Sitara - Pluto: ప్లూటో మృతి.. సితార భావోద్వేగ పోస్ట్‌

ABN , First Publish Date - 2023-08-17T15:15:05+05:30 IST

మహేష్‌ బాబు ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆయన కుటుంబ సభ్యులు ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న పెట్‌ ప్లూటో మరణించింది. ఈ విషయాన్ని నమత్రా, సితారా ఇన్‌స్టా వేదికగా పోస్ట్‌ చేశారు.

Sitara - Pluto: ప్లూటో మృతి.. సితార భావోద్వేగ పోస్ట్‌

మహేష్‌ బాబు (Maheshbabu) ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆయన కుటుంబ సభ్యులు ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న పెట్‌ ప్లూటో (Pet pluto) మరణించింది. ఈ విషయాన్ని నమత్రా, సితార(Sitara) ఇన్‌స్టా వేదికగా పోస్ట్‌ చేశారు. 'మనది ఏడేళ్ల బంధం.. మిస్‌ యూ' అంటూ సితార పోస్ట్‌ చేసింది. ఆ కుక్క పిల్లతో ఉన్న బంధం గురించి చెబుతూ ఎమోషన్‌ అయింది. సితార పోస్ట్‌కు నమ్రతా రిప్లై ఇచ్చారు. ఆమెను ఓదార్చే ప్రయత్నం చేశారు.

pluto.jpg

‘‘ప్లూటో ఎక్కడికి వెళ్లదు. మనతోనే ఉంటుంది.. మన ప్రేయర్స్‌లో ప్లూటో ఎప్పుడూ ఉంటుంది’’ అని సితార పోస్టుకు నమ్రత కామెంట్‌ పెట్టింది. ఇక నమ్రత సైతం ప్లూటో మృతిపై పోస్ట్‌ చేసింది. ‘నిన్ను ఎప్పటికీ మిస్‌ అవుతూనే ఉంటాం.. నువ్‌ మా గుండెల్లో ఎప్పటికీ ఉంటావ్‌’ అని పోస్ట్‌ చేసింది.వరల్డ్‌ కైండ్‌ డే సందర్భంగా, ఫ్లూటో పుట్టినరోజు సందర్భంగా సితార తన పెట్‌ గురించి పోస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే! అదే నా ప్రపంచం, నా సంతోషం అని పోస్ట్‌లో పేర్కొన్నారు.

Updated Date - 2023-08-17T15:58:19+05:30 IST