయిల్ అయినట్టే అని చెప్పాడు. మరి ఇప్పుడు మహేష్ త్రివిక్రమ్ సినిమా వచ్చే సంక్రాంతి అంటే జనవరి 13, 2024 లో విడుదల అవుతుందని అధికారికంగా ప్రకటించేశారు. ఇలా ప్రకటించడం వలన చాలా టైం వుంది కదా అని లీజర్ షూటింగ్ చేసే అవకాశాలు ఉన్నాయని అభిమానులు వాపోతున్నారు. దానివలన క్వాలిటీ దెబ్బతినొచ్చేమో అని కూడా అంటున్నారు. ఏమైనా అభిమానులే నా సర్వస్వం అనే మహేష్ బాబు, ఈసారి అయినా అభిమానులకి ఒక పెద్ద విజయం అందిస్తాడా అని ఆశగా ఎదురుచూస్తున్నారు.

MB-Trivikram2.jpg

ఈ సినిమాలో ప్రకాష్ రాజ్(Prakash Raj), జయరాం (Jayaram), రమ్యకృష్ణ (Ramya Krishna), రోహిణి (Rohini) కాకుండా చాలామంది క్యారెక్టర్ నటులు వున్నారు. వాళ్లందరినీ కూడా మళ్ళీ ఒక దగ్గరికి చేర్చి కాంబినేషన్ సన్నివేశాలు తీయాలి. ఇలా ఇంత పెద్ద స్కేల్ లో వస్తున్న ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మళ్ళీ మొదలెడతారో అనేది కూడా క్లారిటీ లేదు అని కూడా తెలిసింది.

Updated Date - 2023-04-12T16:35:15+05:30 IST