Nikhil : అంత దారుణం చేస్తారనుకోలేదు.. అందుకే ఫ్లాప్‌..!

ABN , First Publish Date - 2023-10-26T18:26:46+05:30 IST

హీరో నిఖిల్‌ (Nikhil) తాను నటించిన చిత్రం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. షూటింగ్‌ పూర్తి కాకుండానే విడుదల చేయడం వల్లే ఆ సినిమా డిజాస్టర్‌ అయిందని అన్నారు. తాజాగా హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన తన సినిమాల విషయంలో గతంలో జరిగిన పొరపాట్లు మళ్లీ జరగకుండా జాగ్రత్త పడతానని తెలిపారు.

Nikhil : అంత దారుణం చేస్తారనుకోలేదు.. అందుకే ఫ్లాప్‌..!

హీరో నిఖిల్‌ (Nikhil) తాను నటించిన చిత్రం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. షూటింగ్‌ పూర్తి కాకుండానే విడుదల చేయడం వల్లే ఆ సినిమా డిజాస్టర్‌ అయిందని అన్నారు. తాజాగా హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన తన సినిమాల విషయంలో గతంలో జరిగిన పొరపాట్లు మళ్లీ జరగకుండా జాగ్రత్త పడతానని తెలిపారు. ఈ ఏడాది జూన్ లో విడుదలైన ‘స్పై’(Spy Movie) చిత్రం గురించి ఆయన మాట్లాడారు. నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ అదృశ్యం వెనుక రహస్యాన్ని స్పృశిస్తూ.. ఓ గూఢచారి కథతో ‘స్పై’ రూపొందింది. అయితే ఈ చిత్రానికి ఎన్నో ఆటంకాలు ఎదురయ్యాయి. ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకొచ్చిన ఆ చిత్రం బాక్సాఫీస్‌ దగ్గర బోల్తా కొట్టింది. దీనిపై నిఖిల్‌ మాట్లాడుతూ

‘‘స్పై’ సినిమా విషయంలో చాలా పొరపాట్లు జరిగాయి. పది రోజుల చిత్రీకరణ మిగిలి ఉండగానే పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు చేసేసి విడుదల చేసేశారు. అందుకే ఆ చిత్రం ప్రేక్షకులకు చేరువ కాలేదని నా అభిప్రాయం. ఆ సినిమా ప్రేక్షకులను నిరాశపరచినందుకు క్షమాపణ కూడా చెప్పా. రానున్న సినిమాల్లో అలాంటి తప్పులు జరగకుండా చూసుకుంటా. ‘కార్తికేయ-3’, ‘స్వయంభూ’, ‘ది ఇండియా హౌస్‌’ చిత్రాల క్వాలిటీ విషయంలో ఎక్కడా తగ్గట్లేదు. కథతోపాటు సినిమా క్వాలిటీని కూడా దృష్టిలో పెట్టుకుని ముందకెళ్తున్నాం’’అని నిఖిల్‌ చెప్పారు. ప్రస్తుతం నిఖిల్‌ ‘స్వయంభూ’ చిత్రంతో బిజీగా ఉన్నారు. భరత్‌ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా కోసం నిఖిల్‌ 3 నెలలపాటు వియత్నాంలో శిక్షణ తీసుకుంటున్నారు. ఆయుద పోరాటం,, మార్షల్‌ ఆర్ట్స్‌, గుర్రపు స్వారీలో శిక్షణ పొందుతున్నారు.

Updated Date - 2023-10-26T18:26:46+05:30 IST