Naga Chaitanya: ఏ సినిమాకు ఇంత ప్లానింగ్‌తో ముందుకు వెళ్ళలేదు

ABN , First Publish Date - 2023-12-09T17:03:30+05:30 IST

ఏడాదిన్నరగా ఈ కథతో ట్రావెల్ అవుతూ వస్తున్నాం. ప్రీ ప్రొడక్షన్‌లో ప్రతి అడుగుని చాలా ఎంజాయ్ చేశాను. చాలా కొలబరేటివ్‌గా పనులు జరిగాయి. శ్రీకాకుళం వెళ్లి మత్స్యకార కుటుంబాలని కలవడం.. చందూ, నేనూ కథపై చర్చించడం.. శ్రీకాకుళం యాసపై వర్కవుట్ చేయడం.. ఇలా చాలా విషయాలపై ప్రత్యేక దృష్టితో పని చేశామని ‘తండేల్’ మూవీ ఓపెనింగ్‌లో హీరో నాగచైతన్య చెప్పుకొచ్చారు.

Naga Chaitanya: ఏ సినిమాకు ఇంత ప్లానింగ్‌తో ముందుకు వెళ్ళలేదు
Venkatesh, Naga Chaitanya and Nagarjuna

యువ సామ్రాట్ నాగ చైతన్య అక్కినేని (Naga Chaitanya), దర్శకుడు చందూ మొండేటి (Chandoo Mondeti) కాంబినేషన్‌లో గీతా ఆర్ట్స్ (Geetha Arts) బ్యానర్‌పై అల్లు అరవింద్ (Allu Aravind) సమర్పణలో బన్నీ వాసు (Bunny Vas) నిర్మించనున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘తండేల్’ (Thandel). నాగ చైతన్య‌ కెరీర్‌లోనే హయ్యస్ట్ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కబోతోన్న ఈ సినిమా.. శనివారం పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ముహూర్తపు షాట్‌కు నాగార్జున (Nagarjuna) కెమెరా స్విచాన్ చేయగా, వెంకటేష్ (Venkatesh) క్లాప్ కొట్టారు. మెగా నిర్మాత అల్లు అరవింద్ (Allu Aravind) స్క్రిప్ట్‌ను దర్శకుడికి అందజేశారు.

అనంతరం జరిగిన మీడియా సమావేశంలో దర్శకుడు చందూ మొండేటి (Chandoo Mondeti) మాట్లాడుతూ.. ఏడాదిన్నరగా కథపై వర్క్ చేశాం. వాసు‌గారు, అరవింద్‌గారు అద్భుతంగా ప్రోత్సహించారు. నాగచైతన్య‌, సాయి పల్లవి‌, మిగతా టెక్నిషియన్స్ అందరూ బెస్ట్ ఇవ్వడానికి రెడీ అయ్యాం. వాళ్ళంతా నన్ను ఎంతగానో మోటివేట్ చేస్తున్నారు. నేను కూడా వాళ్ళతో కొలబరేట్ అయ్యి నా బెస్ట్ ఇస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నానని అన్నారు. హీరోయిన్ సాయి పల్లవి (Sai Pallavi) మాట్లాడుతూ.. దర్శకుడు రచయిత నిర్మాతలు అందరికీ ఈ సినిమా పట్ల ఒక విజన్ వుంది. ఆ విజన్ మీ అందరికీ సరిగ్గా చేరుతుందని ఆశిస్తున్నాను. అందరి బ్లెస్సింగ్స్ ఈ సినిమాకు కావాలని కోరారు.


Sai-Pallavi.jpg

హీరో నాగ చైతన్య (Naga Chaitanya) మాట్లాడుతూ.. ఏడాదిన్నరగా ఈ కథతో ట్రావెల్ అవుతూ వస్తున్నాం. ప్రీ ప్రొడక్షన్‌లో ప్రతి అడుగుని చాలా ఎంజాయ్ చేశాను. చాలా కొలబరేటివ్‌గా పనులు జరిగాయి. శ్రీకాకుళం వెళ్లి మత్స్యకార కుటుంబాలని కలవడం.. చందూ, నేనూ కథపై చర్చించడం.. శ్రీకాకుళం యాసపై వర్కవుట్ చేయడం.. ఇలా చాలా విషయాలపై ప్రత్యేక దృష్టితో పని చేశాం. ఏ సినిమాకి ఇంత ప్లానింగ్‌తో ముందుకు వెళ్ళలేదు. ఈ ప్రోసస్‌ని చాలా బాగా ఎంజాయ్ చేస్తూ వచ్చాను. ఇది ప్రతి సినిమాలా కాదు చాలా ప్రత్యేకమైనది. బలమైన కథ, కావాల్సిన సమయం తీసుకొని పక్కాగా ప్లాన్ చేసుకొని వెళ్దామని అరవింద్ గారు ముందు నుంచి మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహించారు. కథకు కావాల్సిన బడ్జెట్, సపోర్ట్ ఇస్తున్న అరవింద్‌గారికి ధన్యవాదాలు. నా కెరీర్‌లో గుర్తుండిపోయే సక్సెస్ 100 పర్సంట్ లవ్ అరవింద్‌గారే ఇచ్చారు. ఇప్పుడు ఈ చిత్రాన్ని ఆయన నిర్మించడం చాలా ఆనందంగా వుంది. అలాగే వాసు‌గారికి ధన్యవాదాలు. చందూ దర్శకుడిగా కంటే నాకు మంచి స్నేహితుడు. తనతో ప్రతి విషయాన్ని ఓపెన్‌గా చర్చించగలుగుతాను. మేం ఇద్దరం కలసి చేస్తున్న మూడో సినిమా ఇది. సాయి పల్లవి చాలా పాజిటివ్ ఎనర్జీ వున్న యాక్టర్. తను ఈ సినిమాలో భాగం కావడం ఆనందంగా వుంది. దేవిశ్రీ ప్రసాద్, షామ్‌దత్, శ్రీనాగేంద్ర ఇలా అద్భుతమైన టీం ఈ చిత్రానికి పని చేస్తుంది. డిసెంబర్ 15 తర్వాత షూటింగ్ స్టార్ట్ చేస్తున్నాం. కచ్చితంగా ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చుతుందని తెలిపారు.


ఇవి కూడా చదవండి:

====================

*Director Sai Kiran Daida: స్క్రీన్‌కి అతుక్కొని మరీ ‘పిండం’ సినిమా చూస్తారు..

********************************

*Thandel: నాగ్ స్విచ్.. వెంకీ క్లాప్.. అరవింద్ స్క్రిఫ్ట్

***********************************

*Harish Shankar: నా అపోహని ఇంటర్వెల్‌లో వాడిన గన్‌తో పేల్చేసినందుకు..

*******************************

Updated Date - 2023-12-09T17:03:31+05:30 IST