Tollywood Box Office: ఆరు సినిమాల్లో అదే టాప్ లో వుంది

ABN , First Publish Date - 2023-10-09T18:43:41+05:30 IST

సుమారు ఆరు సినిమాలు విడుదలయ్యాయి గత వారం. సుధీర్ బాబు, కిరణ్ అబ్బవరం లాంటి నటులు మంచి హిట్స్ కోసం ఎదురు చూసారు. చాలాకాలం తరువాత సినిమా చేస్తున్న కలర్స్ స్వాతి, అలాగే నటుడు సిద్ధార్థ్ తమిళ సినిమా తెలుగులో విడుదలైంది, ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ కూడా వచ్చింది. కాలేజీ నేపథ్యంలో ఒక చిన్న సినిమా వచ్చింది, ఇంతకు ఏ సినిమా హిట్, ఏ సినిమా ఫట్ అంటే..

Tollywood Box Office: ఆరు సినిమాల్లో అదే టాప్ లో వుంది
Nearly six films released last week and some of them are MAD, Mama Mascheendra, Chinna and Rules Ranjann

సుమారు ఆరు సినిమాలు గత వారం విడుదలయ్యాయి, అందులో రెండు డబ్బింగ్ సినిమాలు కూడా వున్నాయి. సుధీర్ బాబు (SudheerBabu) కథానాయకుడిగా హర్ష వర్ధన్ (HarshVardhan) దర్శకత్వంలో 'మామా మశ్చీంద్ర' #MamaMascheendra విడుదలైంది. ఇందులో సుధీర్ బాబు (SudheerBabu) మూడు పాత్రల్లో కనపడతాడు, అయితే ఈ సినిమా ట్రైలర్ ఆసక్తికరంగా వున్నా, సినిమా విడుదలైన తరువాత మొదటి రోజు మొదటి షో నుండే ఈ సినిమాలో విషయం లేదు, దమ్ము లేదు అని తేలిపోయింది. విడుదలైన రోజే ఈ సినిమా చూడటానికి ప్రేక్షకులు రాక కొన్ని థియేటర్స్ బోసిపోయాయి అని తెలిసింది. ఇందులో ఈషా రెబ్బ (EeshaRebba), మృణాళిని రవి (MrinaliniRavi) కథానాయికలు. హిట్ కోసం పరితపిస్తున్న సుధీర్ బాబు ఈ సినిమాతో ఇంకో ఫ్లాపు చూసాడు.

mamamascheendra.jpg

కిరణ్ అబ్బవరం (KiranAbbavaram) ఇప్పుడిప్పుడే పైకి ఎదుగుతున్న నటుడు, అతని సినిమా 'రూల్స్ రంజన్' #RulesRanjann గత వారం విడుదలైంది. ప్రముఖ నిర్మాత ఎఎమ్ రత్నం (AMRathnam) కుమారుడు జ్యోతి రత్నం (JyothiRathinam) దీనికి దర్శకుడు, నేహా శెట్టి (NehaShetty) కథానాయిక. ఈ సినిమా విడుదలకి ముందు దర్శకుడు, కథానాయకుడి చాలా నమ్మకంగా వున్నారు కానీ, సినిమా విడుదలైన తరువాత ఇది ఒక రొటీన్ కామెడీ కన్నా అర్ధానంగా వుంది అని ప్రేక్షకులు తిరస్కరించారు, అలాగే క్రిటిక్స్ కి కూడా నచ్చలేదు. ఇది బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడింది.

MADmovie.jpg

ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైనమెంట్ (SitharaEntertainments) సంస్థ నిర్మాత నాగ వంశీ (NagaVamsi) సమర్పణలో, నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ కుమార్తె హారిక, ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (TrivikramSrinivas) భార్య సౌజన్య (SaiSoujanya) నిర్మాతలుగా కాలేజీ నేపథ్యంలో 'మ్యాడ్' #MAD అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీనికి దర్శకుడు కళ్యాణ్ శంకర్ (KalyanShankar) అతనికి కూడా ఇది మొదటి సినిమా. విడుదలైన ఆరు సినిమాలలో ఈ 'మ్యాడ్' సినిమా టాప్ గా నిలిచింది. కొత్తవాళ్లతో తీసిన ఈ చిన్న బడ్జెట్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ తో ఆశ్చర్యపరుస్తోంది. మూడు రోజులకు గాని ఈ సినిమా రూ. 8.4 కోట్ల గ్రాస్ కలెక్టు చేసిందని ఈ చిత్ర నిర్వాహకులు అధికారికంగా వెల్లడించారు. ఈ సినిమా గత వారం విడుదలైన సినిమాలన్నిటిలో టాప్ గా నిలవడమే కాకుండా, ఇంకో చిన్న సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద విజయం సాధించిన సినిమాగా కూడా వుంది. ఎన్టీఆర్ (NTR) బావమరిది నార్నె నితిన్ (NarneNithin) ఇందులో ఒక కథానాయకుడు కాగా, సంతోష్ శోభన్ (SantoshShoban) తమ్ముడు సంగీత్ శోభన్ (SangeethShoban) ఇంకొక కథానాయకుడు.

chinna1.jpg

కలర్స్ స్వాతి (ColoursSwathi), నవీన్ చంద్ర (NaveenChandra) జంటగా నటించిన 'మంత్ అఫ్ మధు' #MonthOfMadhu కూడా గతవారం విడుదలైంది. అయితే ఈ సినిమాకి అంతగా ప్రచారం లేకపోవటం, ఈ సినిమా కథనం కూడా చాలా స్లో గా ఉండటంతో ప్రేక్షకులు ఈ సినిమాని తిరస్కరించారు. క్రిటిక్స్ కొంతమందికి ఈ సినిమా నచ్చింది కానీ, 'మంత్ అఫ్ మధు' థియేటర్స్ లో కన్నా ఓటిటి లో చూస్తే బాగుంటుంది అని కొందరు అన్నారు. ఇలా ఈ సినిమాకి మిశ్రమ స్పందన వచ్చినా, ప్రేక్షకులు మాత్రం ఈ సినిమా చూడటానికి థియేటర్స్ కి రాలేదు. శ్రీకాంత్ ఎన్ దీనికి దర్శకుడు.

ఇక ఇంకో రెండు సినిమాలు విడుదలయ్యాయి ఆ రెండూ డబ్బింగ్ సినిమాలు. సిద్ధార్థ్ (Siddharth) నటించిన 'చిన్నా' #Chinna ఒక మంచి సినిమా, ఇందులో ఒక మంచి సారాంశం కూడా వుంది. చిన్న పిల్లల మీద లైంగిక దాడులు నేపథ్యంలో వచ్చిన థ్రిల్లర్ సినిమా ఇది. చాలా బాగా తీశారు, అలాగే సిద్ధార్థ్ బాగా నటించాడు కూడా. ఇది క్రిటిక్స్ కూడా బాగా నచ్చింది. కానీ ఈ సినిమాకి తగినంత ప్రచారం మాత్రం చెయ్యలేదు తెలుగులో, అందుకని ఈ సినిమా కేవలం నోటి మాటగా ఏమైనా ఆడితే ఆడాలి. ఈ వారం అది చూడాలి. అలాగే ఇంకో సినిమా '800' కూడా విడుదలైంది. ఇది ప్రముఖ శ్రీలంక క్రికెట్ ఆటగాడు ముత్తయ్య మురళీధరన్ (MuttiahMuralidharan) బయోపిక్. ఇది విడుదలయినట్టు కూడా చాలామందికి తెలియదు. ఈ సినిమాలో భావోద్వేగాలు తక్కువ, క్రికెట్ గురించి ఎక్కువ అయిందని అంటున్నారు. అందుకని ఈ సినిమా కూడా ప్రేక్షకులు రిజెక్ట్ చేసారు.

ఇవీ చదవండి

MAD film review: కాలేజీ కుర్రాళ్ళ నేపథ్యంలో వచ్చిన వినోదభరితమైన సినిమా

Mama Mascheendra Movie Review: ఇదొక అర్థం పర్థం లేని సినిమా, అంతా గందరగోళం

Rules Ranjann movie review: కిరణ్ అబ్బవరం సినిమా ఎలావుందో తెలుసా...

Chinna movie review: ఆలోచింపచేసే సినిమా, సిద్ధార్థ్ నటన హైలైట్

Updated Date - 2023-10-09T18:43:41+05:30 IST