Dasara: తెలుగులో ఫుల్, మిగతా భాషల్లో డల్

ABN , First Publish Date - 2023-04-03T17:48:36+05:30 IST

'దసరా' సినిమా ఒక్క తెలుగులోనే కాకుండా, చాలా భాషల్లో విడుదల చేశారు. అలాగే ప్రచారం కూడా చాలా ఉదృతంగా ఇతర భాషల్లో చేశారు. కానీ ఒక్క తెలుగులోనే హిట్ అయింది, మిగతా భాషల్లో డల్ అయింది. ఎందుకంటే...

Dasara: తెలుగులో ఫుల్, మిగతా భాషల్లో డల్

నాని (Nani), కీర్తి సురేష్ (Keerthy Suresh) నటించిన 'దసరా' (Dasara) సినిమా గత వారం విడుదల అయింది. ఈ సినిమా ప్రచారం నాని చాలా ఉదృతంగా చేసాడు. ఒక్క తెలుగు లోనే కాకుండా, చెన్నై, బెంగళూరు, కొచ్చి, ముంబై, ఢిల్లీ ఇంకా చాలా నగరాలు తిరిగాడు ఈ సినిమా పాన్ ఇండియా సినిమా ని, అందరికీ నచ్చుతుందని. అయితే నాని అనుకున్నది ఒకటి, అయినది ఒకటి అయింది. తెలుగులో ఈ సినిమా బ్రహ్మాండంగా పోతోంది, కానీ మిగతా భాషల్లో మాత్రం అస్సలు పోవటం లేదు. శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) దీనికి దర్శకుడు.

ఇక్కడ తెలుగు లో కూడా ఈ సినిమాకి మిక్సెడ్ టాక్ వచ్చింది, అయినా మంచి హిట్ అయింది. నాలుగు రోజుల్లో సుమారు రూ.87 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చెయ్యగా, ఇందులో తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువ వసూల్ అయింది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ కూడా బాగానే వచ్చింది. కానీ ఇతర భాషల్లో చూసుకుంటే, హిందీ (Hindi), తమిళ్ (Tamil), మలయాళం (Malayalam) ఇంకా ఇతర నగరాల్లో ఈ సినిమా వసూళ్లు ఏమీ అంతగా ప్రభావం చూపలేదు.

dasarafirstdayfirstshow1.jpg

ఈ సినిమా ఎందుకనో వేరే భాషలకి ఎక్కలేదు. ఒక్క తెలుగు వాళ్ళకి మాత్రమే నచ్చింది. అదీ కాకుండా విడుదల అయిన రోజు శ్రీరామనవి పండగ కావటం, సెలవు దినం కావటం నాని సినిమాకి బాగా ఉపకరించింది. ఆ తరువాత వారాంతపు సెలవులు రావటంతో అదే హవా ఇక్క తెలుగు రాష్ట్రాల్లో కంటిన్యూ అయింది. ఈ సినిమాలో కూడా తెలంగాణ యాస పెట్టడం తో ఈ సినిమా తెలంగాణాలో బాగా పోతోంది. అలాగే దీనికి ప్రచారం విపరీతంగా చెయ్యటం కూడా ఒక ప్లస్ అయిందని ట్రేడ్ అనలిస్ట్స్ అంటున్నారు.

ఇతర భాషల్లో ఎందుకు సినిమా పోవటం లేదు అనే విషయం మీద మాత్రం నాని ఎక్కువగా మాట్లాడటం లేదు. అది పెద్ద విషయం కాదు అన్నట్టుగా ఆ ప్రశ్నని దాటవేశారు. కానీ మరి నాని పాన్ ఇండియా లెవెల్లో ప్రచారం చేసి, పాన్ ఇండియా యాక్టర్ గా చెయ్యాలని చూసాడు కదా, మరి తదుపరి సినిమా కూడా అలానే చేస్తాడా, లేక ఒక్క దక్షిణాదికి పరిమితం అవుతాడా, చూడాలి.

ఇదీ చదవండి

సమంతని అలా చూడగానే ఏడుపు వచ్చేసింది: శోభిత ధూళిపాళ

వామ్మో, ఒక్కరోజులో ఇంతమంది ఫాలోవర్స్, షాకింగ్ !

Updated Date - 2023-04-03T17:50:09+05:30 IST