Naa Saami Ranga Teaser: ఆడేమైనా కుర్రాడనుకుంటున్నాడా.. అదిరిపోయిన నాగార్జున ‘నా సామిరంగా’ టీజర్
ABN , First Publish Date - 2023-12-17T15:15:45+05:30 IST
నృత్య దర్శకుడు విజయ్ బిన్ని డైరెక్షన్‌లో నాగార్జున తాజాగా నటిస్తున్న చిత్రం ‘నా సామిరంగా’. అశికా రంగనాథ్కథానాయికగా నటిస్తుండగా అల్లరి నరేశ్, రాజ్ తరుణ్ లు ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఈ రోజు (ఆదివారం) సినిమా టీజర్‌ను రిలీజ్ చేశారు.
 
                                    
నృత్య దర్శకుడు విజయ్ బిన్ని(vijaybinni) డైరెక్షన్‌లో నాగార్జున తాజాగా నటిస్తున్న చిత్రం ‘నా సామిరంగా’ (Nagarjuna Akkineni). అశికా రంగనాథ్ (Ashika Ranganath) కథానాయికగా నటిస్తుండగా అల్లరి నరేశ్ (allari naresh), రాజ్ తరుణ్ (Raj Tarun)లు ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. రానున్న సంక్రాంతి పండుగకు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్న ఈ చిత్రం నుంచి ఈ మధ్యే ‘నా సామిరంగా’ (Naa Saami Ranga) అనే పాట విడుదల చేయగా అల్లరి నరేశ్ జన్మదినం సందర్భంగా ఆయన పాత్రకు సంబంధించిన గ్లిమ్స్ విడుదల చేశారు. ఈ క్రమంలో ఈ రోజు (ఆదివారం) సినిమా టీజర్‌ను రిలీజ్ చేశారు.
అయితే ఈరోజు విడుదల చేసిన టీజర్ ఔట్ అండ్ ఔట్ మాస్ ఆడియన్స్‌ను టార్గెట్ చేసినట్టుగా తెలిసిపోతోంది. హీరోయిన్ అశికా రంగనాథ్ (Ashika Ranganath) ఇంట్రోతో ఆడేమైనా కుర్రాడానుకుంటున్నాడా అంటూ నాగార్జున (Nagarjuna Akkineni) గురించి చెబుతూ ఆయన గురించి ఆరా తీయడం టీజ్ చేయడం వంటి సన్నివేశాలు, పుల్ యాక్షన్ సీన్లతో టీజర్‌ను రూపోందించారు. పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో నటీనటుల కట్టుబొట్టు, యాసలు ఆకట్టుకునేలా ఉన్నాయి. ముఖ్యంగా అల్లరి నరేశ్ (allari naresh)కు ఈ చిత్రం మరో గమ్యం స్థాయిలో పేరు తీసుకువచ్చేలా కనిపిస్తోంది.
గత సంవత్సరం అక్టోబర్ లో విడుదలైన 'ది ఘోస్ట్' #TheGhost సినిమా తర్వాత కాస్త గ్యాప్ తీసుకుని నాగార్జున నటిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు రోజురోజుకి పెరుగుతున్నాయి. ఈ సినిమాకు బెజవాడ ప్రసన్న కుమార్ కథ, మాటలు అందిస్తుండగా, శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్నారు. అస్కార్ విన్నర్ కీరవాణి (MM Keeravaani) సంగీతం అందిస్తుండగా పలాస, శ్రీదేవి సోడా సెంటర్ వంటి సినిమాల దర్శకుడు కరుణకుమార్ విలన్‌గా నటిస్తున్నారు.