Dhanush 51: అటు కోలీవుడ్‌ స్టార్‌... టాలీవుడ్‌ కింగ్‌

ABN , First Publish Date - 2023-08-29T18:04:45+05:30 IST

కోలీవుడ్‌ నటుడు ధనుష్‌తో ఓ చిత్రానికి శ్రీకారం చుట్టారు దర్శకుడు శేఖర్‌ కమ్ముల. ఈ చిత్రంలో కింగ్‌ నాగార్జున భాగస్వామి కానున్నారని కొన్ని రోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే! ఇప్పుడు దానిపై అధికారిక ప్రకటన వచ్చింది.

Dhanush 51: అటు కోలీవుడ్‌ స్టార్‌... టాలీవుడ్‌ కింగ్‌

కోలీవుడ్‌ నటుడు ధనుష్‌తో ఓ చిత్రానికి శ్రీకారం చుట్టారు దర్శకుడు శేఖర్‌ కమ్ముల. ఈ చిత్రంలో కింగ్‌ నాగార్జున భాగస్వామి కానున్నారని కొన్ని రోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే! ఇప్పుడు దానిపై అధికారిక ప్రకటన వచ్చింది. నాగార్జున పుట్టినరోజును పురస్కరించుకుని నిర్మాతలు సునీల్‌ నారంగ్‌, పుస్కూర్‌ రామ్మోహన్‌రావు సోషల్‌ మీడియా వేదికగా నాగార్జునకు శుభాకాంక్షలు తెలిపి ఈ విషయాన్ని వెల్లడించారు. ఇప్పుడీ చిత్రంలో నాగార్జున కూడా అడుగుపెట్టనున్నారు. దీంతో ఈ చిత్రం మల్టీస్టారర్‌గా మారింది.

ఈ మల్టీస్టారర్‌ చిత్రానికి స్టార్‌ పెర్ఫార్మర్‌ కోసం వెతుకుతున్న మేకర్స్‌.. తన చరిష్మాతో తెరపై వెలుగులు నింపడానికి ‘కింగ్‌ కంటే ఎవరు బెటర్‌’ అని భావించారు మేకర్స్‌. అందుకే చిత్రంలో కీలక పాత్రకు నాగార్జుజను ఎంపిక చేశారు. ఈ విషయాన్ని నిర్మాతలు నేడు ప్రకటించారు. ఇక అభిమానులకు మాస్‌ జాతరే అని మేకర్స్‌ చెబుతున్నారు.

ధనుష్‌ హీరోగా నటిస్తున్న 51వ చిత్రమిది. ఇందులో రష్మిక కథనాయికగా నటించనుంది. సమాజంలోని అసమానతల నేపథ్యంలో ఈ సినిమా రూపొందనున్నట్లు ధనుష్‌ పుట్టిన రోజున విడుదల చేసిన కాన్సెప్ట్‌ పోస్టర్‌ చెబుతోంది. ధనుష్‌ ఈ చిత్రం కొత్త లుక్‌లో కనిపిస్తారని టాక్‌. త్వరలో ఈ చిత్రం సెట్స్‌ మీదకెళ్లనుంది.

Updated Date - 2023-08-29T18:04:45+05:30 IST