Nainika -Meena: అమ్మ తెరపైనే నటి.. ఇంట్లో అలా కాదు.. తనకి భావోద్వేగాలు ఉంటాయి!

ABN , First Publish Date - 2023-04-22T09:54:54+05:30 IST

తన తల్లి మీనా గురించి నైనిక (Nainika) ఓ వేదికపై మాట్లాడిన మాటలకు అతిథులుగా హాజరైన తారాలోకం ఆశ్చర్యానికి గురైంది. ఆ చిన్నారి మాటలకు భావోద్వేగానికి (nainika Emotional speech) లోనయ్యారు.

Nainika -Meena: అమ్మ తెరపైనే నటి.. ఇంట్లో  అలా కాదు.. తనకి భావోద్వేగాలు ఉంటాయి!

తన తల్లి మీనా గురించి నైనిక (Nainika) ఓ వేదికపై మాట్లాడిన మాటలకు అతిథులుగా హాజరైన తారాలోకం ఆశ్చర్యానికి గురైంది. ఆ చిన్నారి మాటలకు భావోద్వేగానికి (nainika Emotional speech) లోనయ్యారు. సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ (Rajanikanth Emotional) సైతం కంట తడిపెట్టుకున్నారు. మీనా సినీ రంగంలో అడుగుపెట్టి 40 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఇటీవల చెన్నైలో ఓ కార్యక్రమం జరిగింది. రజనీకాంత్‌, బోనీకపూర్‌, రాధిక, రోజా, సెల్వమణి, సంఘవి, ఖుష్భూ, సుహాసిని, స్నేహ, శ్రీదేవి, ప్రభుదేవా, మహేశ్వరి, కె.ఎస్‌.రవికుమార్‌ ఇలా ఎంతోమంది సెలబ్రిటీలు ఈ వేడుకలో పాల్గొని మీనాని సన్మానించారు. తారలంతా మీనాతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. వేదికపై సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌గా నైనిక మాట్లాడిన ఓ వీడియోను ప్రదర్శించారు. ఇందులో తల్లి గురించి భావోద్వేగంగా చెప్పుకొచ్చింది నైనిక. నాన్న మరణంతో అమ్మ మానసిక ఒత్తిడికి లోనైందని, మాకు అదొక పెయిన్‌ఫుల్‌ టైమ్‌ అంటూ నైనిక చెప్పగా అక్కడే ఉన్న రజనీకాంత్‌, రాధిక, రోజా, శ్రీదేవి, ప్రభుదేవా, బోనీకపూర్‌, మహేశ్వరి వంటి తారలు కన్నీరు పెట్టుకున్నారు. (Meena@40 Celebrations)

‘‘అమ్మా.. నువ్వు ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చావు. అందుకులో నాకు ఎంతో ఆనందంగా, గర్వంగా ఉంది. నటిగా నువ్వు ఎప్పుడూ కష్టపడుతూనే ఉంటావు. వృత్తి రీత్యా నువ్వు స్టార్‌ హీరోయిన్‌వే. ఇంటికి వచ్చాక మాత్రం నువ్వు అది కాదు. అలా ఉండవు. ఇంటికి రాగానే నువ్వు గొప్ప అమ్మవి. తల్లిగా నన్ను ప్రతిక్షణం జాగ్రత్తగా చూసుకుంటావు. నా చిన్నతనంలో మనమంతా షాపింగ్‌ కోసం ఓ మాల్‌కు వెళ్లాం. నేను ఎవరికీ చెప్పకుండా వేరే షాప్‌నకు వెళ్లి చాక్లెట్స్‌ తింటూ కూర్చున్నాను. కొంత సమయం తర్వాత నువ్వు అక్కడికి వచ్చి నాపై కేకలు వేశావు. ఆరోజు నువ్వు పడ్డ కంగారు నాకు ఇప్పుడు అర్థమవుతోంది. నేను అలా చేసినందుకు క్షమించు అమ్మా. నాన్న మరణంతో పరిస్థితులు చీకటిగా మారాయి. నువ్వు మానసిక కుంగిపోయావు.. అయినా నువ్వు నా భవిష్యత్తు కోసం ఎంతో తపన పడుతున్నావు. ఇకపై నిన్ను నేను జాగ్రత్తగా చూసుకుంటా. నీకు సాయంగా ఉంటా’’ అని నైనిక ఆ వీడియోలో పేర్కొన్నారు. మీనాపై వచ్చిన అసత్య ప్రచారాల గురించి కూడా నైనిక మాట్లాడారు. కొన్నాళ్ల క్రితం అమ్మ గురించి కొన్ని న్యూస్‌ ఛానళ్లల్లో అసత్య వార్తలు ప్రసారమయ్యాయి. ‘మీనా మళ్లీ తల్లి కాబోతుంది అన్న వార్తలొచ్చాయి. అవి చూసి మేమంతా నవ్వుకున్నాం. అమ్మ కేవలం నటి మాత్రమే కాదు. ఆమె కూడా మీలాగా ఓ మనిషే. ఆమెకూ ఫీలింగ్స్‌ ఉంటాయి. కాబట్టి ఇలాంటి వార్తలు రాయొద్దు’’ అని చెప్పింది. ఆ వీడియోను స్టేజ్‌పై ప్లే చేయగా అక్కడ ఉన్న తారలు అందరూ భావోద్వేగానికి లోనయ్యారు. తన గారాల కూతురు మాటల్లో పరిణితి చూసి మీనా సైతం ఆశ్చర్యపోయారు.

మీనా మాట్లాడుతూ ‘‘ఈ వీడియో సర్‌ప్రైజ్‌ గురించి నాకు తెలీదు. నైనిక మాటలు చాలా ఆశ్చర్యంగా అనిపించాయు. తనలో బాధ, భయం, భావోద్వేగం, కష్టం ఏం ఉన్నా బయటకు చెప్పదు. తన తండ్రిలాగే. ఈ వీడియోలో ఇంత పరిణితితో మాట్లాడింది అంటే నాకే ఆశ్చర్యంగా ఉంది’’ అని అన్నారు.

Updated Date - 2023-04-22T09:54:54+05:30 IST