Mahesh Family : ఆ బాధను మరచిపోవడానికి.. నిన్ను స్వాగతిస్తున్నాం!

ABN , First Publish Date - 2023-09-09T17:25:38+05:30 IST

సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు (Mahesh Babu) ఇంట్లోకి కొత్త గెస్ట్‌ వచ్చేశారు. ఆ అతిథి రాకతో మహేశ్‌ కుటుంబం మొత్తం ఆనందంలో మునిగి తేలుతుంది. సితారతో ఆడుకునేందుకు ఆ అతిథి రెడీ అంటున్నారు. ఇంతకీ ఎవరా గెస్ట్‌ అనుకుంటున్నారా? స్నూపీ..

Mahesh Family : ఆ బాధను మరచిపోవడానికి.. నిన్ను స్వాగతిస్తున్నాం!

సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు (Mahesh Babu) ఇంట్లోకి కొత్త గెస్ట్‌ వచ్చేశారు. ఆ అతిథి రాకతో మహేశ్‌ కుటుంబం మొత్తం ఆనందంలో మునిగి తేలుతుంది. సితారతో ఆడుకునేందుకు ఆ అతిథి రెడీ అంటున్నారు. ఇంతకీ ఎవరా గెస్ట్‌ అనుకుంటున్నారా? స్నూపీ.. మహేశ్‌ భార్య నమ్రత (Namratha) కొత్తగా ఓ కుక్కపిల్ల్లను తీసుకొచ్చింది. దానికి స్నూపీ అని పేరు పెట్టుకుంది. ఏడేళ్లగా మహేశ్‌ ఇంట్లో ఒకరిగా ఉంటున్న పెంపుడు కుక్కపిల్ల ప్లూటో ఇటీవల చనిపోయిన సంగతి తెలిసిందే. ఫ్లూటో జ్ఞాపకాలను మరచిపోవడానికి మరో కొత్త కుక్కపిల్లను తెచ్చుకున్నారు. (new Dog for Mahesh Family)

ఈ విషయాన్ని నమ్రత సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించింది. నిన్ను ప్లూటోనే మా దగ్గరకు పంపించింది. ఓ వైపు ఒక కుక్కపిల్లను కోల్పోయామన్న బాధ. మరోవైపు మరో కుక్కపిల్లను ప్రేమతో పెంచుకోబోతున్నాం అనే సంతోషంతో నిన్ను మా కుటుంబంలోకి స్వాగతిస్తున్నాం స్నూపీ.. నిన్ను మరింత ప్రేమిస్తాం’’ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటో షేర్‌ చేసి అంటూ కొత్తగా తీసుకొచ్చిన కుక్కపిల్ల ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో షేర్‌ చేసింది.

ప్రస్తుతం మహేశ్‌ బాబు ‘గుంటూరు కారం’ చిత్రంలో బిజీగా ఉన్నారు. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న మూడో చిత్రమిది. వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్‌ కానున్న ఈ సినిమాకు తమన్‌ సంగీతం అందిస్తున్నారు.

Updated Date - 2023-09-09T17:25:38+05:30 IST