సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

NBK 108: అన్న దిగిండు.. ఆయుధ పూజకు రెడీ

ABN, First Publish Date - 2023-03-31T14:06:12+05:30

ఈ ఏడాది సంక్రాంతికికి ‘వీరసింహారెడ్డి’ అలరించారు నందమూరి బాలకృష్ణ. సంక్రాంతి బరిలో విజయం అందుకున్న ఆయన దసరాకు ఆయుధ పూజ చేయడానికి సిద్ధమవుతున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఈ ఏడాది సంక్రాంతికికి ‘వీరసింహారెడ్డి’ అలరించారు నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) . సంక్రాంతి బరిలో విజయం అందుకున్న ఆయన దసరాకు ఆయుధ పూజ చేయడానికి సిద్ధమవుతున్నారు. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో ఆయన నటిస్తున్న చిత్రం ‘ఎన్‌బీకే 108’(NBK 108) (వర్కింగ్‌ టైటిల్‌). షైన్‌ స్ర్కీన్‌ సంస్థ నిర్మిస్తోన్న ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. దసరా బరిలో సినిమాను విడుదల చేయడానికి నిర్మాతలు సిద్దమవుతున్నారు. ఈ మేరకు విజయ దశమికి ఆయుధపూజ అంటూ బాలకృష్ణ లుక్‌తో ఓ పోస్టర్‌ను విడుదల చేసింది (Nbk 108 for Dusserra) చిత్ర బృందం. ‘అన్న దిగిండు.. ఈ సారి మీ ఊహకు మించి’ అన్న క్యాప్షన్‌తో ఉగాది విడుదల చేసిన బాలకృష్ఱ లుక్‌ ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అందుకు ధీటుగా మరో పోస్టర్‌ విడుదల చేశారు. అందులో బాలకృష్ణ ఉగ్ర రూపంలో చాలా పవర్‌ఫుల్‌గా కనిపిస్తున్నారు. అదే పోస్టర్‌లో ఓ పక్క అమ్మవారు కూడా ఉన్నారు. ఇందులో బాలయ్య తెలంగాణ యాసలో మాట్లాడనున్నారని తెలుస్తోంది. కాజల్‌ (kajal)కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీలా (Srileela) కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇటీవల కాజల్‌ షూటింగ్‌లో అడుగు పెట్టారు. అనిల్‌ రావిపూడి మార్క్‌ఎంటర్‌టైన్‌మెంట్‌తో యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు. తమన్‌ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

Updated Date - 2023-03-31T14:36:02+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!