Mahesh - Namrata : ప్రతి అడుగు... నీ లక్ష్యానికి దగ్గరగా..

ABN , First Publish Date - 2023-08-31T17:07:42+05:30 IST

గౌతమ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు దంపతులు. మహేశ్‌ - నమ్రతల కుమారుడు గౌతమ్‌ 17వ వసంతంలోకి అడుగుపెడుతున్న వేళ శుభాకాంక్షలు చెబుతూ సోషల్‌ మీడియా వేదికగా పోస్‌ చేశారు.

Mahesh - Namrata : ప్రతి అడుగు... నీ లక్ష్యానికి దగ్గరగా..

గౌతమ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు దంపతులు. మహేశ్‌ - నమ్రతల కుమారుడు గౌతమ్‌ 17వ వసంతంలోకి అడుగుపెడుతున్న వేళ శుభాకాంక్షలు చెబుతూ సోషల్‌ మీడియా వేదికగా పోస్‌ చేశారు. ‘‘హ్యాపీ 17, మై ఛాంప్‌! నువ్వు వేసే ప్రతి అడుగు నీ లక్ష్యానికి దగ్గర చేయాలని, ఉన్న స్థాయికి ఎదిగేలా నడిపిస్తుందని ఆశిస్తూ లవ్‌ యూ సో మచ్‌ గౌతమ్‌’’ అని మహేశ్‌ పేర్కొన్నారు.

‘హ్యాపీ బర్త్‌డే గౌతమ్‌. సంవత్సరం పెరిగే కొద్దీ నేను ఎంతో గర్వించేలా చేస్తున్నావ్‌. నీ ఉన్నత స్థాయిని చూడటానికి ఎంతో ఆతురతగా ఎదురుచూస్తున్నా. నీ కలలన్నీ నెరవేరాలని, అనుకున్నది సాధించాలని కోరుకుంటున్నా. నీ పుట్టినరోజు మన కుటుంబానికి ఎంతో ప్రత్యేకం’’ అని నమ్రత పేర్కొన్నారు.

మహేశ్‌తోపాటు సేవా కార్యక్రమల్లో చురుగ్గా ఉండే గౌతమ్‌ ఇటీవల గుండె ఆపరేషన్‌, క్యాన్సర్‌ చికిత్స తీసుకుని కోలుకున్న చిన్నారులను కలిసి వారిలో మనోధైర్యాన్ని కలిగించారు.

Updated Date - 2023-08-31T17:08:04+05:30 IST