RRR: ‘ఆస్కార్‌కి సిద్ధంకండి’.. మూవీ టీంపై ప్రశంసల జల్లు

ABN , First Publish Date - 2023-01-11T10:33:15+05:30 IST

మరో అంతర్జాతీయ అవార్డు ‘ఆర్ఆర్ఆర్’ (RRR) సొంతమైంది. ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే గోల్డెన్ గ్లోబ్ అవార్డు (Golden Globe Award) ఈ మూవీని వరించింది.

RRR: ‘ఆస్కార్‌కి సిద్ధంకండి’.. మూవీ టీంపై ప్రశంసల జల్లు
RRR

మరో అంతర్జాతీయ అవార్డు ‘ఆర్ఆర్ఆర్’ (RRR) సొంతమైంది. ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే గోల్డెన్ గ్లోబ్ అవార్డు (Golden Globe Award) ఈ మూవీని వరించింది. బెస్ట్ ఓరిజినల్ సాంగ్ (Best Original Song) విభాగంలో ‘నాటు నాటు’ (Naatu Naatu) పాటకి అవార్డు వచ్చింది. ఆసియాలోనే ఈ అవార్డు పొందిన మొదటి పాటగా ఈ సాంగ్ గుర్తింపు పొందింది. ఈ విషయాన్ని తెలుపుతూ ‘ఆర్ఆర్ఆర్’ సోషల్ మీడియా వేదికగా సంతోషాన్ని పంచుకుంది. దీంతో దేశవ్యాప్తంగా ఎంతోమంది ప్రముఖులు ఈ చిత్రబృందంపై ప్రశంసలు కురిపించారు. అందులో మెగాస్టార్ చిరంజీవి, ఏఆర్ రెహమాన్, రవితేజ వంటి వారు ఉన్నారు.

చిరంజీవి (Chiranjeevi) చేసిన ట్వీట్‌లో.. ‘ఎంత అపూర్వమైన, చారిత్రాత్మక విజయం!!!! గోల్డెన్ గ్లోబ్స్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ - మోషన్ పిక్చర్ అవార్డు పొందిన కీరవాణి గారికి కంగ్రాట్స్. ఆర్ఆర్ఆర్ టీమ్‌కి, ఎస్ఎస్ రాజమౌళికి హృదయపూర్వక అభినందనలు. ఇండియా గర్విస్తోంది’ అని రాసుకొచ్చారు.


అలాగే ఏఆర్ రెహమాన్ (AR Rahman) చేసిన ట్వీట్‌లో.. ‘అద్భుతం.. అసాధారణ మార్పు.. కీరవాణి గారికి భారతీయులు అందరూ, మీ అభిమానుల నుండి కంగ్రాట్స్! ఎస్ఎస్ రాజమౌళి, ఆర్ఆర్ఆర్ టీమ్‌కి అభినందనలు’ అని రాసుకొచ్చారు.


రవితేజ (Raviteja) చేసిన ట్వీట్‌లో.. ‘మీ నాటు కొట్టుడికి భూగోళం ఊగిపోయింది. ఆస్కార్ కోసం కవాతులా గోల్డెన్ గ్లోబ్ గెలుచుకున్నందుకు కీరవాణికి అభినందనలు. అకాడమీ అవార్డులకు ఆల్ ది బెస్ట్ సార్’ అని రాసుకొచ్చారు.

Updated Date - 2023-01-11T10:33:19+05:30 IST