Nikhil: ‘స్వయంభూ’ మొదలైంది...

ABN , First Publish Date - 2023-08-18T14:47:42+05:30 IST

‘కార్తికేయ2’తో సూపర్‌ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు నిఖిల్‌. తర్వాత మిస్టరీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ‘స్పై’తో ప్రేక్షకులను అలరించారు. తాజాగా మరో విభిన్నమైన కథతో అలరించడానికి సిద్థమయ్యారు. భరత్‌ కృష్ణమాచారి దర్శకత్వంలో ‘స్వయంభూ’ (Swayambhu) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

Nikhil: ‘స్వయంభూ’ మొదలైంది...

‘కార్తికేయ2’తో సూపర్‌ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు నిఖిల్‌. తర్వాత మిస్టరీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ‘స్పై’తో ప్రేక్షకులను అలరించారు. తాజాగా మరో విభిన్నమైన కథతో అలరించడానికి సిద్థమయ్యారు. భరత్‌ కృష్ణమాచారి (Bharat krishnamachari) దర్శకత్వంలో ‘స్వయంభూ’ (Swayambhu) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. శుక్రవారం ఈ చిత్రం షూటింగ్‌ ఫిల్మ్‌నగర్‌ దైవ సన్నిధానంలో పూజా కార్యక్రమాలు మొదలుపెట్టారు. ముహూర్తపు సన్నివేశానికి అల్లు అరవింద్‌ క్లాప్‌ ఇచ్చారు. దిల్‌ రాజు కెమెరా స్విచ్ఛాన్‌ చేశారు.

1.jpg

ట్విట్టర్‌ వేదికగా నిఖిల్‌ (nikhil) ఈ విషయాన్ని తెలుపుతూ కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. గుర్రంపై ఉన్న నిఖిల్‌ లుక్‌ ఆకట్టుకుంటోంది. సోషియో ఫాంటసీ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పోరాట యోధుడిలా కనిపించనున్నారు. ఆయన సరసన సంయుక్త మేనన్‌ కథానాయికగా నటించనున్నారు. నిఖిల్‌ కెరీర్‌లో భారీ బడ్జెట్‌ చిత్రంగా ఈ చిత్రం రూపొందనుంది. ఠాగూర్‌ మధు సమర్పణలో భువన్‌-శ్రీకర్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమాతోపాటు సుధీర్‌ వర్మతో నిఖిల్‌ ఓ సినిమా చేస్తున్నారు. రామ్‌ చరణ్‌ సమర్పణలో ‘ది ఇండియా హౌస్‌’ పేరుతో ఇది తెరకెక్కనుంది. అలాగే ‘కార్తికేయ 3’ కూడా పైప్‌లైన్‌లో ఉంది.

Updated Date - 2023-08-18T14:50:54+05:30 IST