సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Mr Kalyan: ట్రైలర్ వదిలిన ‘ధమాకా’ దర్శకుడు

ABN, First Publish Date - 2023-02-23T18:19:05+05:30

శ్రీమతి ఉష శ్రీ సమర్పణలో శ్రీ దత్తాత్రేయ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మించబడిన చిత్రం ‘మిస్టర్ కళ్యాణ్’ (Mr Kalyan). మాన్యం కృష్ణ (Maanyam Krishna), అర్చన (Archana) హీరోహీరోయిన్లుగా

Mr Kalyan Movie Poster
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీమతి ఉష శ్రీ సమర్పణలో శ్రీ దత్తాత్రేయ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మించబడిన చిత్రం ‘మిస్టర్ కళ్యాణ్’ (Mr Kalyan). మాన్యం కృష్ణ (Maanyam Krishna), అర్చన (Archana) హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం ఫ్యామిలీ, లవ్ అండ్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కింది. పండు (Pandu) దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రాన్ని NV. సుబ్బారెడ్డి (NV SubbaReddy) భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ని మాస్ మహారాజా రవితేజ (Ravi Teja)తో ‘ధమాకా’ (Dhamaka) హిట్ అందుకున్న దర్శకుడు నక్కిన త్రినాధరావు (Trinadha Rao Nakkina) విడుదల చేశారు.

ట్రైలర్ విడుదల అనంతరం దర్శకుడు నక్కిన త్రినాధ్ మాట్లాడుతూ.. మిస్టర్ కళ్యాణ్ ట్రైలర్ చాలా బాగుంది. మేకింగ్, లొకేషన్స్, డైలాగ్స్ అన్నీ బాగున్నాయి. ఆర్టిస్ట్స్ అందరూ చాలా బాగా చేశారు. దర్శకుడు పండుకు అలాగే నిర్మాత సుబ్బారెడ్డి గారికి ఈ సినిమా మంచి విజయం సాధించి.. వారు మరిన్ని మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. చిత్రయూనిట్ మొత్తానికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని అన్నారు. (Mr Kalyan Trailer)

ట్రైలర్ విషయానికి వస్తే.. ఈ ప్రపంచం మొత్తానికి మనం ప్రేమించుకున్నట్లు తెలిసినప్పుడు.. మరి విడిపోయినప్పుడు కూడా మనకి ఆధారాలు కావాలి అంటూ హీరోయిన్ వాయిస్‌తో మొదలైన ఈ ట్రైలర్.. ప్రేక్షకులకు కావాల్సిన అన్ని అంశాలతో తెరకెక్కినట్లుగా అయితే తెలుస్తోంది. కాగా సప్తగిరి (Saptagiri), ధనరాజ్, తాగుబోతు రమేష్ ముఖ్య పాత్రల్లో నటిస్తోన్న ఈ చిత్రం వైజాగ్, హైదరాబాద్ ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంది. ఒక ప్రత్యేక సాంగ్ కోసం లడక్ లోని అందమైన లొకేషన్స్‌లో షూట్ చేయడం జరిగిందని తెలిపిన మేకర్స్.. త్వరలోనే చిత్రానికి సంబంధించిన ఇతర వివరాలను తెలియజేస్తామని తెలిపారు.

ఇవి కూడా చదవండి

*********************************

Meena: ‘శుభలగ్నం’ రీమేక్ చేస్తే చేయాలనుకున్నా.. కానీ?


Sir: దర్శకుడే కారణం.. చిరు చెప్పిందే మూర్తిగారు చెప్పారు

Premi Viswanath: అరుదైన వ్యాధి.. ‘కార్తీకదీపం’ వంటలక్క కూడా ఆ బ్యాచ్‌లోకి!

Ram Charan: ఆ ఘనత అందుకున్న తొలి తెలుగు హీరోగా రికార్డ్

Madhumitha Sivabalaji: ‘ఊ అంటావా మావ.. ఉఊ అంటావా’.. స్టెప్పులతో అరాచకం

Updated Date - 2023-02-23T18:26:37+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!