Mama Mascheendra Movie Review: ఇదొక అర్థం పర్థం లేని సినిమా, అంతా గందరగోళం

ABN , First Publish Date - 2023-10-06T16:07:50+05:30 IST

నటుడిగా, రచయితగా పరిచయం వున్న హర్ష వర్ధన్ దర్శకుడిగా 'మామ మశ్చీంద్ర' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇందులో సుధీర్ బాబు మూడు పాత్రల్లో కనపడతాడు. ఈషా రెబ్బ, మృణాళిని రవి కథానాయికలుగా చేశారు. ఈ సినిమా ఎలా వుందో చదవండి.

Mama Mascheendra Movie Review: ఇదొక అర్థం పర్థం లేని సినిమా, అంతా గందరగోళం
Mama Mascheendra film review

సినిమా: మామా మశ్చీంద్ర

నటీనటులు: సుధీర్ బాబు, ఈషా రెబ్బ, మృణాళిని రవి, హర్షవర్ధన్, రాజీవ్ కనకాల, అలీ రెజా, మిర్చి కిరణ్, అజయ్, హరితేజ తదితరులు

సంగీతం: చైతన్ భరద్వాజ్

నేపధ్య సంగీతం: ప్రవీణ్ లక్కరాజు

ఛాయాగ్రహణం: పిజి విందా (PGVinda)

రచన, దర్శకత్వం: హర్షవర్ధన్

నిర్మాత: సునీల్ నారంగ్ (SunilNarang), పుష్కర్ రామ్మోహన రావు

రేటింగ్: 1 (ఒకటి)

-- సురేష్ కవిరాయని

హర్ష వర్ధన్ (HarshaVardhan) నటుడిగా అందరికీ బాగా పరిచయం వున్న వ్యక్తి, అలాగే చాల సినిమాలకి రైటర్ గా కూడా పని చేసాడు. 'మనం', #Manam 'గుండెజారి గల్లంతయిందే' లాంటి సూపర్ హిట్ సినిమాలకి పనిచేశాడు. ఇప్పుడు దర్శకుడిగా 'మామా మశ్చీంద్ర' #MamaMascheendraReview అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇందులో సుధీర్ బాబు (SudheerBabu) మూడు విభిన్న పాత్రల్లో కనపడతాడు. సుధీర్ బాబు వైవిధ్యమైన పాత్రలతో, కథలతో వస్తున్నాడు కానీ అతని సినిమాలు వ్యాపారపరంగా ఆడటం లేదు. ఇందులో ఈషా రెబ్బ (EeshaRebba), మృణాళిని రవి (MirnaliniRavi) కథానాయికలుగా చేశారు. ఈ 'మామా మశ్చీంద్ర' #MamaMascheendraReview సినిమా ఎలా ఉంటుందో చూద్దాం.

mamamascheendra.jpg

Mama Mascheendra story కథ:

తన తండ్రి వలన చిన్నప్పుడే తల్లిని కోల్పోతాడు పరశురామ్ (సుధీర్ బాబు). ఆ తరువాత కొన్ని సంఘటనలు అతడిని కూడా క్రూరుడుగా మారుస్తాయి. తల్లి చనిపోయాక మేనమామ (అజయ్) పరశురామ్ ఆస్తినంతా తీసేసుకొని అనుభవిస్తూ ఉంటాడు. తిరిగి తన ఆస్తిని పొందడానికి ఎటువంటి దారుణాలు చేయడానికైనా సంసిద్ధుడు అవుతాడు పరశురామ్. మేనమామ కొడుకు (ఇంకో అజయ్) తండ్రితో గొడవపడి ఇంట్లోంచి వెళ్ళిపోతాడు. అదే సమయంలో మేనమామకి కూతురుతో సమానమైన అమ్మాయిని పెళ్లి చేసుకొని తిరిగి ఆస్తిని సంపాదించుకుంటాడు పరశురామ్. #MamaMascheendraReview అతని భార్య ఒక కూతురికి జన్మనిచ్చి చనిపోతుంది. ఆ బాధతో మేనమామ కూడా మరణిస్తాడు. ఆస్తి పరశురామ్ సొంతం అవుతుంది, ఆ ఆస్తిని అమ్మేసుకొని విదేశాలకి వెళ్లి స్థిరపడాలని అనుకుంటాడు. ఆ సమయంలో పరశురామ్ మీద ఒక హత్యాప్రయత్నం జరుగుతుంది. పరశురామ్ దగ్గర దాసు (హర్షవర్ధన్) అనే అసిస్టెంట్ ఉంటాడు, అతను అన్నీ పరశురామ్ అలవాట్లని అభినయిస్తూ ఉంటాడు. #MamaMascheendraReview ఈలోగా పరశురామ్ కుమార్తె విశాలాక్షి (ఈషా రెబ్బా) విశాఖలో రౌడీ దుర్గ (సుధీర్ బాబు) అనే అతనితో, అలాగే హైదరాబాద్ వచ్చిన దాసు కుమార్తె మీనాక్షి (మృణాళిని రవి) ఫేమస్ డీజే (సుధీర్ బాబు) తో ప్రేమలో పడతారు. ఇంతకీ పరశురామ్ మీద హత్యాప్రయత్నం ఎవరు చేశారు? పరశురామ్ కూతురు, దాసు కూతురు ఎందుకు తారుమారు అవుతారు? తన పోలికలతో వున్న ఆ ఇద్దరు కవలలు ఎవరు? చివరకు ఏమైంది? ఇవన్నీ తెలియాలంటే 'మామా మశ్చీంద్ర' సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:

హర్ష వర్ధన్ నటుడిగా, రచయితగా మెప్పించారు, కానీ దర్శకత్వంకి వచ్చేసరికి మాత్రం ఏమయిందేమో ఏమో, కథని తెర మీద సరిగ్గా చూపించలేకపోయాడు. మొదట్లో కొంచెం ఆసక్తికరంగా లేకపోయినా, ఒక పావుగంట, అరగంట తరువాత అయినా ప్రేక్షకుడిని కథలోకి తీసుకెళ్లి లీనం చేయించగలగాలి. కానీ 'మామా మశ్చీంద్ర' #MamaMascheendraReview లో మొదటి సన్నివేశం నుండి సినిమా ఆసక్తికరంగా లేకపోవటం అటుంచి, ఎప్పుడు బయటకి వెళ్లిపోదామా అన్నట్టుగా ఉంటుంది. కథలో గందరగోళాలు, గజిబిజి, వీటన్నిటికీ తోడు దర్శకుడు ఏమి చెప్పాలని అనుకున్నాడో అది మానేసి కథ ఎటువైపో వెళుతూ ఉంటుంది.

mamamascheendra1.jpg


పోనీ ఒక సన్నివేశంలో అయినా ఏదైనా భావోద్వేగమో, లేదా ఇంకో వినోదభరితమైన సన్నివేశమో పెట్టి చూపిస్తాడా అనుకుంటే అదీ లేదు. నాయకా, నాయికల మధ్య సన్నివేశాలు ఏమైనా బాగుంటాయి అనుకుంటే అవి అంతకంటే బోర్ గా తీశాడు. అసలు సినిమా మొదటి నుండీ పాత్రలేంటి, వాటి స్వభావం, ఏమి చెప్పాలనుకున్నాడు, ఏమి తెర మీద చూపిస్తున్నాడు అన్నది దర్శకుడికి క్లారిటీ లేదు, అలాగే నటులకీ కూడా లేదు. ఎందుకంటే వాళ్ళు తెరమీద నటించే తీరు చాలా అసహజంగా వుంది. ఎవరూ కూడా పాత్రలో లీనమయి చెయ్యటం లేదు. ఆ పిల్లల మార్పడి ఏంటో అర్థం కాదు. అసలు ఈ సినిమాని హర్ష వర్ధన్ దర్శకత్వం చేశాడా, లేక అతని పేరు పెట్టి వేరే ఎవరైనా చేశారా అన్న అనుమానం కూడా వస్తుంది. ఎందుకంటే అతను నటుడిగా, రచయితగా చాలా అనుభవం వున్న వ్యక్తి, అటువంటి వ్యక్తి నుండి ఇటువంటి అర్థం పర్ధం లేని సినిమా ఇంత ఘోరంగా ఎలా ఉంటుంది అని అనుకుంటాం. ఈ సినిమాకి అన్నీ ఫెయిల్యూర్స్, సంగీతం, ఛాయాగ్రహణం, మాటలు ఒకటేమిటి ఏదీ బాగోదు. ఆర్జీవీ సన్నివేశం ఈ సినిమాకి అవసరం లేదు, కానీ అది కావాలని ఇందులో చేర్చి ఒక చెత్త సన్నివేశంగా చేశారు.

mamamascheendra2.jpg

ఇక నటీనటుల విషయానికి వస్తే, సుధీర్ బాబుకి కెరీర్ లో వరస్ట్ ప్రతిభ చూపించిన సినిమా ఇది. అసలు ఏ పాత్రకి అతను సూట్ కాలేదు. ముసలి పాత్ర అయిన పరశురామ్ పాత్రకి అతను అస్సలు సరిపోలేదు. పెట్టుడు గెడ్డం, విగ్గు అని తెలిసిపోతోంది. దానికితోడు వేరే వాళ్ళతో డబ్బింగ్, అది అస్సలు సెట్ కాలేదు. ఆ ఊబకాయంగా వేసిన పాత్ర కూడా అస్సలు బాగోలేదు, సెట్ కాలేదు. మూడో పాత్ర కేవలం అతని ఫిజిక్ చూపించడానికి సరిపోయింది. మరి అతను ఏ కథ విని ఈ సినిమా వొప్పుకున్నాడో తెలీదు, కానీ అతని కెరీర్ లో ఇది ఒక వరస్ట్ మూవీగా ఉండిపోతుంది. అతను నటనలో ఏమాత్రం పరిణితి చూపించలేకపోయాడు. తనకి ఈ సినిమా చెయ్యడం, ఈ పాత్రల్లో నటించడం ఇష్టం లేనట్టుగా ఉన్నట్టు తెరమీద కనిపించాడు. ఇక ఈషా రెబ్బ, మృణాళిని రవి వాళ్ళ పాత్రలు మామూలుగా ఉంటాయి. అంతే వాళ్ళదేమీ చెప్పుకోదగ్గ పాత్రలు కావు. హర్ష వర్ధన్ నటుడిగా రాణించాడు. అజయ్, హరితేజ (HariTeja), మిర్చి కిరణ్, రాజీవ్ కనకాల (RajivKanakala) పాత్రల పరిధి మేరకి చేశారు. షకలక శంకర్ (ShakalakaShankar) ఆర్జీవీ (RGV) పాత్రలో కనపడతాడు.

చివరగా, 'మామా మశ్చీంద్ర' సినిమా దర్శకుడిగా హర్ష వర్ధన్ ఫెయిల్ అయితే, సుధీర్ బాబు కూడా నటుడిగా పూర్తిగా న్యాయం చెయ్యలేకపోయాడు. ముసలి పాత్ర వేయాలంటే అదేమీ ఆషామాషీ కాదు, కనీసం హోమ్ వర్క్ చేసినట్టు కూడా కనిపించలేదు, డబ్బింగ్ సరిపోలేదు, ఈ సినిమా గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. సినిమా సగం అయిపోగానే చాలామంది వెళ్ళిపోవటం గమనించటం జరిగింది.

Updated Date - 2023-10-06T21:15:30+05:30 IST