సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Manchu Manoj: సెగ గడ్డ వచ్చింది... గోకుతారా కొంచెం... మంచు మనోజ్ షాకింగ్ కామెంట్స్

ABN, First Publish Date - 2023-04-06T15:27:59+05:30

మంచు కుటుంబం మీడియా వాళ్ళతో ఆటలాడుకుంటూ, జోకులు వేసుకుంటున్నారు. ఆమధ్య ఒక వీడియో పోస్ట్ పెట్టిన మనోజ్ మొత్తం కుటుంబం అంతా వైరల్ అయ్యేట్టు చేసాడు. మళ్ళీ అదే మనోజ్ ని ఆ విషయం గురించి అడిగితే షాకింగ్ కామెంట్స్ చేసాడు...

Manchu Manoj and his wife Mounika
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఈమధ్య మీ ఇంట్లో ఒక ఇష్యూ జరిగింది కదా, దాని మీద మీ కామెంట్ ఏంటి అని మీడియా వాళ్ళు అడిగిన ప్రశ్నకు, మంచు మనోజ్ (Manchu Manoj) వెరైటీగా సమాధానం చెప్పాడు. "సెగ గెడ్డ వచ్చింది.... గోకుతారా..." అంటూ వెళ్ళిపోయాడు. మీడియా వాళ్ళు అది కాదండీ, రీసెంట్ గా ఇష్యూ జరిగింది కదా, దాని మీద మాట్లాడమని అడిగితే, "ఇదే రీసెంట్ ఇష్యూ..." అని తన బుజం చూపిస్తూ నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు.

మంచు మనోజ్ ఆమధ్య ఒక వీడియో పోస్ట్ చేసిన సంగతి అందరికి తెలిసిన విషయమే. అందులో అతని అన్నయ్య మంచు విష్ణు (Manchu Vishnu), సారధి అనే మనోజ్ కి చెందిన వ్యక్తిని కొట్టడానికి వచ్చాడు అని మనోజ్ పోస్ట్ చేసాడు. అప్పట్లో అది పెద్ద సంచలనం అయింది, అన్నదమ్ముల మధ్య అంత సయోధ్యగా ఉన్నట్టు అనిపించటం లేదు అని వార్తలు కూడా వైరల్ అయ్యాయి. ఇద్దరి మధ్య విబేధాలు వున్నా, ఎప్పుడూ బయటపడలేదు, #ManchuFamily కానీ ఈసారి మనోజ్ స్వయంగా పోస్ట్ పెట్టాడు కాబట్టి, ఆ వార్త పబ్లిక్ కి తెలియాలని అనుకున్నాడేమో అని అందరూ అనుకున్నారు. అన్నయ్య విష్ణు ఇలానే ఇళ్లలోకి దూరి ఇలా కొడుతూ ఉంటాడు అని చెపుతూ ఇది సిట్యుయేషన్ అని చెప్పాడు మనోజ్ ఆ వీడియోలో.

కానీ ఆ తరువాత మంచు విష్ణు ఇంకో వీడియో పోస్ట్ చేస్తూ మంచు కుటుంబంలో ఏదయినా వార్త అన్నట్టుగా పెట్టి, త్వరలోనే 'హౌస్ అఫ్ మంచూస్' (House of Manchus) వస్తుంది అని ఆ వీడియో లో చెప్పాడు. ఇది త్వరలోనే ఒక ఓటీటీ వేదికగా స్క్రీనింగ్ అవబోతున్నట్టుగా సమాచారం. #MohanBabu మరి అప్పుడు మనోజ్ పోస్ట్ చేసిన వీడియో కూడా అటువంటిదేనా, లేక డేమేజ్ అయింది కాబట్టి, విష్ణు 'హౌస్ అఫ్ మంచూస్' పేరిట ఒక షో వస్తుంది అని చెప్పాడా, ఏమైనా మనోజ్, విష్ణు ఇద్దరూ క్లారిటీ ఇవ్వడం లేదు మీడియా వాళ్ళకి.

Updated Date - 2023-04-06T15:28:33+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!