ThalapathyVijay: వామ్మో, ఒక్కరోజులో ఇంతమంది ఫాలోవర్స్, షాకింగ్ !

ABN , First Publish Date - 2023-04-03T13:27:31+05:30 IST

తమిళ సూపర్ స్టార్ విజయ్ ఎక్కడ అడుగు పెడితే అక్కడ సంచలనాలు సృస్తిస్తున్నాడు. మొన్ననే ఇన్స్టాగ్రామ్ (Instagram) లోకి అడుగు పెట్టాడు, ఒక్కరోజులో అతని ఫాలోవర్స్ సంఖ్య చూస్తే షాకింగ్...

ThalapathyVijay: వామ్మో, ఒక్కరోజులో ఇంతమంది ఫాలోవర్స్, షాకింగ్ !

తలపతి విజయ్ (Thalapathy Vijay) తమిళ నాట ఒక సూపర్ స్టార్. విజయ్ కి అభిమానులు ప్రపంచం నలుమూలల వున్నారు. విజయ్ సినిమా వస్తోంది అంటే చాలు, తమిళనాట, అలాగే అతని అభిమానులకు ప్రపంచం అంతటా ఒక పండగే. అలాంటి విజయ్ ఏమి చేసినా సంచలనమే. ఎందుకంటే విజయ్ ఈమధ్య సాంఘీక మాధ్యమం అయిన ఇన్ స్టా గ్రామ్ (Instagram) లోకి అడుగు పెట్టాడు. అయితే అతను మొదటి పోస్ట్ ఏమి పెద్దగా రాయలేదు, తన ఫోటో పెట్టి 'హలో ఫ్రెండ్స్' అని మాత్రమే పెట్టాడు.

actorvijay.jpg

అంతే ఇంకా సునామీ సృష్టింపబడింది. విజయ్ అంటే మాటలా, మజాకా నా మరి. ఒక్క రోజులో ఎంతమంది ఫాలోయర్స్ వచ్చారో తెలుసా విజయ్ కి. ఆ సంఖ్య తెలిస్తే షాక్ అవుతారు మీరు. నాలుగు మిలియన్ ఫాలోయర్స్ (4 million followers) అవును, అక్షరాలా అంతేముంది ఫాలోయర్స్ విజయ్ కి వచ్చారు. ఇది కూడా ఒక రికార్డ్ ఏమో మరి.

కొంతమంది సెలబ్రిటీస్ ఏమి చేసినా అదొక రికార్డు మరి. అందులోకి విజయ్ లాంటి స్టార్ ఇలా సాంఘీక మాధ్యమం లోకి వచ్చాడు అంటే మాటలా మారి. దీనిని అతనికి అభిమానుల సంఖ్య ఎలా వున్నదీ అర్థం అవుతోంది కదా. అప్పుడెప్పుడో ప్రభాస్ (Prabhas) కూడా ఇన్స్టాగ్రామ్ (Instagram) లో అడుగు పెట్టాడనే ఇలాగే అతనికి కూడా ఫాలోయర్స్ వచ్చారు కానీ, ఇంతలా మాత్రం కాదు.

actorvijay1.jpg

ప్రభాస్ కూడా అప్పట్లో ఏమి పెట్టలేదు, 'బాహుబలి' (Baahubali) సినిమా లో ఒక స్టిల్ పెట్టాడు, తరువాత 'బాహుబలి 2' (Baahubali 2) సినిమా రెండేళ్లు పూర్తి అయినా సందర్భంగా అందులోంచి ఒక స్టిల్ పెట్టాడు. అంతే ఇంకా అభిమానుల ఫాలోయింగ్ పెరిగింది అతనికి. కానీ విజయ్ లా మాత్రం ఒక్క రోజులో అంతమంది లేరు. కానీ విజయ్ ఫాలోయింగ్ చూస్తుంటే సునామీ గుర్తుకు వస్తోంది, షాక్ అవుతున్నారు పరిశ్రమలో అందరూ, విజయ్ పాపులారిటీ చూసి!

ప్రస్తుతం విజయ్, దర్శకుడు లోకేష్ కనకరాజ్ (Lokesh Kanagaraj) తో ఒక సినిమా చేస్తున్నాడు. దీనికి ఇంకా టైటిల్ పెట్టలేదు కానీ దీన్ని తలపతి67 (Thalapathy67) అని పిలుస్తున్నారు. ఇందులో త్రిష (Trisha Krishnan) కథానాయికగా నటిస్తోంది.

Updated Date - 2023-04-03T13:32:29+05:30 IST